సాక్షి, చెన్నై: హీరో ఉదయనిధి స్టాలిన్‌తో రొమాన్స్‌కు ఓకే చెప్పేసిందట మిల్కీబ్యూటీ తమన్నా. ఈ మధ్య ఆ సుందరి కొత్త కాంబినేషన్‌లో నటించడానికిఆసక్తి చూపుతున్నట్లు కనిపిస్తోంది. నటుడు శింబుతో అన్భానవన్ అసరాదవన్ అడంగాదవన్, విజయ్‌సేతుపతితో ధర్మదురై, విక్రమ్‌తో స్కెచ్, విశాల్‌తో కత్తిసండై ఇలా అన్నీ కొత్త కాంబినేషన్స్‌లోనే నటించింది. ఈ అమ్మడికి టాలీవుడ్, బాలీవుడ్‌లలో చేతిలో రెండు మూడు చిత్రాలు ఉన్నా, కోలీవుడ్‌లో స్కెచ్ చిత్రం తరువాత నెక్ట్స్ ఏంటీ అనే ప్రశ్న తలెత్తుతోంది.
ఈ తరుణంలో మరో అవకాశం తమన్నాను వెతుక్కుంటూ వచ్చింది. తమన్నా ప్రస్తుతం హిందీ చిత్రం క్వీన్ తెలుగు రీమేక్‌లో నటిస్తూ బిజీగా ఉంది. ఇక తమిళంలో విక్రమ్‌కు జంటగా నటిస్తున్న స్కెచ్ చిత్రం నిర్మాణం చివరి దశకు చేరుకుంది. తాజాగా ఉదయనిధిస్టాలిన్‌కు జతగా నటించడానికి ఓకే చెప్పేసింది. యువ నటుడు ఉదయనిధిస్టాలిన్ ఇప్పుడు చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఆయన ప్రియదర్శన్ దర్శకత్వంలో నటించిన నిమిర్ చిత్రం జనవరి చివర్లో విడుదలకు రెడీ అవుతోంది.
తాజాగా శీనూరామసామి దర్శకత్వంలో నటించడానికి రెడీ అవుతున్నారు. ఇంకా కన్నన్ దర్శకత్వంలో నటించడానికి పచ్చజెండా ఊపేశారు. ఇందులోనే ఆయనతో మిల్కీబ్యూటీ నటించనుంది. దీనికి కన్నే కలై మానే అనే టైటిల్‌ను నిర్ణయించారు. తెలుగు రీమేక్ క్వీన్ చిత్రానికి బల్క్ కాల్‌షీట్స్ ఇచ్చిన తమన్నా, మరో పక్క బాలీవుడ్ చిత్రాల్లోనూ నటిస్తూ బిజీగా ఉంది. తాజాగా ఉదయనిధిస్టాలిన్‌తో నటించడానికి పచ్చజెండా ఊపేసింది. ఇందులో తమన్న పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంటుందంటున్నాయి చిత్ర వర్గాలు.
Comments
Please login to add a commentAdd a comment