malivud
-
ముగ్గురమ్మాయిలతో..
ఓ కాదల్ కణ్మణి చిత్రంతో రొమాంటిక్ హీరోగా తమిళ ప్రేక్షకుల మనసుల్ని దోచుకున్న మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్. మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి వారసుడైన ఈయన మాలీవుడ్‌లో మంచి క్రేజ్ ఉన్న నటుడు. వాౖయె మూడి పేసు చిత్రం ద్వారా కోలీవుడ్‌కు రంగప్రవేశం చేశారు. ఆ చిత్రం మంచి పేరునే తెచ్చి పెట్టింది. ఆ తరువాత మణిరత్నం దర్శకత్వంలో నిత్యామీనన్ తో కలిసి నటించిన రొమాంటిక్ ప్రేమ కథా చిత్రం దుల్కర్సల్మాన్ ను మరో మెట్టు ఎక్కించింది. మణిరత్నం మరో అవకాశం ఇవ్వచూపగా దుల్కర్ దాన్ని అందుకోలేకపోయారు. నిజానికి కీర్తి నటిస్తున్న కాట్రు వెలియడై చిత్రంలో నటించే అవకాశం మొదట దుల్కర్ సల్మాన్ నే వరించింది. ఆయన మలయాళ చిత్రాలతో బిజీగా ఉండడం వల్ల ఇందులో నటించలేకపోయారని సమాచారం.అంతే కాదు మరిన్ని కోలీవుడ్ అవకాశాలు తలుపు తట్టినా అంగీకరించని దుల్కర్సల్మాన్ తాజాగా ఒక నవ దర్శకుడికి పచ్చజెండా ఊపారు. ఆర్.కార్తీక్ అనే నవ దర్శకుడు దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్ సరసన ముగ్గురు ముద్దుగుమ్మలు యువళ గీతాలు పాడనున్నారట.అందులో నటి మేఘా ఆకాశ్, నివేదా పేతురాజ్ ఇప్పటికే ఎంపికయ్యారు. మరో నటి ఎంపిక జరుగుతుందని చిత్ర వర్గాలు తెలిపారు. మేఘా ఆకాశ్ ఇప్పటికే ధనుష్ సరసన గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఇనై నోక్కి పాయుం తోట్టా చిత్రంలో నటిస్తున్నారన్నది గమనార్హం. ప్రస్తుతం మలయాళంలో చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్న దుల్కర్ సల్మాన్ ఈ చిత్రానికి మే నుంచి కాల్షీట్స్ కేటాయించినట్లు తెలిసింది. -
బరువును నేను పట్టించుకోను!
బరువు తనను ఏవిధంగానూ బాధించదని అంటున్నారు నటి లక్ష్మిమీనన్. కుంకీ, మంజాపై లాంటి చిన్న చిత్రాల ద్వారా నటిగా మంచి పేరు సంపాదించుకున్న ఈ మాలీవుడ్ భామకు ఆ తరువాత విశాల్, కార్తీ, జయంరవి లాంటి స్టార్ హీరోలతో నటించే అవకాశం లభించిది. అయినా ఎందుకనో ఈ అమ్మడు పోటీలో వెనక పడిపోయారు. నిజానికి లక్ష్మిమీనన్ నటించిన చిత్రాలు అధికశాతం విజయం సాధించాయి. ఆ మధ్య విశాల్‌తో లిప్‌లాక్ సన్నివేశాల్లో నటించి కాస్త కలకలం సృష్టించిన ఈ ముద్దుగుమ్మ కథకు అవసరం అనిపిస్తే గ్లామర్‌గా నటించడానికి అభ్యంతరం లేదని ప్రకటించారు కూడా. అలాగే విజయ్‌సేతుపతికి జంటగా నటించిన రెక్క చిత్రంలో మోడరన్ యువతిగా నటించారు. అయితే ఆ చిత్రంలో కాస్త బరువు పెరిగిందనే ప్రచారం జరుగుతోంది. అంతే కాదు అది చాలా ఎఫెక్ట్ అయిందంటున్నారు కోలీవుడ్ వర్గాలు. లక్ష్మిమీనన్ బరువును చూసి ఆమెను ఎంపిక చేయాలనుకున్న దర్శక నిర్మాతలు నటీమణులు మంజిమామోహన్ లాంటి వర్ధమాన నటీమణులపై దృష్టిసారిస్తున్నారట. వారి పారితోషికం కూడా తక్కువ కావడం, వారి ఎదుగుదల కూడా ఇందుకు కారణం అనే ప్రచారం జరుగుతోంది. ఇది నటి లక్ష్మిమీనన్ చెవిని తాకిందట. అయితే ఈ విషయం గురించి ఈ భామ అస్సలు పట్టించుకోవడం లేదట. ప్రస్తుతం ఒక్క చిత్రం కూడా చేతిలో లేని లక్ష్మిమీనన్ ఇప్పుడు అవకాశాల వేటలో పడ్డారు. నటనకు అవకాశం ఉంటే ఇంతకు ముందు వేదాళం చిత్రంలో అజిత్‌తో కలిసి నటించినట్లు చెల్లెలి పాత్రల్లో కూడా నటించడానికి సిద్ధం అని అంటున్నారని తెలిసింది. అదే విధంగా తనను ఒక ప్రముఖ నటిగా చూడకుండా సాధారణ నాయకిగానే చూడాలని, ఇంతకు ముందు దర్శక నిర్మాతలు అలానే భావించేవారని చెప్పుకొచ్చారు. ఇక బరువెక్కడం వల్ల అవకాశాలు రావన్న చింత తనకు లేదని, తనకు నప్పే పాత్రలయితే దర్శక నిర్మాతలు కచ్చితంగా తనకు అవకాశాలు ఇస్తారనే నమ్మకాన్ని వ్యక్తపరుస్తున్నారీ జాన. -
రొమాన్సే కష్టం అనిపించింది
రొమాన్స్ సన్నివేశాల్లో నటించడం చాలా కష్టం అనిపించిందన్నారు వర్ధమాన నటి మంజిమా మోహన్. మాలీవుడ్ నుంచి దిగుమతి అయిన మరో తాజా నటి మంజిమామోహన్. నటనా ప్రతిభ అన్నది ఏ నటికై నా నటుడికై నా ముఖ్యమే. అయితే ఆ విషయాన్ని అటుంచితే అదృష్టం చాలా అవసరం. ఇక నటనకు అదృష్టం తోడైతే వారు చేరుకునే స్థానం చాలా వేగంగా ఉంటుంది. నటి మంజిమామోహన్‌ను ఈ కోవకు చెందిన నటిగా భావించవచ్చు.అలాగని కథానాయకిగా పలు చిత్రాలు చేసిన అనుభవం ఆ బ్యూటీకి లేదు.అయితే పువ్వుపుట్టగానే పరిమళిస్తుందన్న నానుడిని గుర్తుకు తెచ్చే నటి మంజిమామోహన్.బాల నటిగా మాలీవుడ్‌లో కలియూంజల్ అనే చిత్రం ద్వారా పరిచయమైన ఈ భామ మధుదరనోంబరకట్టు అనే చిత్రంలో ఉత్తమ నటనకు గానూ కేరళా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అవార్డును అందుకున్నారు. అలా అరడజనుకు పైగా చిత్రాల్లో నటించిన మంజిమామోహన్ ఆపై చదువుపై దృష్టి సారించి డిగ్రీ పూర్తి చేశారు. ప్లస్‌టూ వరకూ కేరళ, తిరువనంతపురంలో చదివిన మంజిమామోహన్ డిగ్రీ పట్టాను మాత్రం చెన్నై లోనే అందుకున్నారు.చెన్నైలోని స్టెల్లా మేరీస్ కళాశాలలో బీఎస్సీ మ్యాథ్స్ చదివిన ఈ భామకు మళ్లీ నటనపై మోజు పుట్టుకొచ్చిందట.అంతే ఒరు వణక్కన్ సెల్ఫీ చిత్రం ద్వారా కథానాయకిగా రంగప్రవేశం చేశారు.ఆ చిత్రం తరువాత కోలీవుడ్ అవకాశం వరించింది.అదే శింబుకు జంటగా అచ్చంయన్బదు మడమయడా చిత్రం.మంజిమామోహన్‌ను లక్కీగర్ల్ అని పేర్కొనడానికి కారణం ఇదే చిత్ర తెలుగు వెర్షన్ సాహసమే శ్వాసగా సాగిపోలోనూ నాగచైతన్యకు జంటగా నటించారు ఈ చిత్రం రెండు భాషల్లోనూ శుక్రవారం తెరపైకి రానుంది.ఈ సందర్భంగా ఈ మాలీవుడ్ బ్యూటీతో సాక్షీ చిన్న చిట్‌చాట్.. ప్ర: నటి అవ్వాలన్న కోరికకు బలమైన కారణం ఏమైనా ఉందా? జ: మాది కళా నేపథ్య కుటుంబం. అయితే నేను బాల నటిగా పరిచయం అవడం యాదృశ్చికంగానే జరిగింది.