
Deepika Padukone Reveals She Get Worst Advice At Her 18: బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె తనదైన నటన, అందంతో ప్రేక్షకులను, అభిమానులను ఎంతగానో అలరిస్తోంది. డైలాగ్ డెలివరీ, ఎక్స్ప్రెషన్స్తో బీటౌన్లో పాపులర్ హీరోయిన్గా స్టార్డమ్ తెచ్చుకుంది. అయితే ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ ప్రారంభంలో తనకు వచ్చిన చెత్త, ఉత్తమ సలహాలను గుర్తుచేసుకుంది. చెత్త సలహా గురించి చెబుతూ 'నా 18 ఏళ్ల వయసులో నన్ను ఒకరు బ్రెస్ట్ ఇంప్లాంట్స్ చేయించుకోండి అన్నారు. అయితే నేను దాన్ని సీరియస్గా తీసుకోనంత పరిణితిగా ఆలోచించా. అప్పుడే సున్నితమైన అంశాలపై పరిణితితో ఎలా ఆలోచించా అని నాకే ఆశ్చర్యంగా అనిపిస్తుంది.' అని చెప్పుకొచ్చింది.
ఇక తనకు వచ్చిన ఉత్తమ సలహా గురించి 'బాలీవుడ్లో నా మొదటి సినిమా షారుఖ్ ఖాన్కు జంటగా నటించిన ఓం శాంతి ఓం. షూటింగ్ టైంలో ఆయన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నా. ఆయన మంచి సలహాలు కూడా ఇస్తుంటారు. ఎప్పుడైనా సరే నీకు మంచి సమయాన్ని ఇచ్చే వ్యక్తులతోనే పనిచేయు. ఎందుకంటే ఒక పని కానీ, ఒక సినిమా కానీ చేస్తున్నావంటే అందులోనే నీ జీవితాన్ని గడుపుతావు. అవే జ్ఞాపకాలవుతాయి. అనుభవాలను ఇస్తాయి. అందుకే పనిచేసేటప్పుడూ చుట్టు ఉండే వ్యక్తులు కూడా ముఖ్యమే' అని దీపికా తెలిపింది. ఇదిలా ఉంటే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ కె సినిమాలో దీపికా నటిస్తున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment