అనుష్కకి భారమైన బరువు | How Anushka Gain Weight for Inji Idupazhagi | Sakshi
Sakshi News home page

అనుష్కకి భారమైన బరువు

Published Sun, Aug 14 2016 6:06 PM | Last Updated on Mon, Sep 4 2017 9:17 AM

అనుష్కకి భారమైన బరువు

అనుష్కకి భారమైన బరువు

తమిళసినిమా; లావెక్కడం సులభమే.ఇంజి ఇడుప్పళగు చిత్రం కోసం బరువు పెంచాలన్న దర్శకుడి సూచనకు నటి అనుష్క ఓ ఎస్.అదెంత పని అని ఆ చిత్రం కోసం అన్నంత పనీ చేశారు.అయితే వ్రతం చెడ్డా ఫలితం దక్కాలన్న సామెత కూడా ఆమె విషయంలో జరగలేదు.తమిళంతో పాటు తెలుగులోనూ ఏక కాలంలో తెరకెక్కిన ఆ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించలేదు.అది జరిగిపోయిన కథ.తాజాగా ఆ చిత్రం కోసం పెంచిన బరువు అనుష్కకిప్పుడు భారంగా మారిందని సమాచారం.

ఆమె ఇప్పుడు బాహుబలి-2 చిత్రంతో పాటు,భాగమతి,తమిళంలో ఎస్-3 చిత్రాలలో నటిస్తున్నారు.కాగా బాహుబలి చిత్రంలోనే అనుష్క కాస్త లావుగా కనిపించారు.అయితే అది హీరో బాహుబలి తల్లి పాత్ర కావడంతో చక్కగా నప్పారు.బాహుబలి-2 చిత్రంలో అందమైన యవ్వనవతాగా కనిపించాలి.అలా తయారవ్వడానికి అనుష్క ఇప్పుడు నానా అవస్థలు పడుతున్నారట.ఒక పక్క షూటింగ్‌లో పాల్గొంటూనే నిత్యం రోజులో సగ భాగాన్ని కసరత్తులకే కేటాయిస్తున్నారట.అయినా బరువు తగ్గలేక పోతున్నారట.మరో పక్క బాహుబలి-2 చిత్ర షూటింగ్ ఆమె కోసం ఎదురు చూస్తోందని సమాచారం.

షూటింగ్ ఆలస్యం అయితే చిత్రాన్ని నిర్ణయించిన సమయంలో విడుదల చేయలేమని దర్శకుడు రాజమౌళి టెన్షన్ పడుతున్నారని సినీ వర్గాల సమాచారం.దీంతో అనుష్కను శస్త్ర చికిత్స ద్వారా బరువు తగ్గే ప్రయత్నం చేయాలని వత్తిడి తెస్తున్నట్లు,అందుకు అనుష్క అంగీకరించడం లేదనీ ప్రచారం జరుగుతోంది.శస్త్ర చికిత్సతో సైడ్ ఎఫెక్ట్స్‌కు గురికావలసి వస్తుందని తను భయపడుతున్నారనీ సినీ వర్గాల బోగట్టా.అందుకే మరో నెల గడువు ఇవ్వండి నాజూగ్గా తయారవుతాననీ దర్శకుడు రాజమౌళిని కోరినట్లు సమాచారం.మొత్తం మీద ఇంజి ఇడుప్పళగి చిత్రం కోసం పెంచిన బరువు అనుష్కకిప్పుడు భారంగా మారిందన్న మాట.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement