బాహు అన్నోడే...బలి తీసుకున్నాడు! | 'Baahubali 2' trailer to be launched on March 16 | Sakshi
Sakshi News home page

బాహు అన్నోడే...బలి తీసుకున్నాడు!

Published Sat, Mar 11 2017 11:15 PM | Last Updated on Sun, Aug 11 2019 12:52 PM

బాహు అన్నోడే...బలి తీసుకున్నాడు! - Sakshi

బాహు అన్నోడే...బలి తీసుకున్నాడు!

సింగిల్‌ లైన్‌లో ‘బాహుబలి’ కథ చెప్పమంటే ఏం చెబుతారు? ‘‘చిన్నప్పట్నుంచీ ‘బాహు... బాహు’ అంటూ ఏ చేతులతో అయితే ‘బాహుబలి’ని పెంచాడో... అదే చేతులతో కట్టప్ప అతణ్ణి చంపేశాడు’’ – సింపుల్‌గా స్టోరీ ఇదే. అసలు కట్టప్ప ఎందుకు చంపాడు? లేదా ఎందుకు చంపాల్సి వచ్చింది? ఇందులో బాహుబలి చిన్నాన్న కొడుకు భల్లాలదేవ పాత్ర ఏంటి? అనే ప్రశ్నలకు ఏప్రిల్‌ 28న విడుదల కానున్న ‘బాహుబలి–2’లో సమాధానాలు దొరుకుతాయి.

కానీ, క్లుప్తంగా కథేంటి? అనడిగితే... పైన చెప్పుకున్నదే. ‘బాహుబలి: ద బిగినింగ్‌’ని చూసిన తర్వాత  మాహిష్మతి సామ్రాజ్యానికి కట్టు బానిస అయిన కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడబ్బా? అని మెజారిటీ ప్రేక్షకులు ఆలోచించారు. కానీ, అతణ్ణి చిన్నప్పట్నుంచీ అల్లారు ముద్దుగా పెంచింది కట్టప్పే కదా అనే సంగతిని మరిచారు. బహుశా... ‘బాహుబలి’ పోస్టర్స్‌ డిజైనర్‌ జగన్‌కి అది గుర్తొచ్చినట్టుంది! అది గుర్తు చేసేలా మీరు చూస్తున్న ఫొటోను డిజైన్‌ చేసి రాజమౌళికి చూపించారు.

దర్శకధీరుడికి విపరీతంగా నచ్చేయడంతో స్టిల్‌ను బయటపెట్టారు. ఈ నెల 16న ‘బాహుబలి: ద కంక్లూజన్‌’ ట్రైలర్‌ను విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్‌ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి ఎం.ఎం. కీరవాణి సంగీత దర్శకుడు. దేవినేని ప్రసాద్, శోభు యార్లగడ్డ నిర్మాతలు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement