Modern life
-
అక్కర్లేని వెంపర్లాట!
ప్రాచీన కాలాన్నీ, ప్రస్తుత కాలాన్నీ పోల్చి చూస్తే, ప్రజల జీవన శైలిలో కనబడే ఒక ముఖ్యమైన వ్యత్యాసం నిరాడంబరత. పాత కాలంలో పెద్దలు నిరాడంబరంగా జీవించమని బోధించేవాళ్ళు. శుకమహర్షి నాటి నుంచీ, రమణ మహర్షి నాటి వరకూ తక్కువ అవసరాలతో, వనరులతో జీవనం సాగించే యోగులనూ, త్యాగులనూ సామాజికులు ఎక్కువ గౌరవించేవాళ్ళు. బాహ్యమైన పటాటోపాలనూ, ఆర్భాటాలనూ, వాక్– ఆభరణ – వస్త్రాడంబరాలను వదివేసి, అంతర్ముఖులై ఆత్మనిగ్రహంలో జీవించే వాళ్ళను ఆదర్శప్రాయులుగా భావించేవాళ్ళు.క్రమంగా ఇది తలకిందులవుతున్నట్టు కనిపిస్తుంది. ఇరవయ్యొకటో శతాబ్దంలో ఎక్కడ చూసినా ఆడంబరాల వెంపర్లాటే! వాడుకకు పనికి రాని పాతిక లక్షల రూపాయల చేతి సంచీలు కొని ధరించేవాళ్ళు ఆదర్శం. సమయం సూచించని యాభై లక్షల రూపాయల చేతి గడియారం ధరించడం మహనీయతకు చిహ్నం.కోట్ల రూపాయలు విలువ చేసే కార్లలో తిరిగే వాళ్ళను మించిన ఘనులు, వ్యక్తిగతమైన పుష్పక విమానాలలో తిరిగే ఆచంట మల్లన్నలు. బిడ్డ వివాహం నాలుగయిదు దశలుగా చేసి పది వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయడం శ్రేష్ఠత్వానికి లక్షణం. ఎవరి పిచ్చి వారికి ఆనందమని సమర్థించవచ్చు కానీ, సామాన్య దృష్టికి ఇది కేవలం వెర్రితనంగా, ధనోన్మాదంగా కనిపిస్తుంది.ఈ ఆడంబర ప్రియత్వం మునుపు లేదని కూడా అనలేం. కానీ ఇటీవలి దశకాలలో ఇది మరింత వెర్రితలలు వేస్తున్నదనటం నిర్వివాదం. సమాజంలో కూడా ఈ ‘అతి’ని గర్హించే ధోరణికంటే, ఎవరికి చేతయినంత వరకు వాళ్ళు ఈ ఆడంబరాలను అనుకరించడమే జీవిత లక్ష్యమని నమ్మే భావజాలం బలపడుతున్నట్టు కనిపిస్తుంది.ఆడంబరాల మీద వ్యామోహం తీరని దాహం అని తెలిసీ దాని వెంట పరుగెత్తడం ఒక వ్యసనం లాంటిదే. దానివల్ల కలిగే కష్టనష్టాలు కూడా అందరూ ఎరిగినదే. ఎరిగి కూడా ఈ ఆడంబరాల మీది నుంచి దృష్టి మళ్ళించకపోతే ఇహపరాలలో ఉభయభ్రష్టత్వం మిగులుతుందేమో శ్రద్ధగా తర్కించుకోవడం శ్రేయస్కరం. – ఎం. మారుతి శాస్త్రిఇవి చదవండి: ఏది వాస్తవ చరిత్ర? -
మనస్పర్ధలొస్తే తెగదెంపులే!
చిన్నపాటి తగవులకే విడిపోతున్న దంపతులు - గృహహింస చట్టం వైపు పరుగులు రాష్ట్రంలో 15,235 కేసులు నమోదు - రాజీ పడని కేసులే అధికం 2,383 కేసులకు తుది ఉత్తర్వులు జారీ సాక్షి, హైదరాబాద్: నేటి ఆధునిక జీవితంలో ఆలూమగల మధ్య తలెత్తే మనస్పర్ధలు వారిని ఎక్కువగా తెగదెంపుల వైపు నెట్టేస్తున్నాయి. భార్యాభర్తల మధ్య చిన్నపాటి తగవులు విడాకులకు దారితీస్తున్నాయి. ఆర్థిక స్వేచ్ఛ లేకపోవడం, ఉద్యోగ తీరుపై అభ్యంతరాలు, వ్యక్తిత్వాల్లో వ్యత్యాసం వంటి కారణాలు కుటుంబాల్లో చిచ్చుపెడుతున్నాయి. దంపతుల మధ్య సయోధ్య కుదిరే కేసులు తక్కువగా ఉంటుండగా కోర్టును ఆశ్రయిస్తున్న సందర్భాలు అధికంగా ఉంటున్నాయి. ఈ క్రమంలో మహిళలు ముందుగా గృహహింస చట్టాన్ని ఆశ్రయిస్తున్నారు. వేలల్లో కేసులు... రాష్ట్రవ్యాప్తంగా గృహహింస చట్టం కింద ప్రస్తుతం 15,235 ఫిర్యాదులు దాఖలవగా వాటిలో కేవలం 1,429 ఫిర్యాదులకు సంబంధించి మాత్రమే ఇరువర్గాల మధ్య సయోధ్య కుదిరింది. అధికారుల కౌన్సెలింగ్ ఫలితంగా వారంతా ఫిర్యాదులను వెనక్కు తీసుకున్నారు. కానీ మరో 10,779 ఫిర్యాదులకు సంబంధించి పరిష్కారం జటిలం కావడంతో డీఐఆర్ (డొమెస్టిక్ ఇన్సిడెన్ట్ రిపోర్టు) నమోదు అనివార్యమైంది. వీటిలో 818 కేసులకు సంబంధించి మధ్యంతర ఉత్తర్వులు వెలువడగా 2,383 కేసులకు కోర్టులు తుది ఉత్తర్వులు జారీ చేశాయి. మిగతా కేసులు విచారణలో ఉన్నాయి. పట్టణ ప్రాంతాల్లో అధికం... గృహహింస చట్టం కింద పట్టణ ప్రాంత పరిధిలోనే అత్యధిక ఫిర్యాదులు వస్తున్నాయి. వీటిలో చదువుకున్న వారి సంఖ్యే ఎక్కువగా ఉంటోంది. ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఉద్యోగులు, ఎగువ మధ్యతరగతి వర్గాలకు చెందినవారు ఎక్కువగా ఉంటున్నారు. మరోవైపు మైనారిటీ వర్గాల్లో రెండో పెళ్లికి సంబంధించిన ఫిర్యాదులు సైతం ఎక్కువగానే ఉంటున్నాయి. గృహహింస చట్టం కింద నమోదవుతున్న కేసుల్లో ఎక్కువగా పోలీస్ స్టేషన్ నుంచి రిఫర్ చేసినవాటి సంఖ్య అధికంగా ఉంటోంది. ముందుగా పోలీస్‌స్టేషన్‌లో 498, 498 (ఏ) సెక్షన్ల కింద కేసుల నమోదుతో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని జైలుకు పంపుతున్నారు. దీంతో ఈ కేసుల్లో ఇరుపక్షాలు రాజీ కుదుర్చుకోవడం లేదు. డీవీ యాక్ట్ సెల్‌కు వస్తున్న ఫిర్యాదుల్లో రక్షణ, నివాసపు ఉత్తర్వులు, మనోవర్తి, పిల్లల సంరక్షణ, నష్టపరిహారం కింద కేసులు నమోదవుతున్నాయి. అయితే ప్రస్తుతం పిల్లల సంరక్షణ మినహా మిగతా అన్ని కేటగిరీల్లో కేసుల సంఖ్య పెరుగుతోంది. చట్టంపై అవగాహన కల్పిస్తుండడంతో బాధిత మహిళల సంఖ్య వెలుగులోకి వస్తోంది. అధికారుల సంఖ్య అంతంతమాత్రమే... రాష్ట్రంలో జిల్లాల వారీగా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కార్యాలయాలు ఏర్పాటు చేసినప్పటికీ.. డీవీ యాక్ట్ సెల్స్ మాత్రం పాత జిల్లాల్లోనే పనిచేస్తున్నాయి. ఒక్కో సెల్లో ఇద్దరు కౌన్సెలింగ్ అధికారులున్నారు. అయితే కేసుల సంఖ్య పెరుగుతుండగా.. వాటిని పరిష్కరించే వారి సంఖ్య తక్కువగా ఉండడంతో కేసుల పరిష్కారంలో జాప్యం జరుగుతోంది. హైదరాబాద్‌లో అత్యధికంగా 4,027 కేసులుండగా ఇద్దరు కౌన్సెలింగ్ అధికారులు మాత్రమే ఉన్నారు. రాజధానిలో మరికొంత సిబ్బందిని పెంచితే పరిష్కారం సులభతరం అవుతుందని డీవీ యాక్ట్ సెల్ అధికారి కవిత ‘సాక్షి’తో పేర్కొన్నారు. -
ఆధ్యాత్మిక శిఖరం... అద్వితీయ చరితం
అడుగడుగునా ఎన్నో ఒడిదొడుకులు ఎదురవుతున్న ఆధునిక జీవితంలో మార్గదర్శులైన ఆధ్యాత్మికవేత్తలు ఎందరో ఉండొచ్చు గాక.. కానీ వారందరిలో ఆయన మార్గం విభిన్నం. విశిష్టం. ధార్మిక పథంలో దారి చూపుతూనే, సరళ జీవన విధానం ప్రత్యేకతను ప్రబోధించే ప్రవక్త ఆయన. పురాణాలు, ఉపనిషత్తుల సారాన్ని వర్తమాన పరిస్థితులకు అన్వయిస్తూ, ఒడుపుగా ఎలా ముందుకు సాగాలో తేటతెల్లం చేసే సద్గురువు ఆయన. తన జీవితమే ధార్మిక ప్రబోధంగా కాలం గడిపి, సద్గురువుగా వన్నెకెక్కి; అసంఖ్యాక అభిమానుల్ని ఆధ్యాత్మిక భావనా వాహినిలో పునీతుల్ని చేసిన మానస సరోవర సమానుడు, విలక్షణ వ్యక్తిత్వ సంపన్నుడు శివానందమూర్తి. విశాఖలో ఎన్నో ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలకు పెద్దదిక్కుగా నిలిచి, భీమిలిలో ఆనందవన స్థాపన ద్వారా సౌజన్య పవనాలు వ్యాపింపజేసిన సద్గురువు బుధవారం వరంగల్‌లో కాలధర్మం చెందినా, ఆధ్యాత్మిక శిఖరంగా సాగరతీరాన శాశ్వతంగా కొలువై ఉంటారు. -
బరువు తగ్గించుకోవడంపై...
అపోహ-వాస్తవం నేటి ఆధునిక జీవితంలో సౌకర్యాలు పెరిగినంత వేగంగా బరువూ పెరుగుతోంది. ఆ స్థూలకాయాన్ని తగ్గించుకోవడం పెద్ద వ్యాపకంగా మారుతోంది కూడా. ఈ నేపథ్యంలో కొన్ని అపోహలు కూడా రాజ్యమేలుతుంటాయి. అపోహ: వేగంగా బరువు తగ్గితే, ఆ తగ్గిన బరువు అంతే వేగంగా పెరుగుతుంది కూడా. వాస్తవం: నిదానంగా బరువు తగ్గడం ఆరోగ్యకరం అనడంలో సందేహం లేదు. అలాగే బరువు వేగంగా తగ్గడం వల్ల జీవరక్షణ వ్యవస్థలో అపసవ్యతలు తలెత్తే ప్రమాదం ఉన్న మాట కూడా వాస్తవమే. అయితే బరువును వేగంగా తగ్గించుకున్న వారు అంతే వేగంగా తిరిగి పూర్వపు బరువుకు చేరతారనడంలో వాస్తవం లేదు. ఆరోగ్యకరమైన ఆహారనియమాలను కొనసాగిస్తే దేహం అదే బరువుతో కొనసాగుతుంది. కోల్పోయిన కేలరీలను భర్తీ చేసుకోవడానికి మెదడు... మనిషిని హై కేలరీ ఫుడ్ పట్ల ఆకర్షితమయ్యేలా చేస్తుంది. ఈ క్రమంలో మెదడు చేసే మాయాజాలంలో పడిపోతే ఇక అధిక బరువు, ఆరోగ్యం గురించి మర్చిపోవాల్సిందే.