ముమ్మరంగా ప్రచారం | Intensified campaign | Sakshi
Sakshi News home page

ముమ్మరంగా ప్రచారం

Published Mon, Apr 7 2014 2:04 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

ముమ్మరంగా ప్రచారం - Sakshi

ముమ్మరంగా ప్రచారం

  • = రంగంలోకి నేతలు
  •  = ప్రత్యేక ఆకర్షణగా సినీ గ్లామర్
  •  = ఆరోపణలు, విమర్శల హోరు
  •  = గెలుపు లక్ష్యంగా పరుగో..పరుగు
  •  నామినేషన్ల పర్వం ముగియడంతో రాష్ర్టంలో ఎన్నికల ప్రచారం వేడెక్కింది. ప్రధాన పార్టీల ముఖ్య నాయకులందరూ ప్రచార బాట పట్టారు. సినీ గ్లామర్ల ప్రచారం ప్రత్యేక ఆకర్షణగా సాగుతోంది. ఒకరి మీద మరొకరు విమర్శలు, ఆరోపణాస్త్రాలను సంధిస్తూ ప్రచారంలో హోరెత్తిస్తున్నారు. తమ తమ అభ్యర్థుల గెలుపు లక్ష్యంగా పరుగులు తీస్తున్నారు.
     
    సాక్షి, చెన్నై :ఎన్నికల నగారా మోగిన నాటి నుంచే రాష్ట్రంలో వాతావరణం వేడెక్కింది. నామినేషన్ల పర్వం శనివారంతో ముగియడంతో లోక్‌సభ ఎన్నికల సందడి మరింతగా రాజుకున్నది. రాష్ట్రంలోని 39 స్థానాల బరిలో పోటీకి 1318 మంది నామినేషన్లు దాఖలు చేశారు.

    వీరిలో 1198 మంది పురుషులు, 118 మంది స్త్రీలు ఉన్నారు. మరో ఇద్దరు హిజ్రాలు. నామినేషన్ల పర్వం ముగియడంతో ఎన్నికల వాతావరణం పూర్తిగా మారింది. ప్రచారం వేడెక్కింది. పంచముఖ సమరం నెలకొన్న దృష్ట్యా, ఎవరికి వారు తమ అభ్యర్థుల గెలుపు లక్ష్యంగా కసరత్తుల్లో నిమగ్నమయ్యూరు. ఒంటరిగా ఎన్నికలను ఎదుర్కొంటున్న అన్నాడీఎంకే అందరి కన్నా ముందుగా అభ్యర్థుల్ని ప్రకటించింది. ప్రచారంలో సైతం దూసుకెళుతోంది.
     
    ఆగమేఘాలతో ప్రచారం: అన్నాడీఎంకే అభ్యర్థుల ప్రచారం ఆగమేఘాల మీద సాగుతున్నది. ఆ పార్టీ అధినేత్రి జయలిత హెలికాప్టర్లలో చక్కర్లు కొడుతూ బహిరంగ సభల రూపంలో ఓట్ల వేటలో నిమగ్నం అయ్యారు. ఇప్పటికే ఆమె దాదాపు సగానికి పైగా లోక్‌సభ నియోజకవర్గాల్లో ప్రచారం ముగించారు. ఆ పార్టీకి మద్దతుగా రాష్ట్ర మంత్రులు 32 మంది నియోజకవర్గాల్లో తిష్ట వేసి ఓటర్లను ఆకర్షించే పనిలో తీవ్రంగా కసరత్తుల్లో ఉన్నారు.

    ఇక పార్టీకి ప్రత్యేక ఆకర్షణగా సినీ గ్లామర్ కూడా ఉంది. ఆ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ఎస్‌ఎంకే నేత, నటుడు శరత్‌కుమార్, నటీమణులు వింధ్య, కుయిలి, నటులు రామరాజన్, ఆనందరాజ్, సెంథిల్, సింగముత్తు తదితరులు రోడ్ షోల రూపంలో అలరిస్తున్నారు. సినీ డైలాగులతో ఓటర్లను ఆకర్షిస్తున్నారు. అన్నాడీఎంకే ప్రచారం అంతా, కాంగ్రెస్, డీఎంకేను టార్గెట్ చేసి సాగుతోంది.

    కరుణాస్త్రం: వీసీకే, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, మనిద నేయ మక్కల్ కట్చి, పుదియ తమిళగం, డీఎంకేలు కలసికట్టుగా డీపీఏ కూటమిని ఏర్పాటు చేసుకున్నారుు. ఈ కూటమి అభ్యర్థుల గెలుపు లక్ష్యంగా డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్ సుడిగాలి పర్యటన చేస్తున్నారు. తొలి విడత ప్రచారం ముగించి, రెండో విడత ప్రచార బాటకు ఆయన సిద్ధం అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రచారానికి దూరంగా ఉన్న కరుణానిధి ప్రస్తుతం ప్రజల్లోకి రావడంతో ఆ పార్టీలో ఉత్సాహం రెట్టింపు అయింది.

    రోజుకు రెండు నియోజకవర్గాలను ఎంపిక చేసుకుని బహిరంగ సభల రూపంలో కరుణానిధి ప్రచారం సాగుతోంది. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి అన్భళగన్‌తోపాటు ఎంపీ, కరుణానిధి గారాల పట్టి కనిమొళి, నటి ఖుష్బు, నటుడు వాగై చంద్రశేఖర్ ప్రచారంలో దూసుకె ళ్తున్నారు. కేంద్రంలోని కాంగ్రెస్ సర్కారు తమ మీద నిందల్ని వేసిందని, జాలర్లు, ఈలం తమిళుల మీద తమకున్న ప్రేమ చాటుకునే విధంగా ఓటర్లను ఆకర్షించే ప్రయత్నంలో డిఎంకే శ్రేణులు ఉన్నారు.
     
    మోడీ జపం : అన్నాడీఎంకే, డీఎంకేలు ఒకరి మీద మరొకరు విమర్శలు, ఆరోపణలను గుప్పిస్తూ ఓట్ల వేటలో ఉంటే, బీజేపీ కూటమి మాత్రం మోడీ జపంతో ముందుకు సాగుతోంది. ఈ కూటమిలోని డీఎండీకే నేత విజయకాంత్, ఆయన సతీమణి ప్రేమలత మాత్రమే రాష్ట్ర వ్యాప్తంగా కూటమికి మద్దతుగా ప్రచారం చేస్తూ వస్తున్నారు.

    ఆ కూటమిలోని ఎండీఎంకే నేత వైగో తాను పోటీ చేస్తున్న స్థానాన్ని ఓ వైపు చూసుకుంటూ, మరో వైపు తమ అభ్యర్థులు బరిలో ఉన్న చోట అడపాదడపా ప్రచారం చేస్తూ వస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అగ్ర నాయకులు పొన్ రాధాకృష్ణన్, ఇలగణేషన్ సైతం ఎన్నికల బరిలో ఉన్నారు. పీఎంకే నేత రాందాసు తన అభ్యర్థులకు మద్దతుగా ప్రచారంలో నిమగ్నం అయ్యారు. డీఎంకే, అన్నాడీఎంకే, కాంగ్రెస్‌లపై విమర్శలు గుప్పిస్తూ బీజేపీ కూటమి ప్రచారం సాగుతోంది.
     
    కాంగ్రెస్ తీరు: తమను ద్రవిడ పార్టీలు చీదరించుకోవడంతో ఆ రెండు ప్రధాన ఆపార్టీలపై విమర్శలు గుప్పిస్తూ ఓటర్లను ఆకర్షించే పనిలో రాష్ట్ర కాంగ్రెస్ ఉంది. ఆ పార్టీ కేంద్ర మంత్రులు పీ చిదంబరం, జికే వాసన్, సుదర్శన నాచ్చియప్పన్, మాజీ మంత్రులు ఈవీకేఎస్ ఇళంగోవన్, జయంతి నటరాజన్‌లు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఆ పార్టీ రాష్ర్ట అధ్యక్షుడు జ్ఞానదేశిక న్ అన్ని చోట్ల పర్యటిస్తూ ఓట్ల వేటలో ఉన్నారు.  
     
    ఒక్క చాన్స్: ఇన్నాళ్లు డీఎంకే లేదా, అన్నాడీఎంకే కూటమి ద్వారా తమకు పట్టున్న స్థానాల్లో పోటీ చేస్తూ వచ్చిన వామపక్షాలు ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. ఒంటరిగా ఎన్నికలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి సీపీఎం, సీపీఐలకు వ చ్చింది. అభ్యర్థులు బరిలో ఉన్న 18 చోట్ల  ఆ పార్టీల రాష్ట్ర కార్యదర్శులు టీ పాండియన్, రామకృష్ణన్‌తో పాటుగా జిల్లా స్థాయి నేతలు ప్రచారంలో ఉరకలు తీస్తున్నారు. బీజేపీ, డీఎంకే, అన్నాడీఎంకే, కాంగ్రెస్ తీరును ఎండగడుతూ ప్రచారంలో ఓటర్లను వామపక్ష నేతలు ఆకర్షిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement