
'నా బరువుపై కుటుంబ సభ్యుల్లో ఆందోళన'
సినిమా హీరోలు తమ పాత్రల్లో ఇమిడిపోవడం కోసం విన్నూత్నమైన ప్రయోగాలకు సిద్ధమవుతుంటారు. ఇక బాలీవుడ్ నటుడు అమిర్ ఖాన్ అయితే ఆ వరుసలో ముందుంటాడు.
ముంబై: సినిమా హీరోలు తమ పాత్రల్లో ఇమిడిపోవడం కోసం విన్నూత్నమైన ప్రయోగాలకు సిద్ధమవుతుంటారు. ఇక బాలీవుడ్ నటుడు అమిర్ ఖాన్ అయితే ఆ వరుసలో ముందుంటాడు. తన తదుపరి చిత్రంలో సహజత్వం కోసం అమిర్ ఈ మధ్య బాగా బరువు పెరిగాడు. గజని, పీకే చిత్రాల్లో విలక్షణ పాత్రలో కనిపించిన అమిర్ తన తాజా చిత్రం కోసం 95 కేజీలకు పైగా బరువు పెరిగాడట. ఇది కాస్తా అమిర్ కుటుంబ సభ్యుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. సినిమాల కోసం బరువు తగ్గడం, పెరగడం వంటి ప్రయోగాలు పదే పదే చేయడం పట్ల అమ్మ, భార్య కలత చెందుతుందని అమిర్ స్పష్టం చేశాడు.
'ప్రస్తుతం నేను పెరిగిన బరువుతో నా శ్వాసలో తేడా వచ్చింది. నా యొక్క షూ లేస్ కట్టుకోవడానికి కూడా ఇబ్బంది ఏర్పడుతుంది. 20 సెకండ్లకు ఒకసారి పెద్దగా ఊపిరి తీసుకోవాల్సి వస్తుంది' అని అమిర్ పేర్కొన్నాడు. కాగా దీనిపై పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అతగాడు అంటున్నాడు. ఇలా బరువు పెరగడం.. తగ్గడం అనేది సహజంగానే జరుగుతూ ఉంటుందని తెలిపాడు. అయితే తన ప్రాజెక్టు డిసెంబర్ వరకూ ఉన్నందున.. అప్పటివరకూ ఇదే బరువుతో ఉండాల్సి వస్తుందన్నాడు. మరో ఐదు నెలల్లో పీకేలో కనిపించినట్లుగా యువకుడిలా కనిపిస్తానని స్సష్టం చేశాడు.