బరువును నేను పట్టించుకోను! | Lakshmi Menon about her weight | Sakshi
Sakshi News home page

బరువును నేను పట్టించుకోను!

Published Sat, Nov 12 2016 2:56 AM | Last Updated on Mon, Sep 4 2017 7:50 PM

బరువును నేను పట్టించుకోను!

బరువును నేను పట్టించుకోను!

బరువు తనను ఏవిధంగానూ బాధించదని అంటున్నారు నటి లక్ష్మిమీనన్. కుంకీ, మంజాపై లాంటి చిన్న చిత్రాల ద్వారా నటిగా మంచి పేరు సంపాదించుకున్న ఈ మాలీవుడ్ భామకు ఆ తరువాత విశాల్, కార్తీ, జయంరవి లాంటి స్టార్ హీరోలతో నటించే అవకాశం లభించిది. అయినా ఎందుకనో ఈ అమ్మడు పోటీలో వెనక పడిపోయారు. నిజానికి లక్ష్మిమీనన్ నటించిన చిత్రాలు అధికశాతం విజయం సాధించాయి. ఆ మధ్య విశాల్‌తో లిప్‌లాక్ సన్నివేశాల్లో నటించి కాస్త కలకలం సృష్టించిన ఈ ముద్దుగుమ్మ కథకు అవసరం అనిపిస్తే గ్లామర్‌గా నటించడానికి అభ్యంతరం లేదని ప్రకటించారు కూడా. అలాగే విజయ్‌సేతుపతికి జంటగా నటించిన రెక్క చిత్రంలో మోడరన్ యువతిగా నటించారు. అయితే ఆ చిత్రంలో కాస్త బరువు పెరిగిందనే ప్రచారం జరుగుతోంది.

అంతే కాదు అది చాలా ఎఫెక్ట్ అయిందంటున్నారు కోలీవుడ్ వర్గాలు. లక్ష్మిమీనన్ బరువును చూసి ఆమెను ఎంపిక చేయాలనుకున్న దర్శక నిర్మాతలు నటీమణులు మంజిమామోహన్ లాంటి వర్ధమాన నటీమణులపై దృష్టిసారిస్తున్నారట. వారి పారితోషికం కూడా తక్కువ కావడం, వారి ఎదుగుదల కూడా ఇందుకు కారణం అనే ప్రచారం జరుగుతోంది. ఇది నటి లక్ష్మిమీనన్ చెవిని తాకిందట. అయితే ఈ విషయం గురించి ఈ భామ అస్సలు పట్టించుకోవడం లేదట. ప్రస్తుతం ఒక్క చిత్రం కూడా చేతిలో లేని లక్ష్మిమీనన్ ఇప్పుడు అవకాశాల వేటలో పడ్డారు. నటనకు అవకాశం ఉంటే ఇంతకు ముందు వేదాళం చిత్రంలో అజిత్‌తో కలిసి నటించినట్లు చెల్లెలి పాత్రల్లో కూడా నటించడానికి సిద్ధం అని అంటున్నారని తెలిసింది.

అదే విధంగా తనను ఒక ప్రముఖ నటిగా చూడకుండా సాధారణ నాయకిగానే చూడాలని, ఇంతకు ముందు దర్శక నిర్మాతలు అలానే భావించేవారని చెప్పుకొచ్చారు. ఇక బరువెక్కడం వల్ల అవకాశాలు రావన్న చింత తనకు లేదని, తనకు నప్పే పాత్రలయితే దర్శక నిర్మాతలు కచ్చితంగా తనకు అవకాశాలు ఇస్తారనే నమ్మకాన్ని వ్యక్తపరుస్తున్నారీ జాన.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement