సురేశ్‌ నన్ను కొట్టేశారు! | Sivakarthikeyan to launch the audio of `Ippadai Vellum` | Sakshi
Sakshi News home page

సురేశ్‌ నన్ను కొట్టేశారు!

Published Sat, Oct 14 2017 5:33 AM | Last Updated on Sat, Oct 14 2017 5:33 AM

Sivakarthikeyan to launch the audio of `Ippadai Vellum`

తమిళసినిమా: నటుడు ఆర్‌కే.సురేశ్‌ తనను కొట్టేశారని అంటున్నారు మరో నటుడు ఉదయనిధిస్టాలిన్‌. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ఇప్పడై వెల్లుమ్‌. లైకా సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి గౌరవ్‌ నారాయణన్‌ దర్శకుడు. నటి మంజిమామోహన్‌ కథా నాయకిగా నటిస్తున్న ఇందులో ఆర్‌కే.సురేశ్, డేనియల్‌బాలాజి, రాధిక ము ఖ్యపాత్రలను పొషిస్తున్నారు. డి.ఇమాన్‌ సంగీ తాన్ని అందిస్తున్న ఈ చిత్ర ఆడియో ఆవి ష్కరణ కార్యక్రమం గురువారం సాయంత్రం స్థానిక ట్రిపుల్‌కేన్‌లోని కలైవానర్‌ ఆవరణలో ఘనంగా జరిగింది. 

కార్యక్రమంలో నటుడు శివకార్తికేయన్‌ ముఖ్యఅతిథిగా పా ల్గొని చిత్ర ఆడియోను ఆవిష్కరించారు. అ నంతరం చిత్ర కథానా యకుడు ఉదయనిధిస్టాలిన్‌ మాట్లాడుతూ ఇప్పడై వెల్లుమ్‌ చిత్రం లో నటించడం మంచి అనుభవం అన్నారు. అయితే చిత్ర ఫైట్‌ సన్నివేశాల్లో నటుడు డేని యల్‌ బాలాజీతో నటించినప్పుడు ఎలాంటి సమస్య లేదుగానీ, నటుడు ఆర్‌కే.సురేశ్‌తో ఫైట్‌ చేసినప్పుడే దెబ్బలు తిన్నానని చెప్పా రు. ఆయన ఫైట్‌ సన్నివేశంలో నిజంగానే నన్ను కొట్టేశారని, ఈ విషయాన్ని ఫైట్‌ మాస్టర్‌కు చెప్పి నొప్పిపుడుతోందని ఏడ్చేశానని పేర్కొన్నారు.

అయితే చిత్రంలో పోరాట సన్నివేశాలు సహజంగా రావాలని దెబ్బలు తింటూనే నటించేశానని అన్నారు. ఈ కార్యక్రమంలో ముందుగా చిత్రంలోని పాటలకు నృత్యకళాకారులు నర్తించి ఆనందపరిచారు. ఇక చిత్ర కథానాయకి మంజామా మోహన్‌ కూ డా ఆడేసి ఆహూతులను అలరించారు. అదే విధంగా శివకార్తికేయన్‌ ఉదయనిధితో కలిసి స్టెప్స్‌ వేయడంతో ఆ ప్రాంగణం ఈలలు, చప్పట్లతో మారు మోగిపోయింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement