Baahubali -2
-
‘వార్-2’: హృతిక్‌ను ప్రభాస్ ఢీకొడతాడా?
తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా ప్యాన్ ఇండియా స్టార్‌గా వెలుగొందుతున్న నటుడు ప్రభాస్. రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ సిరీస్ చిత్రాలతో ప్రభాస్ కెరీర్ ఎవరెస్ట్ శిఖరాలను అందుకుంది. ‘బాహుబలి’ సినిమాల అనంతరం ఇటీవల ప్రభాస్.. ‘సాహో’ తో ప్రేక్షకులను పలుకరించాడు. ఈ సినిమాకు దేశవ్యాప్తంగా అన్ని భాషల్లోనూ డివైడ్ టాక్ వచ్చింది. విమర్శకులు తీవ్రంగా విరుచుకుపడ్డారు. అయినా దేశవ్యాప్తంగా ఈ సినిమా వసూళ్ల పరంగా పర్వాలేదనిపించింది. హిందీలో సుమారు రూ. 150 కోట్లు వసూలుచేసి.. ‘సాహో’ హిట్ అనిపించికుంది. మొత్తానికి ‘సాహో’ ప్రభాస్‌ను, ఆయన ఫ్యాన్స్ నిరాశపరిచినా.. ప్యాన్ ఇండియా స్టార్‌గా డార్లింగ్ స్టామినా ఏంటో చాటింది. ఈ క్రమంలో తన స్టార్‌డమ్‌ను కాపాడుకుంటూ.. దేశవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించేలా భారీ సినిమాలు తీసేందుకు ప్రభాస్ ఈ సమయాతమవుతున్నాడు. డార్లింగ్‌గా ఫ్యాన్స్ హృదయాల్లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్న ప్రభాస్ బుధవారం 40వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ప్రభాస్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మీకోసం. ప్రభాస్ పూర్తి పేరు వెంకట సత్యనారాయణ ప్రభాస్ రాజు ఉప్పలపాటి. చెన్నైలో సూర్యనారాయణ రాజు, శివకుమారి దంపతులకు జన్మించారు. టాలీవుడ్ రెబల్ స్టార్ కృష్ణంరాజు ప్రభాస్‌కు పెద్దనాన్న. ప్రభాస్ దేశవ్యాప్తంగా టాప్ స్టార్‌గా వెలుగొందుతున్నాడంటే అందుకు కారణం రాజమౌళి తీసిన బాహుబలి, బాహుబలి-2 సినిమాలు. బాహుబలి-2 సినిమా వసూళ్లపరంగా దేశంలోని అన్ని రికార్డులను చెరిపేసింది. మొదటి పదిరోజుల్లోనే ఈ సినిమా దేశంలో వెయ్యికోట్లు వసూలు చేసింది. అంతేకాదు ఇండియాలో రూ. 1500 కోట్ల మైలురాయి చేరిన తొలి సినిమాగా కూడా రికార్డు సృష్టించింది. మరో సరదా అంశం ఏమిటింటే.. ప్రభాస్ గత మూడు చిత్రాల (బాహుబలి, బాహుబలి-2, సాహో)కు అయిన బడ్జెట్ దాదాపు రూ. 800 కోట్లు. ఇప్పుడు టాలీవుడ్, బాలీవుడ్డే కాదు.. దేశవ్యాప్తంగా ఉన్న తన ఫ్యాన్స్‌కు రీచ్ అయ్యేలా ప్రభాస్ భారీ సినిమాలకు ప్లాన్ చేస్తున్నాడు. 2017లో జీక్యూ మ్యాగజీన్ ప్రచురించిన అత్యంత ప్రభావవంతమైన యువత జాబితాలో ప్రభాస్ ఆరోస్థానంలో నిలిచాడు. బాహుబలి-2 సక్సెస్ దేశవ్యాప్తంగా యువతలో ప్రభాస్‌కు మంచి క్రేజ్‌ను తీసుకొచ్చింది. ప్రభాస్‌కు 40 ఏళ్లు వచ్చాయి. ఇప్పటికీ ఓ ప్రశ్న ప్రశ్నగానే మిగిలిపోయింది. అదే ఆయన పెళ్లి. ప్రభాస్ ఎప్పుడు మ్యారెజ్ చేసుకుంటారు. ఈ ప్రశ్న ఆయనకు నిత్యం ఎదురవుతూనే ఉంటుంది. గతంలో తన కో-స్టార్ అనుష్కను ప్రభాస్ పెళ్లి చేసుకుంటారని వదంతులు వచ్చాయి. ఈ ఇద్దరు ‘మిర్చి’ సినిమా చేసినప్పటి నుంచి ఈ వదంతులు నిత్యం చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. తన పెళ్లి వదంతుల గురించి స్పందించిన ప్రభాస్.. తాను, అనుష్క మంచి ఫ్రెండ్స్ అని చెప్పాడు. కనీసం నువ్వు అయినా పెళ్లి చేసుకో.. ఈ వదంతులు అగుతాయని అనుష్కను అడిగినట్టు ప్రభాస్ సరదాగా వ్యాఖ్యానించారు. దక్షిణాది సినీ స్టార్స్‌లో ఎవరికీ దక్కని అరుదైన గౌరవం ప్రభాస్‌కి దక్కింది. బ్యాంకాక్‌లోని ప్రపంచ ప్రఖ్యాత మేడం టుస్సాడ్ మ్యూజియంలో ఆయన మైనపు బొమ్మ కొలువదీరింది. బాహుబలి చిత్రంలోని అమరేంద్ర బాహుబలి పాత్ర రూపంలో ఆయన మ్యూజియంలో దర్శనమిస్తున్నారు. ప్రభాస్ బాగా నచ్చిన సినిమా తన పెద్దనాన్న కృష్ణంరాజు నటించిన 'భక్తకన్నప్ప'. బాలీవుడ్ దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ సినిమాలు అన్నా పడిచస్తాడు. మున్నాభాయ్ ఎంబీబీఎస్, త్రి ఇడియట్స్ సినిమాలను 20సార్లకుపైగా చూశాడట. ఇక హాలీవుడ్ విషయానికొస్తే రాబర్ట్ డీనీరో నటన అంటే ఇష్టం. ప్రభాస్‌కు వాలీబాల్ అంటే ఇష్టం. బాహుబలి సినిమా కోసం మిస్టర్ వరల్డ్ 2010 లక్ష్మణ్ రెడ్డి ప్రత్యేకంగా దేహాదారుఢ్యంపై ప్రభాస్‌కు శిక్షణ ఇచ్చారు. కండలు తిరిగిన దేహసౌష్ఠవం కోసం చిత్ర నిర్మాతలు ప్రత్యేకంగా రూ. 1.5 కోట్లు విలువచేసే జిమ్ ఎక్విప్మెంట్స్ ఇచ్చారు. చాలామంది నటులు వరుసగా సినిమాలు చేసేందుకు ఉత్సాహం చూపుతుండగా ప్రభాస్ మాత్రం ఒక సినిమా పూర్తయిన తర్వాతే మరో సినిమాపై దృష్టి పెడుతున్నాడు. 'బాహుబలి' సినిమాల తర్వాత చాలా గ్యాప్ తీసుకొని సాహో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చాడు. ప్రస్తుతం 'జిల్' దర్శకుడు కె.కె. రాధాకృష్ణ డైరెక్షన్లో మరో భారీ సినిమాలో నటించేందుకు ప్రభాస్ సిద్ధమవుతున్నాడు. గోపికృష్ణా మూవీస్ బ్యానర్‌పై నిర్మాత కృష్ణంరాజు సమర్పణలో తెరకెక్కనున్న త్రిభాషా చిత్రానికి ‘జాను’ టైటిల్ ప్రచారంలో ఉంది. హృతిక్‌ను ఢీకొంటాడా? హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ హీరోలుగా తెరకెక్కిన మల్టీస్టారర్ ‘వార్’ ఈ ఏడాది సంచలన విజయాన్ని అందుకుంది. రూ. 300 కోట్లు వసూలు చేసి.. ఈ ఏడాదికి బిగ్గెస్ట్ సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాకు సీక్వెల్ తీసే ఆలోచనలో చిత్ర నిర్మాణ సంస్థ యష్‌రాజ్ ఫిలిమ్స్ ఉంది. ఈ సినిమా సీక్వెల్లో హృతిక్ పాత్ర యథాతథంగా కొనసాగనుండగా.. టైగర్ ష్రాఫ్ పాత్రను మాత్రం మరొకరు చేయాల్సి ఉంది. ఈ పాత్ర కోసం పలువురు హీరోల పేర్లు తెరపైకి వస్తుండగా.. ప్రభాస్ పేరు ప్రముఖంగా వినిపిస్తుండటం గమనార్హం. బాలీవుడ్ మీడియా వర్గాలు కూడా ప్రభాస్ పేరును ‘వార్-2’కు ప్రముఖంగా సూచిస్తున్నాయి. ప్రభాస్ ప్యాన్ ఇండియా స్టార్డమ్ ఉండటం.. దక్షిణాదిలో తిరుగులేని క్రేజ్ ఉండటంతో ‘వార్-2’లో హృతిక్, ప్రభాస్ కలిసి నటిస్తే.. దేశవ్యాప్తంగా కలెక్షన్ల సునామీ తథ్యమని సినీ విశ్లేషకులు జోస్యం చెప్తున్నారు. -
సైబర్ కాప్స్ అదుపులో అంతర్రాష్ట్ర పైరసీ ముఠా!
- బాహుబలి–2 పైరసీ చేసినట్లు పక్కా ఆధారాలు - బిహార్‌లోని పట్నా కేంద్రంగా సాగిన వ్యవహారం సాక్షి,హైదరాబాద్: సినిమాల పైరసీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలిసింది. బిహార్ రాజధాని పట్నా కేంద్రంగా ఈ ముఠా తమ వ్యవహారాలు సాగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇటీవల విడుదలైన బాహుబలి–2 చిత్రాన్ని పైరసీ చేసిన ఓ వ్యక్తి ఏకంగా చిత్ర నిర్మాణానికి సంబంధించిన వ్యక్తికే కొన్ని నిమిషాల నిడివి కలిగిన సన్నివేశాలను పంపి.. తాను అడిగినంత మొత్తాన్ని చెల్లించాలని లేదంటే సినిమా అంతటినీ ఇంటర్నెట్లో పెడతానని బెదిరించాడు. దీంతో ఆ వ్యక్తి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు దర్యాప్తు చేసి పైరసీని గుర్తించారు. పట్నాలో థియేటర్లోనే పైరసీ: పైరసీ బారిన పడకుండా ఇటీవల కీలక చిత్రాలను ప్రధాన సర్వర్‌తో అనుసంధానించి, శాటిలైట్ సిగ్నల్ ద్వారా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విడుదల చేస్తున్నారు. సదరు సినిమా ప్రదర్శితమయ్యే థియేటర్లకు నిర్మాతలు ప్రత్యేక కోడ్‌ను ఇచ్చి ప్రధాన సర్వర్ నుంచే చిత్రం ప్రదర్శితమయ్యేలా చేస్తారు. ఈ తరహాలోనే పట్నాలోని ఓ థియేటర్లో బాహుబలి–2 ప్రదర్శితమైంది. ఆ థియేటర్లో సాంకేతిక వ్యవహారాలు చూసే ఓ వ్యక్తి స్వయంగా పైరసీకి పాల్పడినట్లు తేలింది. ఇతడితో ముఠా కట్టిన ఢిల్లీ, హైదరాబాద్‌లకు చెందిన మరికొందరు బెదిరింపు దందాకు దిగారు. ఆదివారం రాత్రి నాటికి పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. -
బాహుబలి 2 చూశాక సీఎం సంచలన నిర్ణయం
భారీమొత్తంలో డబ్బులు వెచ్చించి మరీ బాహుబలి 2 సినిమాను చూసి వచ్చిన తర్వాత కర్ణాటక సీఎం సిద్ధరామయ్య సంచలన నిర్ణయం తీసుకున్నారు. కర్ణాటకలోని మల్టిప్లెక్సెస్, సినిమా హాలులో ఒక్కో వ్యక్తి నుంచి తీసుకునే టిక్కెట్ గరిష్ట ధరలు 200 రూపాయలకు మించకూడదని మంగళవారం నిర్ణయించారు. ఈ మేరకు రాష్ట్రప్రభుత్వం ఓ ప్రకటన వెలువరిచింది. అన్ని భాషల్లోని సినిమాలకు ఈ నిర్ణయం వర్తిస్తుందని ప్రభుత్వం పేర్కొంది. అయితే ఈ నిబంధనలు మల్టిప్లెక్సెస్ ల్లో గోల్డ్ క్లాస్ స్క్రీన్, గోల్డ్ క్లాస్ సీట్లకు వర్తించవని తెలిసింది. ఐమ్యాక్స్, 4డీఎక్స్ మూవీ హాల్స్ ను కూడా ఈ నిబంధన నుంచి మినహాయించారు. ఈ నిర్ణయం వెలువరచడానికి ఒక్క రోజు ముందే సిద్ధరామయ్య వేల రూపాయలకు పైగా వెచ్చించి తన కుటుంబసభ్యులతో కలిసి బాహుబలి-2 సినిమా చూశారు. సినిమా టికెట్ల ధరలు తగ్గిస్తానన్న ఆయనే.. అధిక ధర చెల్లించి సినిమా చూడటంపై కర్ణాటకలో రాజకీయ వివాదం చెలరేగింది. ధరల నియంత్రణపై కన్నడ సంఘాలు ఆందోళనలు చేస్తున్న సమయంలోనే.. సీఎం అధిక ధర చెల్లించి సినిమా చూడటం వివాదాస్పదమైంది. మార్చి 15న తన బడ్జెట్ స్పీచ్ లో సిద్ధరామయ్య సినిమా టిక్కెట్ రేట్ల నియంత్రణపై నిర్ణయాన్ని ప్రకటించారు. నష్టాలతో కొట్టుమిట్టాడుతున్న కన్నడ మూవీలను ఆదుకోవడానికి అడ్మిషన్ ఫీజులను నిర్ణయించడం అవసరమని ఆయన ప్రభుత్వం పేర్కొంది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రల్లో ఇప్పటికే ఈ నిబంధనలు అమల్లో ఉన్నాయి. నాన్-కన్నడ మూవీలకు ప్రజలు ఎక్కువగా వెచ్చిస్తున్నారని, భారీ మొత్తంలో వసూలు చేస్తున్న టిక్కెట్ ధరలతో వారు త్వరగా తమ పెట్టుబడులను రికవరీ చేసుకుంటున్నారని కర్నాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ సా.రా గోవింద్ తెలిపారు. భారీగా వచ్చే ఒక్క మూవీతో 40 కన్నడ మూవీలు మరుగున పడుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. -
బాహుబలి-2 ప్రజాభిప్రాయం
-
ఇక్కడ అనుకున్నదేదీ జరగదు
సినిమాలో అనుకున్నదేదీ జరగదని నటి తమన్నా పేర్కొంది. ఈ అమ్మడికి కోలీవుడ్, టాలీవుడ్ ఒక సీజన్‌లా తయారయ్యాయని చెప్పాలి. ఆ మధ్య తెలుగులో వరుసగా చిత్రాలు చేసుకుంటూ వచ్చిన ఈ మిల్కీబ్యూటీకి ఇటీవల తమిళంలో ఎక్కువ చిత్రాలు వరిస్తున్నాయి. విజయ్‌సేతుపతికి జంటగా నటించిన ధర్మదురై మంచి విజయం సాధించింది. అంతకు ముందు తోళా ప్రేక్షకాదరణ పొందింది. ఇటీవల కత్తిసండై చిత్రం నిరాశపరచినా, ప్రస్తుతం శింబు సరసన అన్బానవన్ అసరాదవన్ అడంగాదవన్ చిత్రంతో పాటు విక్రమ్‌కు జంటగా స్కెచ్ చిత్రంలో నటిస్తోంది. తమన్నా నటించిన భారీ చిత్రం బాహుబలి–2 ఈ నెల 28న ప్రపంచవ్యాప్తంగా తెరపైకి రానుంది. ఇలా తన హవా కొనసాగిస్తున్న తమన్నా తన విజయ రహస్యాన్ని తెలుపుతూ తానీ రంగంలోకి ప్రవేశించినప్పుడే ఎలాంటి పాత్రల్లో అయినా నటించడానికి తనను తాను సిద్ధం చేసుకున్నానని చెప్పింది. నచ్చిన పాత్ర, నచ్చని పాత్ర అన్న తారతమ్యాలు చూపకుండా నటిస్తానని పేర్కొంది. నటి అయిన తరువాత ఎలాంటి పాత్రనైనా చేసి మెప్పించే ప్రతిభ కలిగి ఉండాలని చెప్పింది. కొందరు తారలు నాకు సరైన అవకాశాలు అమరలేదని అపవాదు చేస్తుంటారని, అది కరెక్ట్ కాదన్నది తన భావన అని పేర్కొంది. వచ్చిన అవకాశాన్ని నచ్చిన విధంగా మార్చుకోవాలని తమన్నా చెబుతోంది. దర్శకుడు కథ చెప్పినప్పుడు తాను తన పాత్రలో లీనం అయ్యిపోతానని, నటించేటప్పుడు ఆ పాత్రకు పూర్తి న్యాయం చేయడానికి శ్రమిస్తానని చెప్పింది. సినిమాలో అనుకున్నదేదీ జరగదు, చిత్రం, తరువాతి చిత్రానికి మార్కెట్ పరిస్థితి మారి పోతుంది. టాప్‌లో ఉన్నవారు డౌన్ అవ్యడం, డౌన్లో ఉన్న వాళ్లు టాప్‌లోకి రావడం సహజం. అందిన అవకాశాన్ని పొంది జీవితంలో సాగిపోవడమే మంచిది. ఒక వేళ అవకాశాలు రాకపోయినా బాధ పడకూడదు. దర్శకుడు చెప్పిన దానికంటే బాగా నటించాలని తాను తపిస్తానంది ఈ మిల్కీబ్యూటీ. తనకు దర్శకులు వరుసగా అవకాశాలు కల్పించడానికి ఇదీ ఇక కారణం కావొచ్చని అంది. తాను మంచి నటిగా పేరు తెచ్చుకున్నానని, ఇకపోతే ఇతర నటీమణులను చూసి తాను అసూయ పడనని, వారికి లభించిన అవకాశాలు తనకు రాలేదని చింతించనని చెప్పింది. అదే విధంగా తనకు రావలసిన అవకాశాలను ఎవరూ అడ్డుకోలేరనే ధీమా తమన్నా వ్యక్తం చేసింది. -
బాహుబలి–2 తమిళ ఆడియో
-
కథంతా బాహుబలి–2లోనే..
బాహుబలి చిత్రానికి ఎక్స్టెన్షన్ బాహుబలి–2 అని ఆ చిత్ర సృష్టికర్త రాజమౌళి పేర్కొన్నారు. బ్రహ్మాండానికి మారుపేరుగా తెర కెక్కిన బాహుబలి చిత్రం 2015లో తెరపైకి వచ్చి ప్రపంచవ్యాప్తంగా విజయ విహారం చేసింది. హాలీవుడ్ సినిమానే తిరిగి చూసేలా చేసిన ఆ చిత్రానికి సీక్వెల్‌గా బాహుబలి–2 అత్యంత భారీ అంచనాల నడుమ ఈ నెల 28న తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఇది బాహుబలి చిత్రాన్ని మించి అభిమానుల్ని అలరిస్తుందనే నమ్మకాన్ని దర్శకుడు రాజమౌళి వ్యక్తం చేస్తున్నారు. తమిళ వెర్షన్ ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఆదివారం సాయంత్రం స్థానిక నందనంలోని వైఎంసీఏ మైదానంలో భారతీయ సినీ పరిశ్రమలోని పలువురు అతిరథమహారథులు అతిథులుగా పాల్గొనగా భారీ ఎత్తున్న నిర్వహించారు. అంతకు ముందు చిత్ర యూనిట్ ఆదివారం ఉదయం ఒక నక్షత్ర హోటల్లో మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు రాజమౌళి మాట్లాడుతూ బాహుబలిని ఒక విజయవంతమైన చిత్రంగా తూపొందించడానికి కృషి చేశాం.కానీ ఇంత చరిత్ర సృష్టిస్తుందని ఊహించలేదన్నారు. అయితే ఆ చిత్రాన్ని ఒక్క భాషకు చెందిన చిత్రంగా కాకుండా యూనివర్సల్‌గా ఉండాలని భావించామని తెలిపారు. ఈ కథను ఒక్క చిత్రంగా రూపొందించడం సాధ్యం కాకే రెండు భాగాలుగా తెరకెక్కించామని, అంతే కానీ కథలో ఎలాంటి మార్పులు చేయలేదని చెప్పారు. అయితే రెండవ భాగంలో పోరు దృశ్యాలను, గ్రాఫిక్స్ వర్కును మరింత గ్రాండ్‌గా చూపించే ప్రయత్నం చేశామని తెలిపారు. బాహుబలి–3 ఉండదు బాహుబలి–3 తీస్తారా? అన్న ప్రశ్నకు కచ్చితంగా ఉండదన్నారు. అయితే బాహుబలి పలు విధాలుగా రూపొందే అవకాశం ఉందన్నారు. అది నవల కావచ్చు, సీరియల్ కావచ్చు, యానిమేషన్ రూపంలోనూ తీసుకోచ్చే ఆలోచన ఉందని దర్శకుడు తెలిపారు. తదుపరి చిత్రాన్ని కూడా బాహుబలి తరహాలో చేస్తారా? అన్న ప్రశ్నకు అది సాధ్యం అవుతుందో, లేదోనని అన్నారు. ఈ చిత్రాన్ని రూపొందించడానికి ఐదేళ్లు పట్టిందన్నారు. అన్ని రోజులు పని చేయడానికి నటీనటులు, సాంకేతిక వర్గం కావాల్సి ఉంటుందన్నారు. అందువల్ల తన తదుపరి చిత్రం చిన్నదైనా, పెద్దదైనా గ్రాఫిక్స్, ఎఫెక్ట్స్ లేకుండా చేయాలని భావిస్తున్నానని బాహుబలి 1, 2 భాగాలను తెరకె క్కించిన శిల్పి జక్కన్న పేర్కొన్నారు. ప్రభాస్, అనుష్క, తమన్నా, రమ్యకృష్ట, నాజర్ పాల్గొన్నారు. అసలు కథ రెండవ భాగంలోనే.. బాహుబలి చిత్రం స్థాయిలో సీక్వెల్ ఉంటుందా?అన్న ప్రశ్నకు బాహుబలి చిత్రంలో పాత్రలను మాత్రమే పరిచయం చేశామని అసలు బలమైన కథ అంతా బాహుబలి–2లోనే ఉంటుందని చెప్పారు. నటి అనుష్క బరువు తగ్గడంతో ఆమెను స్లిమ్‌గా చూపించడానికి గ్రాఫిక్స్ సన్నివేశాలను అధికంగా వాడినట్లు ప్రచారం జరుగుతుందన్న ప్రశ్నకు షూటింగ్ రోజులు అధికం కావడంతో సహజంగానే మనుష్యుల్లో మార్పులు జరుగుతాయని, అందులోనూ అనుష్క మధ్యలో ఒక చిత్రం కోసం బరువు పెరగాల్సి రావడంతో కొన్ని సన్నివేశాలకు గ్రాఫిక్స్ వాడిన మాట నిజమే గానీ బాహుబలి–2కు సంబంధించిన అ«ధిక భాగం చిత్రీకరణను ముందుగానే పూర్తి చేశామని తెలిపారు.అదే విధంగా చిత్ర రెండవ భాగంలో తమన్నా భాగస్వామ్యం ఉన్నా అనుష్క పాత్ర పరిధి ఎక్కువగా ఉంటుందని చెప్పారు. -
బాహు అన్నోడే...బలి తీసుకున్నాడు!
సింగిల్ లైన్లో ‘బాహుబలి’ కథ చెప్పమంటే ఏం చెబుతారు? ‘‘చిన్నప్పట్నుంచీ ‘బాహు... బాహు’ అంటూ ఏ చేతులతో అయితే ‘బాహుబలి’ని పెంచాడో... అదే చేతులతో కట్టప్ప అతణ్ణి చంపేశాడు’’ – సింపుల్‌గా స్టోరీ ఇదే. అసలు కట్టప్ప ఎందుకు చంపాడు? లేదా ఎందుకు చంపాల్సి వచ్చింది? ఇందులో బాహుబలి చిన్నాన్న కొడుకు భల్లాలదేవ పాత్ర ఏంటి? అనే ప్రశ్నలకు ఏప్రిల్ 28న విడుదల కానున్న ‘బాహుబలి–2’లో సమాధానాలు దొరుకుతాయి. కానీ, క్లుప్తంగా కథేంటి? అనడిగితే... పైన చెప్పుకున్నదే. ‘బాహుబలి: ద బిగినింగ్’ని చూసిన తర్వాత మాహిష్మతి సామ్రాజ్యానికి కట్టు బానిస అయిన కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడబ్బా? అని మెజారిటీ ప్రేక్షకులు ఆలోచించారు. కానీ, అతణ్ణి చిన్నప్పట్నుంచీ అల్లారు ముద్దుగా పెంచింది కట్టప్పే కదా అనే సంగతిని మరిచారు. బహుశా... ‘బాహుబలి’ పోస్టర్స్ డిజైనర్ జగన్‌కి అది గుర్తొచ్చినట్టుంది! అది గుర్తు చేసేలా మీరు చూస్తున్న ఫొటోను డిజైన్ చేసి రాజమౌళికి చూపించారు. దర్శకధీరుడికి విపరీతంగా నచ్చేయడంతో స్టిల్‌ను బయటపెట్టారు. ఈ నెల 16న ‘బాహుబలి: ద కంక్లూజన్’ ట్రైలర్‌ను విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి ఎం.ఎం. కీరవాణి సంగీత దర్శకుడు. దేవినేని ప్రసాద్, శోభు యార్లగడ్డ నిర్మాతలు. -
అమ్మాయిలకు ఇండియానే పేటెంట్
కలర్‌ఫుల్ అమ్మాయిలకు ఇండియానే పేటెంట్ అని నటి తమన్నా అంటున్నారు. అందానికే అందం ఈ పుత్తడి బొమ్మ అని ఈ మిల్కీబ్యూటీని పేర్కొనవచ్చు. పాలరాతి బొమ్మలాంటి మేనందంతో కుర్రకారుని కిర్రెక్కిస్తున్న తమన్నా దశాబ్దం దాటి నేటికీ మేటి నటిగా రాణిస్తున్నారు. రాజమౌళి బాహుబలి చిత్రం తమన్నా ముఖ చిత్రాన్నే మార్చేసింది. ఆ చిత్రంలో అంత అందంగా ప్రేక్షకులను కనువిందు చేశారు. దీంతో ప్రస్తుతం బాహుబలి–2 కోసం అన్ని వర్గాల వారు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇక తమిళంలో శింబుతో రొమాన్స్ చేస్తున్న ట్రిబుల్ ఏ( అన్బానవన్ అసరాదవన్ అడంగాదవన్) చిత్రంపైనా అంచనాలు పెరుగుతున్నాయి. ఇలా ఉండగా దక్షిణాదిలో పాలరాతి బొమ్మలుగా పేరు తెచ్చుకున్న నటి తమన్నా, హన్సిక ఆమె మేని ఛాయ కారణంగా కొన్ని అవకాశాలు కొల్పోవలసి వచ్చిందా? కలర్ తక్కువ హీరోయిన్లకే కథా బలం ఉన్న అవకాశాలు లభిస్తున్నాయా? ఇలాంటి ప్రచారం పరిశ్రమ వర్గాల్లో హల్చల్ చేస్తుండడంతో అదే ప్రశ్నను నటి తమన్నా ముందుంచగా తను ఎలాంటి బదులిచ్చారో చూద్దాం. కలర్ నాకు ఎలాంటి ఇబ్బందిని కలిగించలేదు. నాకు రావలసిన అవకాశాలు వస్తూనే ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే నేను నటించిన రెండు చిత్రాల్లో కాస్త రంగు ఛాయ తగ్గించుకునే నటించాను. అందులో ఒకటి బాహుబలి. ఆ చిత్రం ఎంత ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. శరీర ఛాయ అన్నది ఒక సమస్య కానే కాదు. ఇంకా చెప్పాలంటే కలర్‌ఫుల్ అమ్మాయిలకు ఇండియానే పేటెంట్. మహిళలు ఏ కలర్లో ఉన్నా అది వారికి అందమే. -
అందుకు చావడానికి, చంపడానికైనా సిద్ధమే!
అందుకోసం చంపడానికైనా, చావడానికైనా సిద్ధమే అంటున్నారు మిల్కీ బ్యూటీ. ఏమిటీ సినిమా డైలాగ్‌లా ఉందా? అయితే తమన్నా మాత్రం రీల్ కోసం కాకుండా రియల్‌గానే అన్నారు. కొన్ని చిత్రాలు కొందరి తారల జీవితాలపై చాలా పెద్ద ప్రభావాన్నే చూపుతాయి. అదే విధంగా కొందరు తారలు వెనక్కి తిరిగి చూసుకుంటే తప్పకుండా ఒక్క చిత్రం అయినా గర్వపడేలా ఉండాలి. లేకపోతే అలాంటి వారి నట జీవితానికి అర్థం ఉండదు. నటి అనుష్కనే తీసుకుంటే అరుంధతి ఒక్కటి చాలు తనకు ఆత్మసంతృప్తిని కలిగించడానికి. అదే విధంగా తమన్నాకు బాహుబలి తన కెరీర్లో మైలురాయిగా నిలిచి పోతుంది. ఈ చిత్రం గురించి ఎప్పుడు మాట్లాడినా మిల్కీబ్యూటీ చాలా ఎమోషనల్ అయిపోతారు. బాహుబలి చిత్రంలో నటించడాన్ని చాలా సందర్భాల్లో చాలా గర్వంగా చెప్పారు. తాజాగా బాహుబలి చిత్రంలో అవంతిక పాత్రను జీవితంలో మరచిపోలేనన్నారు. అలాంటి అవకాశం రావడం తన అదృష్టంగా పేర్కొన్నారు. తన కెరీర్ పూర్తిగా డౌన్ అయిన సమయంలో బాహుబలి చిత్రంలో నటించే అవకాశం వచ్చిందన్నారు. అలాంటి అవకాశం వస్తుందని కలలో కూడా ఊహించలేదన్నారు. ఆ చిత్రం కోసం చావడానికైనా, చంపడానికైనా రెడీ అని చాలా ఎమోషన్ గా అన్నారు. ప్రస్తుతం బాహుబలి–2 చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందేనని, ఈ చిత్రం షూటింగ్ ఈ నేలాఖరుకు పూర్తి అవుతుందని తమన్నా చెప్పారు. తమన్నా తాజాగా విశాల్‌తో నటించిన కత్తిసండై చిత్రం తెలుగులో ఒక్కడొచ్చాడు పేరుతో విడుదల కానుంది. రెండు భాషల్లోనూ 23న తెరపైకి రానుంది. -
కట్టప్ప సీక్రెట్ బయటపడిందోచ్!
ఓ వాణిజ్య ప్రకటనలో ‘మరక మంచిదే’ అన్నట్లు... ఒక్కోసారి లీకులు సినిమాకు మంచి చేస్తున్నాయి. ‘బాహుబలి-2’ విజువల్ ఎఫెక్ట్స్ బృందంలోని ఓ వ్యక్తి (గ్రాఫిక్ డిజైనర్) 9 నిమిషాల యుద్ధ సన్నివేశాన్ని స్నేహితులకు వాట్సాప్‌లో పంపడం, అక్కణ్ణుంచి ఇంటర్నెట్కి... చివరకు, సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్లో కేసుల వరకూ వెళ్లిన సంగతి తెలిసిందే. అదృష్టవశాత్తూ, లీకైన వీడియో క్లిప్‌లో క్లైమాక్స్ పోర్షన్ కొంత ఉన్నా, కథకు సంబంధించిన అసలు సస్పెన్స్ బయటపడకపోవడంతో ‘బాహుబలి-2’ చిత్రబృందం ఊపిరి పీల్చుకుంది. లీకైన వీడియో క్లిప్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. విజువల్ ఎఫెక్ట్స్ పూర్తై తర్వాత ఎలా ఉంటుందో? అనే ఆసక్తిని కలిగించింది. ఏమైనా ఈ చేదు అనుభవంతో సినిమా విడుదలయ్యే వరకూ చిన్న దృశ్యం కూడా బయటకు రాకుండా ఉండేలా దర్శక, నిర్మాతలు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ దగ్గర సెక్యూరిటీ మరింత కట్టుదిట్టం చేశారట. అయితే, ఇన్నాళ్లూ రాజమౌళి రహస్యంగా దాచిన ఓ విషయం ఇప్పుడు లీకైంది. ఇప్పుడు ప్రపంచమంతా అడుగుతున్న ప్రశ్న ‘బాహుబలి’ని కట్టప్ప ఎందుకు చంపాడు?కు ఆన్సర్ నాకు తెలుసని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ ప్రకటించారు. ఇంతకీ, ఈ విషయాన్ని లీక్ చేసింది ఎవరో తెలుసా? సాక్షాత్తూ రాజమౌళియే. ‘అంతర్జాతీయ చలనచిత్రోత్సవం’ (ఇఫీ) ముగింపు వేడుకల్లో పాల్గొన్న మంత్రి గారు మనందరిలానే ఉత్కంఠ ఆపుకోలేక రాజమౌళిని ఆ సస్పెన్స్ ముడి విప్పమని అడిగారట. ఆ వేడుకలో పాల్గొనేందుకు గోవా వెళ్ళిన రాజమౌళి, రహస్యంగా మంత్రిగారి చెవిలో అసలు సస్పెన్స్ ఊదారు. ‘‘ఈ ప్రభుత్వం రహస్యాలను ఎవరికీ చెప్పదని రాజమౌళికీ తెలుసు. ఆయన అందుకే ఆ గుట్టు నాతో విప్పారు’’ అని నవ్వుతూ రాథోడ్ అన్నారు. మంత్రి గారికి కాబట్టి, రాజమౌళి ఆ చిక్కుముడి విప్పారు కానీ, మామూలు ప్రేక్షకులందరూ మాత్రం అదేంటో తెలుసుకోవడానికి వచ్చే ఏప్రిల్ 28 దాకా ఆగాల్సిందే. -
అనుష్కకు కల్యాణ ఘడియలు?
మూడు పదుల వయసు పైబడిన నటీమణులకు ఇంటా బయట పెళ్లి ఒత్తిడి పెరగడం సర్వసాధారణం. 34 ఏళ్ల నటి అనుష్కకు అలాంటి తాకిడి ఉంటుందనడం అనూహ్యమేమీ కాదు. ఉన్నత విద్యను పూర్తి చేసిన అనుష్క ఆదిలో యోగా శిక్షణ పొంది, తర్వాత యోగా టీచర్‌గా పలువురికి శిక్షణ ఇచ్చారు. అలాంటి బ్యూటీని విధి నటిని చేసింది. అనుష్క 2005లో వెండితెరకు పరిచయం అయ్యారు. అలా తొలి రోజుల్లో అందాలారబోస్తూ అవకాశాలు పెంచుకుంటూ వచ్చిన అనుష్కకు అరుంధతి చిత్రం ఆమె నట దిశను ఒక్కసారిగా మార్చేసింది. స్టార్ నాయకిగా తమిళం, తెలుగు భాషల్లో అగ్రనాయకిగా రాణిస్తున్నారు. ఈ రెండు భాషల్లో అగ్రనాయకులందరితోనూ డ్యూయెట్లు పాడేసి ఆ సరదాను తీర్చుకున్నారు. ప్రస్తుతం తమిళంలో ఎస్-3 చిత్రంలో సూర్యతోనూ, ద్విభాషా చిత్రం బాహుబలి-2, హీరోయిన్ ఓరియంటెడ్ కథా చిత్రం భాగమతి, భక్తిరస చిత్రం ఓం నమో వేంకటేశాయలో నటిస్తున్నారు. వీటిలో ఎస్-3 చిత్రం డిసెంబర్లో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. బాహుబలి-2 వచ్చే ఏడాది ఏప్రిల్ 28న విడుదల కానుంది. ఇలా ఉండగా అనుష్క కొత్త చిత్రాలను అంగీకరించడం లేదనే ప్రచారం జోరందుకుంది. కారణం ఈ అమ్మడి కి కల్యాణ ఘడియలు దూసుకొస్తున్నాయని సమాచారం. నటిగా ప్రశంసలు అందుకుంటున్న అనుష్క వ్యక్తిగతంగా పలు వదంతులను ఎదుర్కొంటున్నారన్నది గమనార్హం. నటుడు ఆర్యతో ప్రేమకలాపాలంటూ అప్పట్లో గాసిప్స్ హల్చల్ చేశాయి. ఇక ఒక తెలుగు నటుడితో డేటింగ్ అంటూ ప్రచారం హోరెత్తింది. ఇటీవల వివాహితుడైన నిర్మాతను పెళ్లాడబోతున్నట్టు ప్రచారం కలకలం పుట్టించింది. కాగా వీటన్నింటికీ ఫుల్స్టాప్ పెట్టే విధంగా అనుష్క కుటుంబ సభ్యులు పెళ్లి సంబంధాలు చూడడంలో వేగం పెంచినట్లు తాజా సమాచారం. అదే విధంగా హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్తతో అనుష్క పెళ్లిని నిశ్చయించినట్లు సినీ వర్గాల టాక్. బాహుబలి-2 విడుదల తరువాత అనుష్కకు డుండుండుం...పీపీపీనేననే గుసగుసలు వినిపిస్తున్నాయి. -
రాజమౌళి వర్సెస్ సెంథిల్
షూటింగ్ స్పాట్లో దర్శకుడు చేయాల్సిన పనేంటి? ఎలా నటించాలో ఆర్టిస్టులకు.. ఎలా షూట్ చేయాలో సినిమాటోగ్రాఫర్‌కు.. ఇలా ట్వంటీఫోర్ క్రాఫ్ట్స్ మెంబర్స్‌కి ఎవరి పనులు వాళ్లకు.. వివరించడమే. రాజమౌళి కూడా తన చిత్రబృందానికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. కానీ, అది షూటింగ్ కోసం కాదు. లొకేషన్లో షూటింగ్ జరగకుండా మరేం జరిగింది? అని ఊహాగానాలు చేస్తున్నారా? అసలు మ్యాటర్ ఏంటంటే.. ఈ చిత్రబృందం క్రికెట్ ఆడారు. అయ్యో పాపం నిర్మాత.. షూటింగ్ కోసం లక్షలు లక్షలు ఖర్చుపెడితే.. బాధ్యత లేకుండా ఆట ఆడుకుంటున్నారా? అని నిందించక్కర్లేదు. ఎందుకంటే, కావాలని షూటింగ్ ఆపేసి ఆడలేదు. పరిస్థితి అలా వచ్చింది. విరామం లేకుండా షూటింగ్ చేస్తున్న వీళ్లను చూసి, వరుణ దేవుడికి జాలి అనిపించిందేమో. నాన్‌స్టాప్‌గా వర్షం కురిపించేశాడు. మరీ తడిసి ముద్దయ్యే వర్షం కాకపోవడంతో చినుకుల్లోనే క్రికెట్ ఆడారు. వాస్తవానికి వరుణుడు అడ్డుపడకపోతే మంగళవారంతో ‘బాహుబలి-2’ క్లైమాక్స్ షూటింగ్ పూర్తయ్యేది. ఆ సంగతలా ఉంచితే.. టీమ్ అందరూ క్రికెట్ ఆడుతూ ఎంజాయ్ చేశారు. రాజమౌళి బౌలింగ్.. సెంథిల్ కుమార్ బ్యాటింగ్ చేశారు. సెంథిల్‌ను అవుట్ చేయాలని రాజమౌళి చేసిన ప్రయత్నం ఫలించలేదు. రివర్స్‌లో సెంథిల్ రెండు సిక్సులు కొట్టారు. ఈ విషయాన్ని రాజమౌళి ట్విట్టర్లో తెలిపారు. -
బాహుబలి-2 హక్కులు సొంతం చేసుకున్న...
కే ప్రొడక్షన్స్ ఎస్ఎన్.రాజరాజన్ తమిళసినిమా; బాహుబలి చిత్రం ఒక చరిత్ర.భారతీయ సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటిన అపురూప కళాఖండం.అలాంటి బ్రహ్మాండ చిత్ర శిల్పి రాజమౌళి దాని రెండవ భాగాన్ని మరింత అద్భుతంగా చెక్కుతున్న విషయం తెలిసిందే.ఆ చిత్రంలో నటించిన ప్రభాస్,రానా,అనుష్క,తమన్న,రమ్యకృష్ణ,సత్యరాజ్,నాజర్ వంటి ఉన్నత నటీనటులే ఈ చిత్రంలోనూ తమ పాత్రలకు జీవం పోస్తున్నారు.బాహుబలికు గ్రాండీయర్ ఆపాధించిన సాంకేతిక వర్గమే బాహేబలి-2ను మరింత అబ్బురపరచేలా తీర్చిదిద్దుతున్నారు. ఇంక్రీడబుల్ చిత్రంగా వెండితెరపై ఆవిష్కృతమౌతున్న బాహుబలి-2 చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 28న విడుదల చేయనున్నట్లు చిత్ర సృష్టికర్త రాజమౌళి ఇటీవలే వెల్లడించిన విషయం తెలిసిందే.తెలుగు,తమిళం,హింది అంటూ బహుభాషలలో తెరకెక్కుతున్న బాహుబలి-2 చిత్ర తమిళనాడు,విదేశీ విడుదల హక్కులను కే పొడక్షన్స్ అధినేత ఎస్ఎన్.రాజరాజన్ సొంతం చేసుకున్నారన్నది తాజా న్యూస్.