రొమాన్సే కష్టం అనిపించింది | Sakshi chit chat with Manjimamohan | Sakshi
Sakshi News home page

రొమాన్సే కష్టం అనిపించింది

Published Thu, Nov 10 2016 3:23 AM | Last Updated on Mon, Sep 4 2017 7:39 PM

రొమాన్సే కష్టం అనిపించింది

రొమాన్సే కష్టం అనిపించింది

రొమాన్స్  సన్నివేశాల్లో నటించడం చాలా కష్టం అనిపించిందన్నారు వర్ధమాన నటి మంజిమా మోహన్. మాలీవుడ్ నుంచి దిగుమతి అయిన మరో తాజా నటి మంజిమామోహన్. నటనా ప్రతిభ అన్నది ఏ నటికై నా నటుడికై నా ముఖ్యమే. అయితే ఆ విషయాన్ని అటుంచితే అదృష్టం చాలా అవసరం. ఇక నటనకు అదృష్టం తోడైతే వారు చేరుకునే స్థానం చాలా వేగంగా ఉంటుంది. నటి మంజిమామోహన్‌ను ఈ కోవకు చెందిన నటిగా భావించవచ్చు.అలాగని కథానాయకిగా పలు చిత్రాలు చేసిన అనుభవం ఆ బ్యూటీకి లేదు.అయితే పువ్వుపుట్టగానే పరిమళిస్తుందన్న నానుడిని గుర్తుకు తెచ్చే నటి మంజిమామోహన్.బాల నటిగా మాలీవుడ్‌లో కలియూంజల్ అనే చిత్రం ద్వారా పరిచయమైన ఈ భామ మధుదరనోంబరకట్టు అనే చిత్రంలో ఉత్తమ నటనకు గానూ కేరళా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అవార్డును అందుకున్నారు.

అలా అరడజనుకు పైగా చిత్రాల్లో నటించిన మంజిమామోహన్ ఆపై చదువుపై దృష్టి సారించి డిగ్రీ పూర్తి చేశారు. ప్లస్‌టూ వరకూ కేరళ, తిరువనంతపురంలో చదివిన మంజిమామోహన్ డిగ్రీ పట్టాను మాత్రం చెన్నై లోనే అందుకున్నారు.చెన్నైలోని స్టెల్లా మేరీస్ కళాశాలలో బీఎస్‌సీ మ్యాథ్స్ చదివిన ఈ భామకు మళ్లీ నటనపై మోజు పుట్టుకొచ్చిందట.అంతే ఒరు వణక్కన్ సెల్ఫీ చిత్రం ద్వారా కథానాయకిగా రంగప్రవేశం చేశారు.ఆ చిత్రం తరువాత కోలీవుడ్ అవకాశం వరించింది.అదే శింబుకు జంటగా అచ్చంయన్బదు మడమయడా చిత్రం.మంజిమామోహన్‌ను లక్కీగర్ల్ అని పేర్కొనడానికి కారణం ఇదే చిత్ర తెలుగు వెర్షన్ సాహసమే శ్వాసగా సాగిపోలోనూ నాగచైతన్యకు జంటగా నటించారు ఈ చిత్రం రెండు భాషల్లోనూ శుక్రవారం తెరపైకి రానుంది.ఈ సందర్భంగా ఈ మాలీవుడ్ బ్యూటీతో సాక్షీ చిన్న చిట్‌చాట్..

 ప్ర: నటి అవ్వాలన్న కోరికకు బలమైన కారణం ఏమైనా ఉందా?
 జ: మాది కళా నేపథ్య కుటుంబం. అయితే నేను బాల నటిగా పరిచయం అవడం యాదృశ్చికంగానే జరిగింది.ఆ తరువాత నటనను కంటిన్యూ చేయడానికి నాన్న ఒప్పుకోలేదు.ముందు చదువు పూర్తి చేయమన్నారు.అయితే అమ్మ ప్రోత్సాహం నన్ను నాయకిని చేసిందనే చెప్పాలి.

 ప్ర: అచ్చంయన్భదు మడమయడా చిత్రంలో అవకాశం ఎలా వచ్చింది?
 జ: నేను నటించిన మలయాళ చిత్రం ఒరు వడక్కన్ సెల్ఫీ చిత్రం చూసిన దర్శకుడు గౌతమ్‌మీనన్ తమ చిత్రంలో నటించడానికి అడిషన్‌కు పిలిచారు. అలా అచ్చంయన్భదు మడమయడా చిత్రంలో నటించే అవకాశం వరించింది.

 ప్ర: అచ్చంయన్భదు మడమయడా చిత్రం గురించి?
 జ: చిత్ర వివరాలను నేను ఇప్పుడు చెప్పలేను గానీ, ఇందులో నాది చాలా క్యూట్ పాత్ర.అందరి హృదయాలను దోచుకునే పాత్ర.

 ప్ర. తమిళంలో శింబుతోనూ, తెలుగులో నాగచైతన్యతోనూ నటించారు.ఆ అనుభవం గురించి?
 జ: చాలా వినూత్న అనుభవం అనే చెప్పాలి. శింబు వర్క్‌లో చాలా డెడికేటెడ్. నాగచైతన్య హర్డ్ వర్కర్.చాలా స్వీట్ పర్సన్.వారిద్దరితో నటించడం చాలా మంచి అనుభవం.

 ప్ర: ఎలాంటి సన్నివేశాల్లో నటించడం కష్టం అనిపించింది?
 జ: నిజం చెప్పాలంటే ఎమోషన్‌‌స సన్నివేశాల్లో నటించడానికి కూడా కష్ట పడలేదుగానీ, రొమాన్‌‌స సన్నివేశాల్లో నటించడం చాలా కష్టం అనిపించింది.తమిళ వెర్షన్‌లో సులభంగానే నటించాను.తెలుగు వెర్షన్‌లో నటించడానికి కాస్త శ్రమ పడాల్సి వచ్చింది.

 ప్ర: తమిళంలో ఇతర అవకాశాల గురించి?
 జ: ప్రస్తుతం విక్రమ్ ప్రభుకు జంటగా ముడిచూడ మన్నన్ చిత్రంలో నటిస్తున్నాను.అదే విధంగా గౌరవ్ నారాయణన్ దర్శకత్వంలో ఒక చిత్రం, పన్నీర్ సెల్వమ్ దర్శకత్వంలో మరో చిత్రం అంగీకరించాను.

 ప్ర: తెలుగులో అవకాశాలు వస్తున్నాయా?
 జ: అవకాశాలు వస్తున్నాయి కానీ, సాహసమే శ్వాసగా సాగిపో చిత్రం విడుదల కోసం ఎదురు చూస్తున్నాను.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement