ఇక్కడ అనుకున్నదేదీ జరగదు | Reday to in Any role : Tamanna | Sakshi
Sakshi News home page

ఇక్కడ అనుకున్నదేదీ జరగదు

Published Tue, Apr 18 2017 2:30 AM | Last Updated on Tue, Aug 28 2018 4:32 PM

ఇక్కడ అనుకున్నదేదీ జరగదు - Sakshi

ఇక్కడ అనుకున్నదేదీ జరగదు

సినిమాలో అనుకున్నదేదీ జరగదని నటి తమన్నా  పేర్కొంది. ఈ అమ్మడికి కోలీవుడ్, టాలీవుడ్‌ ఒక సీజన్‌లా తయారయ్యాయని చెప్పాలి. ఆ మధ్య తెలుగులో వరుసగా చిత్రాలు చేసుకుంటూ వచ్చిన ఈ మిల్కీబ్యూటీకి ఇటీవల తమిళంలో ఎక్కువ చిత్రాలు వరిస్తున్నాయి. విజయ్‌సేతుపతికి జంటగా నటించిన ధర్మదురై మంచి విజయం సాధించింది. అంతకు ముందు తోళా ప్రేక్షకాదరణ పొందింది. ఇటీవల కత్తిసండై చిత్రం నిరాశపరచినా, ప్రస్తుతం శింబు సరసన అన్బానవన్‌ అసరాదవన్‌ అడంగాదవన్‌ చిత్రంతో పాటు విక్రమ్‌కు జంటగా స్కెచ్‌ చిత్రంలో నటిస్తోంది.

తమన్నా నటించిన భారీ చిత్రం బాహుబలి–2 ఈ నెల 28న ప్రపంచవ్యాప్తంగా తెరపైకి రానుంది. ఇలా తన హవా కొనసాగిస్తున్న తమన్నా తన విజయ రహస్యాన్ని తెలుపుతూ తానీ రంగంలోకి ప్రవేశించినప్పుడే ఎలాంటి పాత్రల్లో అయినా నటించడానికి తనను తాను సిద్ధం చేసుకున్నానని చెప్పింది. నచ్చిన పాత్ర, నచ్చని పాత్ర అన్న తారతమ్యాలు చూపకుండా నటిస్తానని పేర్కొంది. నటి అయిన తరువాత ఎలాంటి పాత్రనైనా చేసి మెప్పించే ప్రతిభ కలిగి ఉండాలని చెప్పింది.

కొందరు తారలు నాకు సరైన అవకాశాలు అమరలేదని అపవాదు చేస్తుంటారని, అది కరెక్ట్‌ కాదన్నది తన భావన అని పేర్కొంది. వచ్చిన అవకాశాన్ని నచ్చిన విధంగా మార్చుకోవాలని తమన్నా చెబుతోంది. దర్శకుడు కథ చెప్పినప్పుడు తాను తన పాత్రలో లీనం అయ్యిపోతానని, నటించేటప్పుడు ఆ పాత్రకు పూర్తి న్యాయం చేయడానికి శ్రమిస్తానని చెప్పింది. సినిమాలో అనుకున్నదేదీ జరగదు, చిత్రం, తరువాతి చిత్రానికి మార్కెట్‌ పరిస్థితి మారి పోతుంది. టాప్‌లో ఉన్నవారు డౌన్‌ అవ్యడం, డౌన్‌లో ఉన్న వాళ్లు టాప్‌లోకి రావడం సహజం.

అందిన అవకాశాన్ని పొంది జీవితంలో సాగిపోవడమే మంచిది. ఒక వేళ అవకాశాలు రాకపోయినా బాధ పడకూడదు. దర్శకుడు చెప్పిన దానికంటే బాగా నటించాలని తాను తపిస్తానంది ఈ మిల్కీబ్యూటీ. తనకు దర్శకులు వరుసగా అవకాశాలు కల్పించడానికి ఇదీ ఇక కారణం కావొచ్చని అంది. తాను మంచి నటిగా పేరు తెచ్చుకున్నానని, ఇకపోతే ఇతర నటీమణులను చూసి తాను అసూయ పడనని, వారికి లభించిన అవకాశాలు తనకు రాలేదని చింతించనని చెప్పింది. అదే విధంగా తనకు రావలసిన అవకాశాలను ఎవరూ అడ్డుకోలేరనే ధీమా తమన్నా వ్యక్తం చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement