అవన్నీ ‘ప్లాస్టిక్‌’ అందాలే.. | Bollywood Actresses Shocking Transformation | Sakshi
Sakshi News home page

కత్తిగాటుతో కొత్త అందాలు

Published Thu, Aug 20 2020 8:45 PM | Last Updated on Fri, Aug 21 2020 8:12 AM

Bollywood Actresses Shocking Transformation - Sakshi

అందంగా పుట్టడం మనిషికి దేవుడిచ్చిన వరం అన్నది ఒకప్పటి మాట! నేటి కాలంలో వైద్యులే దేవుళ్లవుతున్నారు.. అందాలను చెక్కేస్తున్నారు. అందవిహీనమైన శరీరాలను సైతం అపురూప శిల్పాలుగా మలుస్తున్నారు. అందుకే చాలా మంది సామాన్యుల నుంచి పెద్ద పెద్ద సెలబ్రెటీల వరకు కత్తిగాట్లకు మొగ్గుచూపుతున్నారు. ప్లాస్టిక్‌ సర్జరీలతో అందాలకు మెరుగులు దిద్దుకుంటున్నారు. నేడు అ‍గ్ర తారలుగా వెలుగొందుతున్న బాలీవుడ్‌ సుందరీమణుల్లో చాలా మందివి ప్లాస్టిక్‌ అందాలే కావటం విశేషం!!

1) శ్రీదేవి
బాలీవుడ్‌ అగ్రతారగా వెలుగొందిన దక్షిణాది భామ శ్రీదేవీ. తొలినాళ్లలోని శ్రీదేవికి, ఆ తర్వాతి శ్రీదేవికి అందంలో చాలా తేడా ఉందన్నది అక్షర సత్యం. ఆమె తన ముక్కుకు చేయించుకున్న సర్జరీనే కారణం.

2) జాన్వీ కపూర్‌
శ్రీదేవి ముద్దుల తనయ జాన్వీ కపూర్‌. ధడక్‌ చిత్రంతో బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దు గుమ్మ. బాలీవుడ్‌ ఎంట్రీకి ముందే తన ముక్కుకు ప్లాస్టిక్‌ సర్జరీ చేయించుకుని అందానికి మెరుగులు దిద్దుకుంది.

3) ప్రియాంక చోప్రా 
ఇంటర్‌ నేషనల్‌‌ స్టార్‌ ప్రియాంక చోప్రాది సైతం ప్లాస్టిక్‌ అందమే. సినిమాల్లోకి అడుగు పెట్టిన తర్వాత తన పెదవులకు సర్జరీ చేయించుకున్నారామె. ఈ సర్జరీ సంగతి అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. 

4) శిల్పా శెట్టి 
బాలీవుడ్‌ ఎగుమతి చేసుకున్న దక్షిణాది అందం శిల్పా శెట్టి. ‘బాజిగర్’‌ చిత్రంతో బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిందీ భామ. ఈమె కూడా తన అందానికి మెరుగులు దిద్దుకోవటానికి కత్తికి పని చెప్పారు. బాలీవుడ్‌ ఎంట్రీకి ముందే ముక్కుకు సర్జరీ చేయించుకున్నారు. 

5) అనుష్క శర్మ 
‘రబ్‌ నే బనాది జోడీ’ చిత్రంతో బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన దక్షిణాది ముద్దు గుమ్మ అనుష్క శర్మ. మొదటి చిత్రంతోనే షారుఖ్‌ వంటి అగ్ర తార సరసన నటించే అవకాశాన్ని కొట్టేసింది. ‘బాంబే వెల్‌వెట్‌ ’ సినిమా సమయంలో అనుష్క తన పెదవులకు సర్జరీ చేయించుకోవటం అప్పట్లో టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా‌ మారింది.

6) శామా సికిందర్‌ 
బాలీవుడ్‌ అందాల తారల్లో ఒకరు శామా సికిందర్‌. ‘ప్రేమ్‌ అగన్’‌ చిత్రంతో బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ టీవీ సిరీస్‌ ‘మాయ: స్లేవ్‌ ఆఫ్‌ హర్‌ డిసైర్స్‌’తో పాపులారిటీ సంపాదించింది. ఈమె తన అందానికి మెరుగులు దిద్దటానికి ఫేషియల్‌ ఫీచర్స్‌ సర్జరీ చేయించుకుంది. 

7) అలియా భట్‌


8) దీపికా పదుకునే  


9)  సోనమ్‌ కపూర్


10) రేఖ 


11) విద్యాబాలన్‌


12) రాణీ ముఖర్జీ 


13) లారా దత్

14) కరిష్మా కపూర్


15) బిపాసా బసు


16) ముగ్ధా గాడ్సే

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement