నడక - నెంబర్లు
ఒక సాధారణ వ్యక్తి నడిచే సమయంలో నిమిషానికి 100 సార్లు అడుగులు వేస్తుంటాడు. అతడి రెండు కాళ్ల వల్ల ప్రతి నిమిషంలో పాదాల మీద 72 కిలోల బరువు పడుతుంది. అంటే ఒక్కో పాదం మీద 50 సార్లు పడుతుంటుంది. పాదం మోపగానే మొదటి బరువు అతడి మడమలోని బంతిలాంటి ఎముకపై పడుతుంది. ఆ తర్వాత కాలివేళ్లలో ఎముకలైన ఐదు మెటాటార్సల్స్‌పై పడుతుంది. వాటి సాయంతో కాలు నేలను వెనక్కుతోస్తుంటుంది.
అలా చేయగానే న్యూటన్ మూడో నియమం ప్రకారం అందరూ ముందువైపునకు నడుస్తుంటారు. ఒక సాధారణ వ్యక్తి రోజులో 7,500 అడుగులు వేస్తాడని అంచనా. ఈ లెక్కన ఏడాదికి 27,37,500 అడుగులు, 80 ఏళ్లు బతికితే జీవితకాలంలో 21,90,00,00 అడుగులు వేస్తాడు. ఒక ఆరోగ్యకరమైన మామూలు వ్యక్తి జీవితకాలంలో లక్షా అరవై వేల కిలోమీటర్ల దూరాన్ని నడుస్తాడు. ఒకవేళ భూమధ్య రేఖ వెంట అతడు నడిస్తే భూమిని నాలుగుసార్లు చుట్టి వస్తాడు.
హెల్త్ క్విజ్
1. అమీబియాసిస్ లక్షణాలు ఏమిటి?
2. అమీబియాసిస్ వ్యాధి ఏ బ్యాక్టీరియా వల్ల వస్తుంది?
3. ఇది ఎలా వ్యాపిస్తుంది?
4. నివారణ ఎలా?
5. ఈ వ్యాధి వ్యాపించడానికి దోహదం చేసే ప్రధాన కారణం ఏమిటి?
జవాబులు:
1. తీవ్రమైన కడుపునొప్పి, వికారం, వాంతులు, జ్వరం, నీరసం, నీళ్ల విరేచనాలు... ఒక్కోసారి ఇందులో కొన్ని లక్షణాలు కనిపించవచ్చు. లేదా ఏ లక్షణాలూ కనిపించకపోవచ్చు.
2. ఎంటమిబా హిస్టోలిటికా అనే ఏకకణ జీవి వల.్ల
3. ఎంటమిబా హిస్టోలిటికా జీవి లేదా దాని గుడ్లు ఏదైనా ఆహారపదార్థాల మీద చేరడం, లేదా నీళ్లలో కలవడం వల్ల.
4. ఆహారం తీసుకునే ముందు, మల విసర్జన తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోవడం, పరిశుభ్రమైన నీటిని తాగడం
5. నీటి కాలుష్యం.