సక్సెస్ బోనస్సే
సక్సెస్‌ను తాను బోనస్‌గానే భావిస్తానని అంటున్నారు నటి అనుష్క. ఆదిలో అందానికి ఇప్పుడు అభినయానికి పేటెంట్ అనిపించుకుంటున్న నటి ఈ బ్యూటీ. చారిత్రక కథా చిత్రాల్లో నటించగల చెరిష్మా ఉన్న నటిగా పేరు తెచ్చుకున్న అనుష్క దక్షిణాదిలో టాప్ హీరోయిన్‌గా వెలుగొందుతున్నారు. ప్రస్తుతం బహుభాషా చిత్రాలు బాహుబలి-2, భాగమతి, తమిళంలో ఎస్-3 చిత్రాలతో బిజీగా ఉన్నారు.
ఈ అమ్మడిని ఇటీవల పలకరించగా తాను నటించిన చిత్రాలు విజయవంతం అవుతున్నాయని, తాను దక్షిణాదిలో టాప్ హీరోయిన్లలో ఒకరిగా వెలుగొందుతున్నానని అంటున్నారన్నారు. అయితే ఈ విషయాన్ని తాను అంగీకరించనన్నారు. సినిమాకు కథే హీరో, నటీనటులు ముఖ్యం కాదన్నది తన అభిప్రాయం అంటున్నారు. మంచి కథా చిత్రాలనే ప్రేక్షకులు ఆదరిస్తారన్నారు. సినిమాలో తన పాత్ర కంటే కథకే ప్రాధాన్యత ఇస్తానన్నారు. పాత్రలకు ప్రాధాన్యతనిచ్చి నటించిన చిత్రాలన్నీ అపజయం పాలయ్యాయన్నారు. కథ అంటే వినగానే ఆసక్తిని రేకెత్తించాలని, మనసును హత్తుకునేలా ఉండాలన్నారు.
అలాంటి సినిమాల్లో చిన్న పాత్ర అయినా నటించడానికి తాను రెడీ అన్నారు. ఇక చిత్రసీమలో జయాపజయాలు సహజం అని పేర్కొన్నారు. తనకు ప్రస్తుతం వైవిధ్యభరిత చిత్రాల్లో నటించే అవకాశం లభిస్తోందని అందుకే ఆ చిత్రాలు విజయం సాధిస్తున్నాయనే అభిప్రాయం వ్యక్తం చేశారు. కథల ఎంపిక తరువాత అవి హిట్ అవుతాయా, ఫ్లాప్ అవుతాయా అని అలోచించనన్నారు. తనకు మంచి చిత్రంలో నటించాననే తృప్తి చాలని అంటున్నారు. తన సినిమా సక్సెస్ అయితే దాన్ని బోనస్‌గా భావిస్తానని అన్నారు.