బాహుబలి-2 హక్కులు సొంతం చేసుకున్న... | Baahubali -2 Tamil Nadu overseas rights SS Rajarajan | Sakshi
Sakshi News home page

బాహుబలి-2 హక్కులు సొంతం చేసుకున్న...

Aug 14 2016 9:05 PM | Updated on Sep 4 2017 9:17 AM

బాహుబలి-2 హక్కులు సొంతం చేసుకున్న...

బాహుబలి-2 హక్కులు సొంతం చేసుకున్న...

బాహుబలి చిత్రం ఒక చరిత్ర.భారతీయ సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటిన అపురూప కళాఖండం.

కే ప్రొడక్షన్స్ ఎస్‌ఎన్.రాజరాజన్
తమిళసినిమా; బాహుబలి చిత్రం ఒక చరిత్ర.భారతీయ సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటిన అపురూప కళాఖండం.అలాంటి బ్రహ్మాండ చిత్ర శిల్పి రాజమౌళి దాని రెండవ భాగాన్ని మరింత అద్భుతంగా చెక్కుతున్న విషయం తెలిసిందే.ఆ చిత్రంలో నటించిన ప్రభాస్,రానా,అనుష్క,తమన్న,రమ్యకృష్ణ,సత్యరాజ్,నాజర్ వంటి ఉన్నత నటీనటులే ఈ చిత్రంలోనూ తమ పాత్రలకు జీవం పోస్తున్నారు.బాహుబలికు గ్రాండీయర్ ఆపాధించిన సాంకేతిక వర్గమే బాహేబలి-2ను మరింత అబ్బురపరచేలా తీర్చిదిద్దుతున్నారు.

ఇంక్రీడబుల్ చిత్రంగా వెండితెరపై ఆవిష్కృతమౌతున్న బాహుబలి-2 చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 28న విడుదల చేయనున్నట్లు చిత్ర సృష్టికర్త రాజమౌళి ఇటీవలే వెల్లడించిన విషయం తెలిసిందే.తెలుగు,తమిళం,హింది అంటూ బహుభాషలలో తెరకెక్కుతున్న బాహుబలి-2 చిత్ర తమిళనాడు,విదేశీ విడుదల హక్కులను కే పొడక్షన్స్ అధినేత ఎస్‌ఎన్.రాజరాజన్ సొంతం చేసుకున్నారన్నది తాజా న్యూస్.తమిళనాడులో ఈ చిత్రం తమిళం,తెలుగు భాషా ప్రదర్శన హక్కుల్ని,విదేశాలలో తమిళం,తెలుగు,మలయాళం భాషల విడుదల హక్కులు తమ సంస్థనే పొందినట్లు రాజరాజన్ వెల్లడించారు.

కాగా ఈయన రానా,రెజీనా జంటగా తమిళం,తెలుగు భాషలలో ఒక భారీ చిత్రాన్ని నిర్మించనున్నారు.ఇందులో సత్యరాజ్,కరుణాస్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించనున్నారు.సత్యశివ దర్శకత్వం వహించే ఈ చిత్రాన్ని రెండు భాషలలోనూ ఏక కాలంలో నిర్మించడం విశేషం.కాగా తమిళంలో మడైతిరందు అనే టైటిల్‌ను,తెలుగులో 1945 అనే టైటిల్‌ను నిర్ణయించినట్లు తెలిపారు.కాగా బాహుబలి-2 చిత్ర తమిళనాడు,విదేశీ విడుదల హక్కుల్ని తమ సంస్థకు ఇచ్చినందుకు ఆ చిత్ర నిర్మాతలు,దర్శకుడు రాజమౌళికి ఎస్‌ఎన్.రాజరాజన్ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement