
అంబానీ కొడుకు అంత సన్నమా!
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, బిలియనీర్.. ముకేశ్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ గుర్తే కదా. ఐపీఎల్ మ్యాచ్ల సందర్భంగా తమ ముంబై ఇండియా జట్టుతో లావుపాటిగా కనిపించే ఆ వ్యక్తి అందరికీ సుపరిచితమే లెండి.
ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, బిలియనీర్.. ముకేశ్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ గుర్తే కదా. ఐపీఎల్ మ్యాచ్ల సందర్భంగా తమ ముంబై ఇండియా జట్టుతో లావుపాటిగా కనిపించే ఆ వ్యక్తి అందరికీ సుపరిచితమే లెండి. అయితే ఇప్పుడు అనంత్ అంబానీని చూస్తే మీరు గుర్తు పట్టలేకపోవచ్చు. ఇంతకు ముందు సుమారు 140 కిలోలున్న ఆయన తాజా బరువెంతో తెలుసా.. 70 కిలోలే. శనివారం సోమనాథ్ ఆలయాన్ని సందర్శించిన సందర్భంగా అనంత్ అంబానీ బక్కపలుచగా కనిపించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు.
సన్నబడటం కోసం అమెరికాకు చెందిన ఓ ప్రముఖ ఫిట్నెస్ ట్రైనర్ పర్యవేక్షణలో అనంత్ భారీ కసరత్తులే చేసినట్లు సమాచారం. అంతేకాదు జామ్నగర్లోని రిలయన్స్ రిఫైనరీలో అనంత్ పలుమార్లు మారథాన్ రన్నింగ్ కూడా చేసినట్లు తెలుస్తోంది. ఏమైతేనేం.. లావు తగ్గడం కోసం కొన్ని నెలలుగా అనంత్ అంబానీ పడిన కష్టం సత్ఫలితాలనిచ్చినట్లు స్పష్టంగా తెలుస్తోంది.