ఆ తరువాత నటనను కంటిన్యూ చేయడానికి నాన్న ఒప్పుకోలేదు.ముందు చదువు పూర్తి చేయమన్నారు.అయితే అమ్మ ప్రోత్సాహం నన్ను నాయకిని చేసిందనే చెప్పాలి. ప్ర: అచ్చంయన్భదు మడమయడా చిత్రంలో అవకాశం ఎలా వచ్చింది? జ: నేను నటించిన మలయాళ చిత్రం ఒరు వడక్కన్ సెల్ఫీ చిత్రం చూసిన దర్శకుడు గౌతమ్‌మీనన్ తమ చిత్రంలో నటించడానికి అడిషన్‌కు పిలిచారు. అలా అచ్చంయన్భదు మడమయడా చిత్రంలో నటించే అవకాశం వరించింది. ప్ర: అచ్చంయన్భదు మడమయడా చిత్రం గురించి? జ: చిత్ర వివరాలను నేను ఇప్పుడు చెప్పలేను గానీ, ఇందులో నాది చాలా క్యూట్ పాత్ర.అందరి హృదయాలను దోచుకునే పాత్ర. ప్ర. తమిళంలో శింబుతోనూ, తెలుగులో నాగచైతన్యతోనూ నటించారు.ఆ అనుభవం గురించి? జ: చాలా వినూత్న అనుభవం అనే చెప్పాలి. శింబు వర్క్‌లో చాలా డెడికేటెడ్. నాగచైతన్య హర్డ్ వర్కర్.చాలా స్వీట్ పర్సన్.వారిద్దరితో నటించడం చాలా మంచి అనుభవం. ప్ర: ఎలాంటి సన్నివేశాల్లో నటించడం కష్టం అనిపించింది? జ: నిజం చెప్పాలంటే ఎమోషన్స సన్నివేశాల్లో నటించడానికి కూడా కష్ట పడలేదుగానీ, రొమాన్స సన్నివేశాల్లో నటించడం చాలా కష్టం అనిపించింది.తమిళ వెర్షన్లో సులభంగానే నటించాను.తెలుగు వెర్షన్లో నటించడానికి కాస్త శ్రమ పడాల్సి వచ్చింది. ప్ర: తమిళంలో ఇతర అవకాశాల గురించి? జ: ప్రస్తుతం విక్రమ్ ప్రభుకు జంటగా ముడిచూడ మన్నన్ చిత్రంలో నటిస్తున్నాను.అదే విధంగా గౌరవ్ నారాయణన్ దర్శకత్వంలో ఒక చిత్రం, పన్నీర్ సెల్వమ్ దర్శకత్వంలో మరో చిత్రం అంగీకరించాను. ప్ర: తెలుగులో అవకాశాలు వస్తున్నాయా? జ: అవకాశాలు వస్తున్నాయి కానీ, సాహసమే శ్వాసగా సాగిపో చిత్రం విడుదల కోసం ఎదురు చూస్తున్నాను. -
ప్రతిభకు తగ్గ పారితోషికం లేదు
ప్రతిభకు తగ్గ పారితోషికం ఇవ్వడంలేదంటూ కోలీవుడ్‌పై ఆరోపణలు గుప్పిస్తోంది నటి అనన్య. నాడోడిగళ్ చిత్రం ద్వారా తమిళచిత్ర పరిశ్రమకు పరిచయం అయిన ఈ మలయాళ కుట్టి గుర్తుందా? ఇక్కడ తొలి చిత్రం విజయం సాధించడంతో అమ్మడికి అవకాశాలు వరుస కట్టాయి. శీడన్, ఎంగేయుమ్ ఎప్పోదుమ్, పులివాలు, ఇరవుపగలు చిత్రాల్లో నటించేసింది. అయితే వీటిలో ఎంగేయుమ్ఎప్పోదుమ్ చిత్రం మినహా ఏ చిత్రం విజయం సాధించలేదు. ఫలితం అవకాశాలు అడుగంటాయి. మధ్యలో తెలుగు తదితర ఇతర భాషల్లోనూ అదృష్టాన్ని పరిరక్షించుకున్నా ఫలితం శూన్యం. దీంతో మళ్లీ మాలీవుడ్‌కు పీచేమూడ్ అంది. ఇంత జరిగినా ఈ కేరళ కుట్టి అందాలారబోతకు తాను దూరం అంటోంది. సరే తమిళంలో నటించడంలేదేంటి అని అంటే అవకాశాలు రావడంలేదని చెప్పకుండా కోలీవుడ్ లో ప్రతిభకు దగ్గ పారితోషికం ఇవ్వడం లేదు అందుకే తమిళ చిత్రాల అవకాశాల్ని అంగీకరించడం లేదు అంటూ ఈ అమ్మడు కుంటి సాకులు చెబుతోంది. డొంక తిరుగుడు సమాధానం అంటే ఇదేనేమో నంటున్నారు కోలీవుడ్ వర్గాలు.