ఇలా కూడా బరువు తగ్గొచ్చు! | weight loss like this also | Sakshi
Sakshi News home page

ఇలా కూడా బరువు తగ్గొచ్చు!

Published Mon, Jun 27 2016 3:46 AM | Last Updated on Mon, Sep 4 2017 3:28 AM

ఇలా కూడా బరువు తగ్గొచ్చు!

ఇలా కూడా బరువు తగ్గొచ్చు!

ఎవరైనా బరువు తగ్గాలంటే డైటింగ్ చేస్తారు లేదా వ్యాయామాలు చేస్తారు. కాని చైనాకు చెందిన కాంగ్ యాన్ సరికొత్త వ్యాయామానికి తెరలేపాడు. ఇంతకీ ఏం చేశాడనుకుంటున్నారా...తల మీద 40 కేజీల బరువుగల  సిమెంట్ దిమ్మెలను  పెట్టుకొని ప్రతిరోజూ 1.5 కిలోమీటర్ల దూరం నడుస్తున్నాడు.

వినడానికి వింతగా ఉన్నా..  115 కేజీలు ఉన్న కాంగ్ తన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఇలాంటి కఠినమైన  వ్యాయామాన్ని ఎంచుకున్నాడు. మొదట 15 కేజీలతో ప్రారంభించి క్రమంగా బరువు పెంచుకుంటూ ప్రస్తుతం 40 కేజీలు  తల మీద పెట్టుకొని అంత దూరం అవలీలగా నడిచేస్తున్నాడు. ఇలా  సంవత్సరంలో 30 కేజీల బరువు తగ్గి ఊబకాయులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement