Daiting
-
ఇలా కూడా బరువు తగ్గొచ్చు!
ఎవరైనా బరువు తగ్గాలంటే డైటింగ్ చేస్తారు లేదా వ్యాయామాలు చేస్తారు. కాని చైనాకు చెందిన కాంగ్ యాన్ సరికొత్త వ్యాయామానికి తెరలేపాడు. ఇంతకీ ఏం చేశాడనుకుంటున్నారా...తల మీద 40 కేజీల బరువుగల సిమెంట్ దిమ్మెలను పెట్టుకొని ప్రతిరోజూ 1.5 కిలోమీటర్ల దూరం నడుస్తున్నాడు. వినడానికి వింతగా ఉన్నా.. 115 కేజీలు ఉన్న కాంగ్ తన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఇలాంటి కఠినమైన వ్యాయామాన్ని ఎంచుకున్నాడు. మొదట 15 కేజీలతో ప్రారంభించి క్రమంగా బరువు పెంచుకుంటూ ప్రస్తుతం 40 కేజీలు తల మీద పెట్టుకొని అంత దూరం అవలీలగా నడిచేస్తున్నాడు. ఇలా సంవత్సరంలో 30 కేజీల బరువు తగ్గి ఊబకాయులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. -
డైటింగ్‌తో డయాబెటిస్‌కు చెక్
పరిపరి శోధన రెండు నెలలు పద్ధతిగా డైటింగ్ చేస్తే చాలు, డయాబెటిస్‌కు చెక్ పెట్టవచ్చని చెబుతున్నారు న్యూకేసిల్ యూనివర్సిటీ నిపుణులు. ముఖ్యంగా టైప్-2 డయాబెటిస్‌ను ఈ పద్ధతిలో చక్కగా అదుపు చేయవచ్చని న్యూకేసిల్ వర్సిటీ ప్రొఫెసర్ రాయ్ టేలర్ చెబుతున్నారు. రోజువారీ ఆహారం 700 కేలరీలకు మించకుండా జాగ్రత్తపడితే చాలని అంటున్నారు. రోజుకు మూడు నాలుగుసార్లు మితంగా డైట్ షేక్స్, కూరగాయలు, ఆకుకూరలు, తృణధాన్యాలతో కూడిన ఆహారం తీసుకున్నట్లయితే, బరువు తగ్గడంతో పాటు టైప్-2 డయాబెటిస్ కూడా అదుపులోకి వస్తుందని తమ అధ్యయనంలో తేలినట్లు ప్రొఫెసర్ టేలర్ వెల్లడిస్తున్నారు. -
హెల్త్ టిప్స్
ఆలూ మేలే.. డైటింగ్ చేసేవాళ్ల ముందు ‘ఆలూ’ అనే మాట ఎత్తితే చాలు.. వామ్మో..వాయ్యో అని అరుస్తుంటారు. ఎందుకని అడిగితే అది ఉన్నదానికన్నా మరింత బరువును పెంచుతుందంటూ భయపడతారు. కానీ బంగాళదుంప తింటే బరువు పెరుగుతారన్నది పూర్తిగా నిజం కాదంటున్నారు నిపుణులు. దాన్ని వండే పద్ధతిని బట్టి వాటి ఉపయోగాలుంటాయట. అసలు బంగాళదుంపపై ఇంత నింద పడటానికి ఓ బలమైన కారణమే ఉంది. అదేమిటంటే వాటితో చిప్స్ అనీ ఫ్రెంచ్ ఫ్రైస్ అనీ ఆలు టిక్కా అని తయారు చేసి మార్కెట్లోకి తీసుకొస్తున్నారు. అవేమో నూనెలో బాగా ఫ్రై చేసిన పదార్థాలు. దాంతో ఆ కారణంగా అవి ఎక్కువగా తిన్నవారు బరువు పెరగడం మొదలైంది. ఫ్రైలు తినడం లాంటి అనారోగ్య పనులుచేయడమే కాకుండా పాపం ‘ఆలూ’ను నిందిస్తున్నారు. అసలు ఈ బంగాళదుంపలో ఉండే ఫైబర్, పొటాషియం, విటమిన్-సి మనిషి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఫ్రైలు కాకుండా వాటిని ఉడకబెట్టుకొని రోజు ఎన్ని తిన్నా ఆరోగ్యానికి మేలే కానీ కీడు జరగదట. అంతేకాదు డైటింగ్ చేసే వారు ఓ పూట అన్నానికి బదులుగా రెండు, మూడు బంగాళదుంపలను ఉడికించుకొని తింటే కడుపు నిండి పోతుందట. ఇప్పటికైనా ప్రచారంలో ఉన్న అపోహలను విడిచి ఆలూను ఆత్మీయంగా దగ్గరికి తీసుకుంటే ఆరోగ్యంగా బరువు తగ్గొచ్చంటున్నారు డాక్టర్లు.