
పురుషోత్తమా...పరుగెత్తుమా!
పరుగు ప్రస్తావన రాగానే...‘‘ఏదో స్కూలు రోజుల్లో పరుగెత్తేవాడిని’’, ‘‘కాలేజీ రోజుల్లో ఫుట్‌బాల్ ఆడుతున్నప్పుడు పరుగెత్తేవాడిని’’... ఇలాంటి మాటలు సహజంగానే వినిపిస్తాయి.
మెన్స్ హెల్త్
పరుగు ప్రస్తావన రాగానే...‘‘ఏదో స్కూలు రోజుల్లో పరుగెత్తేవాడిని’’, ‘‘కాలేజీ రోజుల్లో ఫుట్‌బాల్ ఆడుతున్నప్పుడు పరుగెత్తేవాడిని’’... ఇలాంటి మాటలు సహజంగానే వినిపిస్తాయి.
పరుగు గురించి ప్రస్తావించబోతే ‘‘ఈ వయసులో పరుగేమిటి?’’ అని కూడా ఆశ్చర్యపోతారు. అంతో ఇంతో ఆరోగ్యస్పృహ ఉన్నవాళ్లు కూడా పరుగుకు దూరంగా ఉంటారు.
చాలామంది పురుషులకు ‘పరుగు’ అనేది ఒక బాల్య జ్ఞాపకం మాత్రమే. పరుగు వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయని పరిశోధకులు ఎప్పటికప్పుడు చెబుతూనే ఉన్నారు.
పరుగు వల్ల ప్రయోజనాలు ఇవి...
* శరీరంలోని ప్రతి భాగం ఉత్తేజితం అవుతుంది.
* మూడ్(మానసికస్థితి) తాజాగా, హుషారుగా ఉంటుంది.
* రోగనిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుంది.
* బరువు తగ్గడానికి పరుగు అనేది ఉత్తమ మార్గం.
* ఆత్మవిశ్వాస స్థాయిని పెంచుతుంది.
* ఎప్పుడూ సంతోషంగా ఉండేలా చేస్తుంది.
* టెన్షన్ తలనొప్పులను దూరం చేస్తుంది.
* కుంగుబాటును దరి చేరనివ్వదు.
(కుంగుబాటు నుంచి తక్షణం బయటపడడానికి పరుగును మించిన ఔషధం లేదంటున్నాయి ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిశోధనలు)