కట్టప్ప సీక్రెట్ బయటపడిందోచ్! | This union minister knows why Kattappa killed Baahubali | Sakshi
Sakshi News home page

కట్టప్ప సీక్రెట్ బయటపడిందోచ్!

Published Thu, Dec 1 2016 12:03 AM | Last Updated on Sun, Jul 14 2019 4:05 PM

కట్టప్ప సీక్రెట్ బయటపడిందోచ్! - Sakshi

కట్టప్ప సీక్రెట్ బయటపడిందోచ్!

ఓ వాణిజ్య ప్రకటనలో ‘మరక మంచిదే’ అన్నట్లు... ఒక్కోసారి లీకులు సినిమాకు మంచి చేస్తున్నాయి. ‘బాహుబలి-2’ విజువల్ ఎఫెక్ట్స్ బృందంలోని ఓ వ్యక్తి (గ్రాఫిక్ డిజైనర్) 9 నిమిషాల యుద్ధ సన్నివేశాన్ని స్నేహితులకు వాట్సాప్‌లో పంపడం, అక్కణ్ణుంచి ఇంటర్నెట్‌కి... చివరకు, సైబర్ క్రైమ్ డిపార్ట్‌మెంట్‌లో కేసుల వరకూ వెళ్లిన సంగతి తెలిసిందే. అదృష్టవశాత్తూ, లీకైన వీడియో క్లిప్‌లో క్లైమాక్స్ పోర్షన్ కొంత ఉన్నా, కథకు సంబంధించిన అసలు సస్పెన్స్ బయటపడకపోవడంతో ‘బాహుబలి-2’ చిత్రబృందం ఊపిరి పీల్చుకుంది. లీకైన వీడియో క్లిప్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. విజువల్ ఎఫెక్ట్స్ పూర్తై తర్వాత ఎలా ఉంటుందో? అనే ఆసక్తిని కలిగించింది.
 
  ఏమైనా ఈ చేదు అనుభవంతో సినిమా విడుదలయ్యే వరకూ చిన్న దృశ్యం కూడా బయటకు రాకుండా ఉండేలా దర్శక, నిర్మాతలు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ దగ్గర సెక్యూరిటీ మరింత కట్టుదిట్టం చేశారట. అయితే, ఇన్నాళ్లూ రాజమౌళి రహస్యంగా దాచిన ఓ విషయం ఇప్పుడు లీకైంది. ఇప్పుడు ప్రపంచమంతా అడుగుతున్న ప్రశ్న ‘బాహుబలి’ని కట్టప్ప ఎందుకు చంపాడు?కు ఆన్సర్ నాకు తెలుసని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ ప్రకటించారు. ఇంతకీ, ఈ విషయాన్ని లీక్ చేసింది ఎవరో తెలుసా? సాక్షాత్తూ రాజమౌళియే. 
 
 ‘అంతర్జాతీయ చలనచిత్రోత్సవం’ (ఇఫీ) ముగింపు వేడుకల్లో పాల్గొన్న మంత్రి గారు మనందరిలానే ఉత్కంఠ ఆపుకోలేక రాజమౌళిని ఆ సస్పెన్స్ ముడి విప్పమని అడిగారట. ఆ వేడుకలో పాల్గొనేందుకు గోవా వెళ్ళిన రాజమౌళి, రహస్యంగా మంత్రిగారి చెవిలో అసలు సస్పెన్స్ ఊదారు. ‘‘ఈ ప్రభుత్వం రహస్యాలను ఎవరికీ చెప్పదని రాజమౌళికీ తెలుసు. ఆయన అందుకే ఆ గుట్టు నాతో విప్పారు’’ అని నవ్వుతూ రాథోడ్ అన్నారు. మంత్రి గారికి కాబట్టి, రాజమౌళి ఆ చిక్కుముడి విప్పారు కానీ, మామూలు ప్రేక్షకులందరూ మాత్రం అదేంటో తెలుసుకోవడానికి వచ్చే ఏప్రిల్ 28 దాకా ఆగాల్సిందే. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement