ఆ పాత్ర కోసం కేజీఎఫ్‌ హీరో సాహసం.. అదేంటో తెలుసా? | KGF Star Yash To Gain 15 Kg Weight To Play Ravana In Ranbir Kapoor Starrer | Sakshi
Sakshi News home page

Yash: ఆ పాత్ర కోసం కేజీఎఫ్‌ హీరో సాహసం.. అదేంటో తెలుసా?

Published Fri, Apr 26 2024 4:19 PM | Last Updated on Fri, Apr 26 2024 6:22 PM

KGF Star Yash To Gain 15 Kg Weight To Play Ravana In Ranbir Kapoor Starrer

బాలీవుడ్ స్టార్‌ డైరెక్టర్‌ నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కిస్తోన్న చిత్రం రామాయణం. ఈ చిత్ర షూటింగ్‌ ఇటీవలే మొదలైంది. ఈ చిత్రంలో రణ్‌బీర్‌కపూర్, సాయిపల్లవి నటిస్తున్నారు. ఈ చిత్రంలో రావణుడి పాత్రలో కేజీఎఫ్ స్టార్ యశ్ కనిపించనున్నారు. దీంతో ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.  తాజాగా యశ్‌కి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ తెగ వైరలవుతోంది. 

ఈ సినిమాలో రావణుడి పాత్ర కోసం యశ్‌ ఇప్పటికే కసరత్తులు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఆ పాత్ర కోసం ఏకంగా 15 కిలోల బరువు పెరగనున్నట్లు తాజా సమాచారం. దానికోసం ఇప్పటికే కసరత్తులు మొదలు పెట్టినట్లు టాక్ వినిపిస్తోంది. నితీశ్ తివారీ రామాయణంలో యశ్‌ భారీ పర్సనాలిటీతో కనిపించనున్నారు.  ఈ మూవీ తర్వాత కేజీఎఫ్‌-3లో యశ్ నటించనున్నారు. ప్రస్తుతం టాక్సిక్‌ చిత్రంలో నటిస్తోన్న యశ్.. ఆ సినిమా పూర్తయ్యాకే రామాయణం సెట్స్‌లో అడుగుపెట్టనున్నారు. 

కాగా.. రామాయణం షూటింగ్ ఏప్రిల్‌లో ముంబైలో ప్రారంభమైంది. ఈ మూవీ కోసం దర్శకుడు నితీష్ తివారీ ముంబయి నగర శివార్లలో భారీ సెట్‌ను నిర్మించారు. ఈ చిత్రంలో సాయి పల్లవి సీత పాత్రలో కనిపించనుండగా.. హనుమంతుడిగా సన్నీ డియోల్ నటిస్తారని సమాచారం.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement