
పెరిగే వయసును దాచిపెట్టడం చాలా కష్టం.. కానీ కొందరు హీరోలను చూస్తుంటే వయసు వెనక్కు వెళ్లిపోతుందేమో అనిపించక మానదు. బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్ ఖాన్ ఈ కోవలోకే వస్తాడు. 58 ఏళ్ల వయసులోనూ ఎంతో ఫిట్‌గా, యంగ్‌గా కనిపించే ఈ హీరో తాజాగా తన ఫిట్‌నెస్ సీక్రెట్ బయటపెట్టాడు.
అర్ధరాత్రి 2 గంటలకు..
అమెరికన్ నటుడు మార్క్ వాలబర్గ్ నిద్రలేచే సమయానికి నేను నిద్రపోతాను. అంటే ఉదయం ఐదింటికి మంచంపై వాలిపోతాను. ఉదయం 9 లేదా 10 గంటలకు నిద్ర లేస్తాను. త్వరగా రెడీ అయిపోయి షూటింగ్స్‌కు వెళ్తాను. మళ్లీ అర్ధరాత్రి 2 గంటలకు ఇంటికి చేరుకుంటాను. అప్పుడు స్నానం చేసి, అరగంట పాటు వర్కవుట్స్ చేసి హాయిగా నిద్రపోతాను అని చెప్పాడు. అలాగే రోజులో ఒక్కపూట మాత్రమే భోజనం చేస్తాడట.
వంటలు నేర్చుకున్నా
ఆ మధ్య కరోనా వచ్చినప్పుడు జీవితం స్థంభించిపోయింది. ఏం చేయాలో కూడా తోచలేదు. ఇటాలియన్ వంటలు నేర్చుకున్నాను. శరీరాన్ని నాకు నచ్చినట్లు మలుచుకున్నాను. నాలుగేళ్లపాటు స్క్రీన్‌పై కనిపించకపోయేసరికి జనాలు నన్ను మిస్సయ్యారు. అప్పటిదాకా తరచూ ఏదో ఒక సినిమాతో వెండితెరపై కనిపించిన నేను ఏళ్లపాటు కనబడకపోయే సరికి నాకోసం ఆతృతగా వెయిట్ చేశారు అని చెప్పుకొచ్చాడు.
సినిమా..
జవాన్, డుంకీ, పఠాన్ వంటి చిత్రాలతో వరుస విజయాలు అందుకున్న షారూఖ్ ప్రస్తుతం కింగ్ అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో అతడి కూతురు సుహానా నటించనున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఇటీవల జరిగిన లొకార్నో ఫిలిం ఫెస్టివల్‌లో షారూఖ్ ఖాన్‌కు జీవిత సాఫల్య పురస్కారం లభించింది.
Comments
Please login to add a commentAdd a comment