సర్జరీ చేయించుకోమన్నారు! | Deepika Padukone: Plastic surgery the worst advice ever! | Sakshi
Sakshi News home page

సర్జరీ చేయించుకోమన్నారు!

Published Tue, Oct 27 2015 12:01 AM | Last Updated on Sun, Sep 3 2017 11:31 AM

సర్జరీ చేయించుకోమన్నారు!

సర్జరీ చేయించుకోమన్నారు!

దీపికా పదుకోనే ఈ పేరు చెప్పగానే కళ్ళను కట్టిపడేసే అందాల తార గుర్తుకొస్తుంది. ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’, ‘గోలియోం కీ రాస్‌లీలా... రామ్‌లీలా’, ‘పీకూ’ లాంటి చిత్రాల్లో ఆమె అందం, అభినయం ఆహా అనిపించాయి. ఇవాళ భారతీయ సినీరంగంలో ఇంతమంది ఇంతగా మెచ్చుకుంటున్న ఈ దక్షిణాది అమ్మాయికి కూడా ఒకప్పుడు విమర్శలు తప్పలేదట. ఆశ్చర్యంగా ఉంది కదూ! సినిమాల్లో కెరీర్ ప్రారంభించక ముందు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవాల్సిందిగా దీపికా పదుకొనేకు కొందరు సలహా ఇచ్చారట. ఆ సంగతి స్వయంగా దీపికే ఇప్పుడు బయటపెట్టారు.

ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో దీపిక మాట్లాడుతూ, కెరీర్‌లో తనకు వచ్చిన అతి చెత్త సలహా అదేనంటూ గుర్తు చేసుకున్నారు. అప్పట్లో కొందరు తనకు అలా సలహా ఇచ్చినా, ఎందుకనో ఆ మాట వినలేదంది ఈ అందాల తార. సర్జరీలు ఏమీ చేయించుకోకుండా సహజమైన అందంతోనే ఇప్పుడింతగా పేరు తెచ్చుకున్నందుకు ఆనందం వ్యక్తం చేసింది. అప్పటి శ్రీదేవి దగ్గర నుంచి ఇవాళ్టి కొత్త తరం నటీమణుల దాకా చాలా మంది ప్లాస్టిక్ సర్జరీతో తమ అవయవ సౌష్టవాన్ని మెరుగుపరుచుకున్నారు. ఆ శ్రమ ఏమీ లేకుండానే దీపిక అందరినీ ఆకట్టుకోగలగడం అందానికే కాదు... అదృష్టానికి గీటురాయి కదూ!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement