ఢిల్లీ మద్యం కుంభకోణంలో మనీలాండరింగ్ అభియోగాలు ఎదుర్కొంటున్న సీఎం అరవింద్ కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీ (రిమాండ్ ఖైదీ)లో భాగంగా తీహార్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఆయన ఆరోగ్యంపై ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఆయన జైలులో ఉండటం వల్ల అస్వస్థతకు గురయ్యారని.. మార్చి 21న సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ అయినప్పటి నుంచి ఈ రోజు వరకు 4.5 కిలోల బరువు తగ్గారని జలవనరుల శాఖ మంత్రి ఆతీశీ అన్నారు ‘ఎక్స్ ’వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు.
నిజానికి సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీవ్రమైన మధుమేహం (డయాబెటిక్స్) వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి. అయితే ఆయనకు ఆరోగ్య సమ్యలు ఉన్నపటికీ దేశం కోసం 24 గంటలు పని చేసేవారిని ఆతీసీ అన్నారు. కానీ తీహార్ జైలు అధికారులు ఆ ఆరోపణలన్నింటిని కొట్టిపారేశారు. ఆయన ఆరోగ్యం బాగానే ఉందని, షుగర్ లెవెల్స్ కూడా తగ్గలేదని పేర్కొనడం గమనార్హం. అయితే ఇక్కడ మధుమేహ వ్యాధితో బాధపడేవారిలో రక్తంలోని చక్కెర స్థాయిల హెచ్చు తగ్గులు బరువు మీద ప్రభావం చూపిస్తాయా? అలాంటప్పుడు ఏం చేయాలి? తదితరాల విషయాలు గురించి సవివరంగా తెలుసుకుందాం!.
ఇన్సులిన్ నిర్వహణ:
ఒక వ్యక్తి మధుమేహంతో బాధపడుతున్నప్పుడు..వారి శరీరం ఇన్సులిన్ హార్మోన్‌ను ఉత్పత్తి చేయదు. పైగా ప్రతిస్పందించదు. దీని వల్లే రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించడంలో ఇబ్బందులకు దారితీస్తుంది. ఎప్పుడైతే శరీరం ఇన్సులిన్ స్థాయిలను నిర్వహించలేకపోతుందో అప్పుడు రక్తప్రవాహంలో చక్కెర ప్రసరణకు దారితీస్తుంది. ఫలితంగా అదికాస్త కొవ్వుగా పేరుకుపోయి అధిక బరువుకి దారితీస్తుంది.
కొందరూ బరువు ఎలా తగ్గిపోతారు..
రక్తంలోని చక్కెర స్థాయిలు మూత్రం ద్వారా బయటికి వెళ్లిపోవడం జరుగుతుంది. ఇలా జరిగితే శరీరం ముఖ్యమైన శక్తి వనరులను కోల్పోతుంది. శక్తి కోసం గ్లూకోజ్‌ను సమర్థవంతంగా వినియోగిచదు. దీంతో శక్తికోసం శరీరం ఉన్న కొవ్వు నిల్వలను, కండరాలను విచ్ఛిన్నం చేయడం ప్రారంభిస్తుంద. దీంతో బరువు తగ్గడానికి కారణమవుతుంది. ముఖ్యంగా డయాబెటిస్ టైప్ 1తో బాధపడేవారిలో ఈ పరిస్థితి ఎదురవ్వుతుంది.
ద్రవాలను కోల్పోతుంది..
రక్తంలోని చక్కెర స్థాయిలలో హెచ్చు తగ్గులు డీ హైడ్రేషన్, నీటి నిలుపదలకు దారితీస్తుంది. రక్తంలో అధిక చక్కెర స్థాయిలు కారణంగా మూత్రం ద్వారా అదనపు గ్లూకోజ్ వెళ్లపోతుండటంతో నిర్జలీకరణ దారితీసి, శరీర బరవును తాత్కలికంగా పెంచే రీహైడ్రేషన్‌కి గురై బరువు పెరిగే అవకాశం ఉంటుంది.
జీవక్రియ ప్రభావం
దీర్థకాలికి వ్యాధి అయిన బ్లడ్ షుగర్ ఇన్సులిన్ నిరోధకతకు దారితీస్తుంది. ఇక్కడ కణాలలోకి గ్లూకోజ్ పొందాలంటే శరీరానికి ఎక్కువ ఇన్సులిన్ అవసరమవుతుంది. ఈ అదనపు ఇన్సులిన్ కొవ్వు నిల్వకు దారితీస్తుంది. ముఖ్యంగా పొత్తి కడుపు ప్రాంతంలో బరువు పెరిగేందుకు దారితీస్తుంది. అందువల్ల మధుమేహం ఉన్నవారికి రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడం చాలా ముఖ్యం. ఎందుకుంటే..? బరువు నిర్వహణకు ఇది అత్యంత ముఖ్యమైనది. అందువల్ల ఈ వ్యాధిగ్రస్తులు సరైన మందులు వాడుతూ..ఫైబర్ అధికంగా ఉండే సమతుల్య ఆహారం తీసుకోవడం వంటివి చేయాలి. అలాగే శారీర శ్రమ, రక్తంలోని చక్కెర స్థాయిలు పెరగకుండా పర్యవేక్షించడం వంటివి చేస్తుంటే ఈ సమస్య నుంచి సులభంగా బయటపడగలుగుతాం. బరువు కూడా అదుపులో ఉంటుంది.
గమనిక: ఇది కేవలం అవగాహన కోసమే ఇచ్చాం. వ్యక్తిగత నిపుణులు, వైద్యులు సలహాలు సూచనలతో మధుమేహం వ్యాధిగ్రస్తులు ఎలాంటి జాగ్రత్తల తీసుకుని ఆచరిస్తే మంచిది అనేది తెలసుకోవడం ఉత్తమం.
(చదవండి: మధుమేహాన్ని ఇలా నియంత్రించొచ్చా? ప్రూవ్ చేసిన ఫైనాన్షియల్ ఆఫీసర్)
Comments
Please login to add a commentAdd a comment