తమిళనాడులో ఈ చిత్రం తమిళం,తెలుగు భాషా ప్రదర్శన హక్కుల్ని,విదేశాలలో తమిళం,తెలుగు,మలయాళం భాషల విడుదల హక్కులు తమ సంస్థనే పొందినట్లు రాజరాజన్ వెల్లడించారు. కాగా ఈయన రానా,రెజీనా జంటగా తమిళం,తెలుగు భాషలలో ఒక భారీ చిత్రాన్ని నిర్మించనున్నారు.ఇందులో సత్యరాజ్,కరుణాస్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించనున్నారు.సత్యశివ దర్శకత్వం వహించే ఈ చిత్రాన్ని రెండు భాషలలోనూ ఏక కాలంలో నిర్మించడం విశేషం.కాగా తమిళంలో మడైతిరందు అనే టైటిల్‌ను,తెలుగులో 1945 అనే టైటిల్‌ను నిర్ణయించినట్లు తెలిపారు.కాగా బాహుబలి-2 చిత్ర తమిళనాడు,విదేశీ విడుదల హక్కుల్ని తమ సంస్థకు ఇచ్చినందుకు ఆ చిత్ర నిర్మాతలు,దర్శకుడు రాజమౌళికి ఎస్ఎన్.రాజరాజన్ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానన్నారు. -
అనుష్కకి భారమైన బరువు
తమిళసినిమా; లావెక్కడం సులభమే.ఇంజి ఇడుప్పళగు చిత్రం కోసం బరువు పెంచాలన్న దర్శకుడి సూచనకు నటి అనుష్క ఓ ఎస్.అదెంత పని అని ఆ చిత్రం కోసం అన్నంత పనీ చేశారు.అయితే వ్రతం చెడ్డా ఫలితం దక్కాలన్న సామెత కూడా ఆమె విషయంలో జరగలేదు.తమిళంతో పాటు తెలుగులోనూ ఏక కాలంలో తెరకెక్కిన ఆ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించలేదు.అది జరిగిపోయిన కథ.తాజాగా ఆ చిత్రం కోసం పెంచిన బరువు అనుష్కకిప్పుడు భారంగా మారిందని సమాచారం. ఆమె ఇప్పుడు బాహుబలి-2 చిత్రంతో పాటు,భాగమతి,తమిళంలో ఎస్-3 చిత్రాలలో నటిస్తున్నారు.కాగా బాహుబలి చిత్రంలోనే అనుష్క కాస్త లావుగా కనిపించారు.అయితే అది హీరో బాహుబలి తల్లి పాత్ర కావడంతో చక్కగా నప్పారు.బాహుబలి-2 చిత్రంలో అందమైన యవ్వనవతాగా కనిపించాలి.అలా తయారవ్వడానికి అనుష్క ఇప్పుడు నానా అవస్థలు పడుతున్నారట.ఒక పక్క షూటింగ్లో పాల్గొంటూనే నిత్యం రోజులో సగ భాగాన్ని కసరత్తులకే కేటాయిస్తున్నారట.అయినా బరువు తగ్గలేక పోతున్నారట.మరో పక్క బాహుబలి-2 చిత్ర షూటింగ్ ఆమె కోసం ఎదురు చూస్తోందని సమాచారం. షూటింగ్ ఆలస్యం అయితే చిత్రాన్ని నిర్ణయించిన సమయంలో విడుదల చేయలేమని దర్శకుడు రాజమౌళి టెన్షన్ పడుతున్నారని సినీ వర్గాల సమాచారం.దీంతో అనుష్కను శస్త్ర చికిత్స ద్వారా బరువు తగ్గే ప్రయత్నం చేయాలని వత్తిడి తెస్తున్నట్లు,అందుకు అనుష్క అంగీకరించడం లేదనీ ప్రచారం జరుగుతోంది.శస్త్ర చికిత్సతో సైడ్ ఎఫెక్ట్స్‌కు గురికావలసి వస్తుందని తను భయపడుతున్నారనీ సినీ వర్గాల బోగట్టా.అందుకే మరో నెల గడువు ఇవ్వండి నాజూగ్గా తయారవుతాననీ దర్శకుడు రాజమౌళిని కోరినట్లు సమాచారం.మొత్తం మీద ఇంజి ఇడుప్పళగి చిత్రం కోసం పెంచిన బరువు అనుష్కకిప్పుడు భారంగా మారిందన్న మాట. -
సక్సెస్ బోనస్సే
సక్సెస్‌ను తాను బోనస్‌గానే భావిస్తానని అంటున్నారు నటి అనుష్క. ఆదిలో అందానికి ఇప్పుడు అభినయానికి పేటెంట్ అనిపించుకుంటున్న నటి ఈ బ్యూటీ. చారిత్రక కథా చిత్రాల్లో నటించగల చెరిష్మా ఉన్న నటిగా పేరు తెచ్చుకున్న అనుష్క దక్షిణాదిలో టాప్ హీరోయిన్గా వెలుగొందుతున్నారు. ప్రస్తుతం బహుభాషా చిత్రాలు బాహుబలి-2, భాగమతి, తమిళంలో ఎస్-3 చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఈ అమ్మడిని ఇటీవల పలకరించగా తాను నటించిన చిత్రాలు విజయవంతం అవుతున్నాయని, తాను దక్షిణాదిలో టాప్ హీరోయిన్లలో ఒకరిగా వెలుగొందుతున్నానని అంటున్నారన్నారు. అయితే ఈ విషయాన్ని తాను అంగీకరించనన్నారు. సినిమాకు కథే హీరో, నటీనటులు ముఖ్యం కాదన్నది తన అభిప్రాయం అంటున్నారు. మంచి కథా చిత్రాలనే ప్రేక్షకులు ఆదరిస్తారన్నారు. సినిమాలో తన పాత్ర కంటే కథకే ప్రాధాన్యత ఇస్తానన్నారు. పాత్రలకు ప్రాధాన్యతనిచ్చి నటించిన చిత్రాలన్నీ అపజయం పాలయ్యాయన్నారు. కథ అంటే వినగానే ఆసక్తిని రేకెత్తించాలని, మనసును హత్తుకునేలా ఉండాలన్నారు. అలాంటి సినిమాల్లో చిన్న పాత్ర అయినా నటించడానికి తాను రెడీ అన్నారు. ఇక చిత్రసీమలో జయాపజయాలు సహజం అని పేర్కొన్నారు. తనకు ప్రస్తుతం వైవిధ్యభరిత చిత్రాల్లో నటించే అవకాశం లభిస్తోందని అందుకే ఆ చిత్రాలు విజయం సాధిస్తున్నాయనే అభిప్రాయం వ్యక్తం చేశారు. కథల ఎంపిక తరువాత అవి హిట్ అవుతాయా, ఫ్లాప్ అవుతాయా అని అలోచించనన్నారు. తనకు మంచి చిత్రంలో నటించాననే తృప్తి చాలని అంటున్నారు. తన సినిమా సక్సెస్ అయితే దాన్ని బోనస్‌గా భావిస్తానని అన్నారు. -
గుడ్ ఫ్రైడేకి... బాహుబలి-2
‘ఇంతకూ అమరేంద్ర బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు?’ ‘బాహుబలి’ చూసిన ప్రతి ఒక్కరికీ ఈ మిస్టరీ తెలుసుకోవాలని ఉంటుంది. కట్టప్ప లాంటి నమ్మిన బంటు తన నాయకుణ్ణి చంపాడంటే దానికి బలమైన కారణం ఉండే ఉంటుంది. ఆ కారణం ఏమిటో తెలుసుకోవాలంటే ‘బాహుబలి-2’ చూడాల్సిందేనని చిత్ర బృందం పలు సందర్భాల్లో పేర్కొంది. తొలి భాగం కన్నా మరింత భారీ ఎత్తున రూపొందుతున్న మలి భాగంపై మరిన్ని అంచనాలు నెల కొన్నాయి. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్... ఇలా భారీ తారాగణంతో శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మిస్తున్న ఈ రెండో భాగం షూటింగ్ కొన్ని రోజులుగా జరుగుతోంది. ఈ ఏడాది చివర్లో ఈ చిత్రం విడుదలవుతుందని ముందు వార్త వచ్చిన విషయం తెలిసిందే. అయితే, విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం వచ్చే ఏడాది ఏప్రిల్ 14న మలి భాగాన్ని విడుదల చేయాలనుకుంటున్నారని తెలిసింది. ఆ రోజు గుడ్ ఫ్రైడే. తమిళ సంవత్సరాది కూడా! -
ఆడంబర వివాహం నాకు నచ్చదు
తమిళసినిమా : నటి తమన్నకు పెళ్లిపై ఆశ పుట్టినట్లుంది. తన ఆలోచనలు, మాటలు ఇప్పుడు వివాహం చుట్టూనే తిరుగుతున్నాయి. నటిగా జీవితం మసకబారుతున్న తమన్నకు బాహుబలి వెలుగునిచ్చింది. ప్రస్తుతం ఈ మిల్కీబ్యూటీ కథానాయకిగా బిజీగానే ఉన్నారు. తెలుగులో రవితేజకు జంటగా నటించిన బెంగాలీ టైగర్ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఇక ఇన్టచ్చబుల్స్ చిత్రానికి రీమేక్‌గా రూపొందుతున్న ద్విభాషా చిత్రం దోస్త్ (తెలుగులో ఊపిరి) చిత్రంలో కార్తీకి జంటగా నటిస్తున్నారు. బాహుబలి-2లో నటించడానికి సిద్ధమవుతున్న తమన్న చేతిలో ఒక హిందీ చిత్రం ఉంది. ఈ ముద్దుగుమ్మ ఇటీవల తన తండ్రి నగల వ్యాపారంలోనూ పాలు పంచుకుంటున్నారు. సినిమాల్లో అందాల ఆరబోతకు హద్దులు చెరిపేస్తున్న తమన్న ఇప్పుడు బాహ్య ప్రపంచంలో అలాగే ఉండడం చర్చనీయాంశంగా మారింది. ‘సినిమాల్లో నటిగా ఎదగడం నా అదృష్టం. నిడారంబరంగా ఉండటమే నాకిష్టం. దుస్తులు అలాంటివే ఎంపిక చేసుకుంటాను. ఇక సినిమాల్లో ధరించే దుస్తుల విషయాన్ని చిత్ర దర్శకుడు, కాస్ట్యూమ్ డిజైనర్లు చూసుకుంటారు. నిజ జీవితంలో అలాంటి దుస్తులు ధరించను. అదే సమయంలో నా దుస్తులు స్టైలిష్‌గా ఉండేలా చూసుకుం టాను. సోషల్ నెట్వ ర్క్స్‌లో చూసే డ్రస్ సెలక్ట్ చేసుకుంటాను. ఈ నాగరిక యుగంలో భారతీయ స్త్రీలు ఎలాంటి దుస్తులు ధరించాలని నన్ను అడిగితే వారు ఎలాంటి భావాలు గల వారన్నది ధరించే దుస్తుల్లోనే తెటతెల్లమయ్యేలా ఉండాలి’. నాకు నచ్చిన పెళ్లికూతురు: ప్రపంచంలోనే నాకు నచ్చిన పెళ్లికూతురు ఎవరని అడిగితే యువరాణి డయానా అనే చెబుతాను. ఆమె వివాహ వేడుక అచ్చెరువు కలిగించింది. డయానా నడత, ధరించిన దుస్తులు, అబ్బురపరచాయి. చరిత్రలో వర్ణించే పెళ్లికూతురులానే కనిపంచింది. నా మనసును ఆకట్టుకున్న పెళ్లికూతురు తనే. ఇకపోతే నా పెళ్లి ఆడంబరంగా జరగదు. అలా జరిగే వివాహం నాకు నచ్చదు. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితుల మధ్య నిడారంబంగా పెళ్లి చేసుకుంటాను. అందంగానూ, అర్థవంతంగానూ నా పెళ్లి వేడుక ఉంటుంది. -
బాహుబలి-2లో మాధురి దీక్షిత్?
బాహుబలి-2కి బాలీవుడ్ బ్యూటీ మాధూరి దీక్షిత్ అదనపు ఆకర్షణ కానున్నారా? అలాంటి అవకాశం ఉందంటున్నాయి సినీ వర్గాలు. బాహుబలి చిత్రం సాధించింది సాధారణ విజయం కాదు. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ రికార్డులను బద్దలు కొట్టి హాలీవుడ్ సినిమానే ఆశ్చర్యపరచేలా చేసింది. ఒక్క మాటలో చెప్పాలంటే బాహుబలి రాజమౌళి సృష్టించిన ఒక చరిత్ర. అయితే ఆ ఒక్క చరిత్రతో సంతృప్తి పడే మనస్తత్వం కాదు ఆయనది. తన రికార్డులను తానే తిరగరాసే అలుపెరుగని దర్శకుడు రాజమౌళి. అందుకే బాహుబలిని అధిగమించే విధంగా బాహుబలి-2ను తీర్చిదిద్దడానికి నడుంబిగించారీ జక్కన్న. చిత్రాల్లో దృశ్యాలను అబ్బురపరచే విధంగా తీర్చిదిద్దడంలో ఆయనకు ఆయనే సాటి. కాగా బాహుబలి-2ను మరిన్ని హంగులతో మరింత హద్భుతంగా సెల్యులాయిడ్‌పై ఆవిష్కరించే ప్రయత్నంలో నిమగ్నమయ్యారు. కాగా బాహుబలి-2లో ఒక నాటి బాలీవుడ్ బ్యూటీ మాధురిదీక్షిత్ను అదనపు ఆకర్షణగా చేర్చే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తాజా సమిచారం. బాహుబలి చిత్రాన్ని ఉత్తర భారతంలో విడుదల చేసిన ప్రముఖ హిందీ దర్శకనిర్మాత కరణ్‌జోహార్ ఈ సూచనను రాజమౌళికి ఇచ్చారని తెలిసింది. ఇంతకు ముందు కరణ్‌జోహార్ రూపొందించిన పలు హిందీ చిత్రాల్లో మాధురి దీక్షిత్ నటించారు. కాగా బాహుబలి-2లో దక్షిణాదికి చెందిన నటులు చాలామంది ఉన్నారు. మాధురిదీక్షిత్ లాంటి బాలీవుడ్ నటి కూడా ఉంటే ఉత్తరాదిలో చిత్రానికి మరింత ప్రేక్షకాదరణ పెరుగుతుందన్న ఆలోచనను కరణ్‌జోహార్ రాజమౌళి ముందుంచినట్లు సమాచారం. కాగా ఈ చిత్రంలో మాధురిదీక్షిత్, అనుష్క సోదరిగా కుంతల దేశ రాణిగా నటించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. బాహుబలి చిత్రాన్ని చూసిన సూపర్‌స్టార్ రజనీకాంత్, సూర్య, అజిత్, బాలీవుడ్ బిగ్తో సహా దాని సీక్వెల్లో నటించాలన్న ఆసక్తిని కనబరచిన వారేనన్నది గమనార్హం.