డైటింగ్‌తో డయాబెటిస్‌కు చెక్
పరిపరి శోధన
రెండు నెలలు పద్ధతిగా డైటింగ్ చేస్తే చాలు, డయాబెటిస్‌కు చెక్ పెట్టవచ్చని చెబుతున్నారు న్యూకేసిల్ యూనివర్సిటీ నిపుణులు. ముఖ్యంగా టైప్-2 డయాబెటిస్‌ను ఈ పద్ధతిలో చక్కగా అదుపు చేయవచ్చని న్యూకేసిల్ వర్సిటీ ప్రొఫెసర్ రాయ్ టేలర్ చెబుతున్నారు. రోజువారీ ఆహారం 700 కేలరీలకు మించకుండా జాగ్రత్తపడితే చాలని అంటున్నారు.
రోజుకు మూడు నాలుగుసార్లు మితంగా డైట్ షేక్స్, కూరగాయలు, ఆకుకూరలు, తృణధాన్యాలతో కూడిన ఆహారం తీసుకున్నట్లయితే, బరువు తగ్గడంతో పాటు టైప్-2 డయాబెటిస్ కూడా అదుపులోకి వస్తుందని తమ అధ్యయనంలో తేలినట్లు ప్రొఫెసర్ టేలర్ వెల్లడిస్తున్నారు.