'అమ్మాయిలు ఫిట్గా ఉండాలి.. పెరగొద్దు.. తగ్గొద్దు' | Want to stay fit; won't gain weight for movie roles: Nargis Fakhri | Sakshi
Sakshi News home page

'అమ్మాయిలు ఫిట్గా ఉండాలి.. పెరగొద్దు.. తగ్గొద్దు'

Nov 6 2015 5:07 PM | Updated on Apr 4 2019 5:41 PM

'అమ్మాయిలు ఫిట్గా ఉండాలి.. పెరగొద్దు.. తగ్గొద్దు' - Sakshi

'అమ్మాయిలు ఫిట్గా ఉండాలి.. పెరగొద్దు.. తగ్గొద్దు'

సినిమాల్లో ఉన్నాం కదా అని అమ్మాయిలు బరువు పెరగడం తగ్గించడం లాంటివి చేయకూడదని ప్రముఖ బాలీవుడ్ నటి నర్గీస్ ఫక్రీ పేర్కొంది

న్యూఢిల్లీ: సినిమాల్లో ఉన్నాం కదా అని అమ్మాయిలు బరువు పెరగడం తగ్గించడం లాంటివి చేయకూడదని ప్రముఖ బాలీవుడ్ నటి నర్గీస్ ఫక్రీ పేర్కొంది. ఎప్పుడు ఫిట్గా ఉండాలనే తాను కోరుకుంటానని,ఓ సినిమా కోసం బరువు పెంచుకోవడం తగ్గించుకోవడం లాంటివి చేయొద్దని ముఖ్యంగా పాత్రలు ఆ మేరకు డిమాండ్ చేసినా అలాంటి సాహసాలకు దిగొద్దని సలహా ఇచ్చింది. తానెప్పుడూ స్లిమ్గా ఫిట్గా ఉండేందుకు ప్రయత్నిస్తానని, అన్ని వేళలా అదే శుభకరమని చెప్పింది.

'బరువు పెరగడం, తగ్గడం అబ్బాయిలు(హీరోలు) చేయాలి తప్ప అమ్మాయిలు చేయకూడదు. వీలయితే నేను ఫిట్గా ఉండటానికే ప్రయత్నిస్తానే తప్ప సినిమాలో కోసం బరువుతగ్గడం పెరగడం మాత్రం చేయను' అని వివరించింది. ఢిల్లీలో కొత్త రీబాక్ షోరూం ఓపెన్ సందర్భంగా అక్కడి మీడియా ప్రతినిధులతో ఆమె ఈ విధంగా తన భావాలను పంచుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement