నేను 122 కేజీల బరువున్నాను. ఎత్తు 5 అడుగుల 11 అంగుళాలు. నేను ఇటీవల కూల్ స్కల్ప్‌టింగ్ విధానం ద్వారా, ఆపరేషన్ అవసరం లేకుండా బరువు తగ్గవచ్చని విన్నాను. దీని వల్ల నాకు ఉపయోగం ఉంటుందా?
- చంద్రశేఖర్, విజయవాడ
చాలామంది బరువు తగ్గించుకోడానికి లైపోసక్షన్, కూల్‌స్కల్ప్‌టింగ్‌లను ఆశ్రయిస్తుంటారు. ఇవి సాధారణ బరువు లేదా కొంచెం అధిక బరువు ఉండే వ్యక్తులు, శరీరంలోని కొన్ని ప్రాంతాలలో పేరుకు పోయిన కొవ్వును తొలగించుకోడానికీ, బాడీ షేపింగ్‌కు ఉపయోగపడే కాస్మటిక్ పద్ధతులు ఇవి శరీర కొవ్వు సెట్‌పాయింట్‌ను మార్చలేవు అందువల్ల వీటి ద్వారా శాశ్వతంగా బరువు తగ్గడం సాధ్యం కాదు. మొదట్లో కొంచెం కొవ్వు తగ్గినప్పటికీ, ఆర్నెల్ల నుంచి ఐదేళ్లలో కోల్పోయిన కొవ్వు మొత్తం తిరిగి చేరుతుంది. కొవ్వు సెట్‌పాయింట్‌ని తగ్గించలేని పద్ధతులేవీ శాశ్వతంగా బరువును తగ్గించలేవు. మీరు తీవ్ర స్థూలకాయ స్థాయిలో ఉన్నారు. కాబట్టి కూల్ స్కల్ప్‌టింగ్ మీకు ఉపయోగపడదు.
నాకు 24 ఏళ్లు. డిగ్రీ పూర్తయ్యింది. బరువు చాలా ఎక్కు ఉండటం వల్ల ఏ పెళ్లి సంబంధాలూ కుదరడం లేదు. బరువు తగ్గడానికి బేరియాట్రిక్ సర్జరీ చేయించుకొమ్మని మా ఫ్యామిలీ డాక్టరు సలహా ఇచ్చారు. ఫ్యూచర్లో పిల్లలు పుట్టడానికి ఈ సర్జరీ ఇబ్బందవుతుందేమోనని భయంగా ఉంది.
- ఒక సోదరి, వినుకొండ
నిజానికి సన్నగా ఉన్న మహిళలతో పోల్చి చూస్తే లావుగా ఉన్న మహిళలకు పిల్లలు పుట్టే అవకాశాలు తక్కువ. ప్రసవం కష్టమవుతుంది. అబార్షన్లు అయ్యే అవకాశం కూడా ఎక్కువ. శాశ్వతంగా బరువును తగ్గించుకోడానికి శాస్త్రీయంగా రుజువైన, సురక్షితమైన పద్ధతి ఒక్క బేరియాట్రిక్ సర్జరీ మాత్రమే. పిల్లలు లేనివారికి కూడా ఈ ఆపరేషన్ల్ తర్వాత పిల్లలు పుట్టే అవకాశాలు బాగా పెరుగుతాయని శాస్త్రీయంగా రుజువైంది. కాబట్టి మీరు నిర్భయంగా బేరియాట్రిక్ సర్జరీ చేయించుకోవచ్చు.
డాక్టర్ వి.అమర్
బేరియాట్రిక్ సర్జన్,
సిటిజన్స్ హాస్పిటల్, హైదరాబాద్
ఒబేసిటీ కౌన్సెలింగ్
Published Thu, May 14 2015 11:41 PM | Last Updated on Sun, Sep 3 2017 2:02 AM
Advertisement