ఆడంబర వివాహం నాకు నచ్చదు | Actress Tamannaah don't likes Pomp wedding | Sakshi
Sakshi News home page

ఆడంబర వివాహం నాకు నచ్చదు

Published Sat, Nov 21 2015 3:02 AM | Last Updated on Wed, Apr 3 2019 9:17 PM

ఆడంబర వివాహం నాకు నచ్చదు - Sakshi

ఆడంబర వివాహం నాకు నచ్చదు

తమిళసినిమా : నటి తమన్నకు పెళ్లిపై ఆశ పుట్టినట్లుంది. తన ఆలోచనలు, మాటలు ఇప్పుడు వివాహం చుట్టూనే తిరుగుతున్నాయి. నటిగా జీవితం మసకబారుతున్న తమన్నకు బాహుబలి వెలుగునిచ్చింది. ప్రస్తుతం ఈ మిల్కీబ్యూటీ కథానాయకిగా బిజీగానే ఉన్నారు. తెలుగులో రవితేజకు జంటగా నటించిన బెంగాలీ టైగర్ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఇక ఇన్‌టచ్చబుల్స్ చిత్రానికి రీమేక్‌గా రూపొందుతున్న ద్విభాషా చిత్రం దోస్త్ (తెలుగులో ఊపిరి) చిత్రంలో కార్తీకి జంటగా నటిస్తున్నారు.

బాహుబలి-2లో నటించడానికి సిద్ధమవుతున్న తమన్న చేతిలో ఒక హిందీ చిత్రం ఉంది. ఈ ముద్దుగుమ్మ ఇటీవల తన తండ్రి నగల వ్యాపారంలోనూ పాలు పంచుకుంటున్నారు. సినిమాల్లో అందాల ఆరబోతకు హద్దులు చెరిపేస్తున్న తమన్న ఇప్పుడు బాహ్య ప్రపంచంలో అలాగే ఉండడం చర్చనీయాంశంగా మారింది. ‘సినిమాల్లో నటిగా ఎదగడం నా అదృష్టం. నిడారంబరంగా ఉండటమే నాకిష్టం. దుస్తులు అలాంటివే ఎంపిక చేసుకుంటాను. ఇక సినిమాల్లో ధరించే దుస్తుల విషయాన్ని చిత్ర దర్శకుడు, కాస్ట్యూమ్ డిజైనర్లు చూసుకుంటారు.

నిజ జీవితంలో అలాంటి దుస్తులు ధరించను. అదే సమయంలో నా దుస్తులు స్టైలిష్‌గా ఉండేలా చూసుకుం టాను. సోషల్ నెట్‌వ ర్క్స్‌లో చూసే డ్రస్ సెలక్ట్ చేసుకుంటాను. ఈ నాగరిక యుగంలో భారతీయ స్త్రీలు ఎలాంటి దుస్తులు ధరించాలని నన్ను అడిగితే వారు ఎలాంటి భావాలు గల వారన్నది ధరించే దుస్తుల్లోనే తెటతెల్లమయ్యేలా ఉండాలి’.
 
నాకు నచ్చిన పెళ్లికూతురు: ప్రపంచంలోనే నాకు నచ్చిన పెళ్లికూతురు ఎవరని అడిగితే యువరాణి డయానా అనే చెబుతాను. ఆమె వివాహ వేడుక అచ్చెరువు కలిగించింది. డయానా నడత, ధరించిన దుస్తులు, అబ్బురపరచాయి. చరిత్రలో వర్ణించే పెళ్లికూతురులానే కనిపంచింది. నా మనసును ఆకట్టుకున్న పెళ్లికూతురు తనే. ఇకపోతే నా పెళ్లి ఆడంబరంగా జరగదు. అలా జరిగే వివాహం నాకు నచ్చదు. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితుల మధ్య నిడారంబంగా పెళ్లి చేసుకుంటాను. అందంగానూ, అర్థవంతంగానూ నా పెళ్లి వేడుక ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement