బరువు తగ్గించుకోవడంపై...
అపోహ-వాస్తవం
నేటి ఆధునిక జీవితంలో సౌకర్యాలు పెరిగినంత వేగంగా బరువూ పెరుగుతోంది. ఆ స్థూలకాయాన్ని తగ్గించుకోవడం పెద్ద వ్యాపకంగా మారుతోంది కూడా. ఈ నేపథ్యంలో కొన్ని అపోహలు కూడా రాజ్యమేలుతుంటాయి.
అపోహ: వేగంగా బరువు తగ్గితే, ఆ తగ్గిన బరువు అంతే వేగంగా పెరుగుతుంది కూడా.
వాస్తవం: నిదానంగా బరువు తగ్గడం ఆరోగ్యకరం అనడంలో సందేహం లేదు. అలాగే బరువు వేగంగా తగ్గడం వల్ల జీవరక్షణ వ్యవస్థలో అపసవ్యతలు తలెత్తే ప్రమాదం ఉన్న మాట కూడా వాస్తవమే. అయితే బరువును వేగంగా తగ్గించుకున్న వారు అంతే వేగంగా తిరిగి పూర్వపు బరువుకు చేరతారనడంలో వాస్తవం లేదు. ఆరోగ్యకరమైన ఆహారనియమాలను కొనసాగిస్తే దేహం అదే బరువుతో కొనసాగుతుంది.
కోల్పోయిన కేలరీలను భర్తీ చేసుకోవడానికి మెదడు... మనిషిని హై కేలరీ ఫుడ్ పట్ల ఆకర్షితమయ్యేలా చేస్తుంది. ఈ క్రమంలో మెదడు చేసే మాయాజాలంలో పడిపోతే ఇక అధిక బరువు, ఆరోగ్యం గురించి మర్చిపోవాల్సిందే.