ప్రపంచంలోనే అత్యంత బరువుగా ఉన్న రెండో వ్యక్తిగా ఖలీద్ బిన్ మొహసేన్ షరీ అనుహ్యంగా కిలోల కొద్ది బరువు తగ్గాడు. అదికూడా స్వలం కాలంలోనే అన్ని కిలోలు బరువు తగ్గి ఆశ్యర్యపరిచాడు. అంతలా బరువు తగ్గినందుకు గానూ ఖలీద్ సౌదీ అరేబియా రాజు అబ్దుల్లాకు కృతజ్ఞతలు చెప్పుకున్నాడు కూడా. ఇంతకీ ఆ వ్యక్తి ఏం చేసి తన బరువుని తగ్గించుకున్నాడు. అందుకు సౌదీ అరేబియా రాజు ఎలాంటి సాయం అందించాడు తదితరాల గురించి సవివరంగా చూద్దాం.
ఒకప్పుడూ సజీవంగా ఉన్న అత్యంత బరువైన రెండో వ్యక్తిగా పేరుగాంచిన ఖలీద్ సుమారు 546 కిలోల బరువు తగ్గాడు. 2013 వరకు ఖలీద్ బరువు 610 కేజీలు ఉండేవాడు. ప్రాథమిక అవసరాలకు కూడా స్నేహితులు, కుటుంబసభ్యులపై ఆధారపడే స్థాయికి అతని పరిస్థితి దిగజారింది. ఖలీద్ దుస్థితిని చూసి చలించిపోయిన సౌదీ రాజు అబ్దుల్లా అతని ప్రాణాలు కాపాడేందుకు ఎటువంటి ఖర్చు లేకుండా ఉన్నత స్థాయి వైద్యం అందేలా ఏర్పాటు చేశాడు. ముందుగా ఖలీద్‌ను జజాన్‌లోని అతని ఇంటి నుంచి ఫోర్క్‌లిఫ్ట్ సాయంతో ప్రత్యేకంగా రూపొందించిన బెడ్‌ని ఉపయోగించి రియాద్‌లోని షహద్ మెడికల్ సిటీకి తీసుకొచ్చారు.
కఠినమైనమైన ఆహార నియమావళితో చికిత్సను ప్రారంభించారు. దీన్ని అమలు చేసేలా సుమారు 30 మంది వైద్య నిపుణుల బృందాన్ని నియమించారు. అంతేగాదు ఖలీద్ చికిత్సలో భాగంగా గ్యాస్ట్రిక్ బైపాస్ సర్జరీ, కస్టమైజ్డ్ డైట్, ఎక్సర్‌సైజ్ ప్లాన్, ఇంటెన్సివ్ ఫిజియోథెరపీ సెషన్‌లు వంటివి అందించారు. ప్రముఖ నిపుణులు సాయంతో ఖలీద్ బరువు తగ్గడంలో అద్భుతమైన ఫలితాలు చూశాడు.
అంతేగాదు ఖలీద్ కేవలం ఆరు నెలల్లోనే దాదాపు సగం బరువును కోల్పోయాడు. చెప్పాలంటే 2023 నాటికి 542 కేజీలు తగ్గి ఆరోగ్యకరంగా 63.5 కిలోలకు తగ్గాడు. ఇక్కడ ఖలీద్ అనేక అదనపు చర్మ తొలగింపు శస్త్ర చికిత్సలు అవసరం అవుతుంది. ఎందుకంటే కొత్త శరీర ఆకృతికి అనుగుణంగా చర్మం ఉండదు. అంతేగాదు ఖలీద్‌ని వైద్యులు "ది స్మైలింగ్ మ్యాన్" అని ముద్దుగా పిలుచుకుంటారు.
(చదవండి: ఫుడ్ మెమొరీస్.. విభజన టైంలో ఈ వృద్ధుల ‘చేదు’ అనుభవాలు!)
Comments
Please login to add a commentAdd a comment