సమోసా, చిప్స్‌ తింటున్నారా! | Diabetes threat with ultra processed food | Sakshi
Sakshi News home page

సమోసా, చిప్స్‌ తింటున్నారా!

Published Fri, Oct 25 2024 4:47 AM | Last Updated on Fri, Oct 25 2024 4:47 AM

Diabetes threat with ultra processed food

అల్ట్రా ప్రాసెస్డ్‌ ఫుడ్‌తో మధుమేహం ముప్పు 

విస్తుగొలిపే విషయాలను వెల్లడించిన ఐసీఎంఆర్‌ 

మద్రాస్‌ డయాబెటిస్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌తో కలిసి పరిశోధనలు జరిపిన ఐసీఎంఆర్‌ 

డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ బయో టెక్నాలజీ క్లినికల్‌ ట్రయల్‌ రన్‌లోనూ ఇవే విషయాలు వెల్లడి 

బేకరీ ఉత్పత్తులు, ఫాస్ట్‌ ఫుడ్స్‌లోనూ ఏజీఈ అధికం 

పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలతో మధుమేహం నుంచి రక్షణ

సమోసా.. పకోడీ.. ఫ్రైడ్‌ చికెన్‌.. చిప్స్‌.. బిస్కెట్లు.. కేక్స్‌.. రెడీమేడ్‌ మీల్స్‌.. మయోనైజ్, గ్రిల్డ్‌ చికెన్‌.. డ్రై నట్స్‌.. వేయించిన వాల్‌నట్స్‌ వంటి ఆహార పదార్థాలు డయాబెటిస్‌ పెరిగేందుకు దోహదం చేస్తున్నాయని ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) పరిశోధనలో వెల్లడైంది. మద్రాస్‌ డయాబెటిస్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌ (ఎండీఆర్‌ఎఫ్‌)తో కలిసి ఐసీఎంఆర్‌ ఇటీవల నిర్వహించిన పరిశోధనలో విస్తుగొలిపే అంశాలు వెలుగు చూశాయి. మరోవైపు కేంద్రంలోని శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో బయోటెక్నాలజీ విభాగం నిర్వహించిన తాజా క్లినికల్‌ ట్రయల్‌ రన్‌లోనూ మధుమేహం ముప్పునకు పైన పేర్కొన్న ఆహార పదార్థాలే కారణమని స్పష్టమైంది.     – సాక్షి, అమరావతి

ఏజీఈ అధికంగా ఉండటం వల్లే..
సమోసా, పకోడీ, ఫ్రైడ్‌ చికెన్, చిప్స్, నూడిల్స్, సూప్‌లు, ఇతర ప్యాక్డ్‌ ఆహార పదార్థాలను పిల్లల నుంచి పెద్దలు ఇష్టంగా తింటున్నారు. ఈ తరహా అల్ట్రా ప్రాసెస్డ్‌ ఫుడ్స్‌ (యూపీఎఫ్‌) దేశంలో మధుమేహం ముప్పును రోజురోజుకూ పెంచుతోంది. భారతదేశం ప్రపంచ మధుమేహ రాజధానికి ఉండటానికి హానికరమైన ఆహారపు అలవాట్లే కారణమవుతున్నాయి. ప్రస్తుతం దేశంలో 10.10 కోట్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారు. అల్ట్రా ప్రాసెస్డ్‌ ఫుడ్స్‌లో అడ్వాన్స్‌డ్‌ గ్లైకేషన్‌ అధికంగా ఉంటుంది. ఈ ఆహారాలు రక్తంలో చక్కెరను పెంచుతున్నాయని తేలింది.

అధునాతన గ్లైకేషన్‌ ముగింపు ఉత్పత్తులు (ఏజీఈ) హానికరమైన సమ్మేళనాలు. గ్లైకేషన్‌ అనే ప్రక్రియ ద్వారా ప్రోటీన్లు లేదా కొవ్వులు చక్కెరలతో సంకర్షణ చెందుతున్నప్పుడు మధుమేహం ఏర్పడుతుంది. ఏదైనా ఆహార పదార్థాన్ని వేయించినప్పుడు లేదా కాల్చినప్పుడు, అందులో ఏజీఈలు ఏర్పడతాయి. ఇవి ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాల వినియోగం ఊబకాయాన్ని పెంచుతోందని.. ఇది మధుమేహానికి ప్రధాన కారణమవుతోందని వెల్లడైంది. ఈ పరిశోధన ఇంటర్నేషనల్‌ జర్నల్‌ ఆఫ్‌ ఫుడ్‌ సైన్సెస్‌ అండ్‌ న్యూట్రిషన్‌లో ప్రచురించబడింది.

ఆయుర్దాయంపై ప్రభావం 
టైప్‌–2 డయాబెటిస్‌ మనిషి ఆయుర్దాయంపైనా ప్రభావం చూపుతోంది. అధిక ఆదాయ వర్గానికి చెందిన 19 దేశాల్లో 15 లక్షల మంది జనాభా ఆరోగ్య రికార్డులపై అధ్యయనానికి సంబంధించిన అంశాలను ఇటీవల ది లాన్సెట్‌ డయాబెటిస్, ఎండోక్రైనాలజీలో ప్రచురించారు. 30 ఏళ్లలో టైప్‌–2 బారినపడిన వ్యక్తి సగటు ఆయుర్దాయం 14 ఏళ్లు క్షీణిస్తుందని, 40 ఏళ్ల వయసులో సమస్య తలెత్తితే పదేళ్లు, 50 ఏళ్లకు కనిష్టంగా ఆరేళ్ల చొప్పు­న ఆయుర్దాయం తగ్గుతోందని పరిశోధకులు తేల్చారు.

38 మందిపై.. 12 వారాల పరీక్ష 
పరిశోధన నిమిత్తం ఎంపిక చేసిన 38 మందిపై 12 వారాలపాటు పరీక్షలు నిర్వహించారు. మధుమేహం లేనివారిని రెండు సమూహాలుగా విభజించారు. 12 వారాల పాటు ఒక సమూహానికి అడ్వాన్డ్స్‌ గ్‌లైకేషన్‌ ఎండ్‌ ప్రొడక్డ్స్‌ (ఏజీఈ) తక్కువగా ఉండే ఆహారం, మరో సమూహానికి ఏజీఈ అధికంగా ఉండే ఆహారాన్ని అందించారు. 12 వారాల అనంతరం పరిశీలిస్తే అధిక ఏజీఈ ఆహారం తిన్న సమూహంతో పోలిస్తే తక్కువ ఏజీఈ ఆహారం తిన్న సమూహంలోని వ్యక్తుల్లో టైప్‌–2 మధుమేహం ముప్పు తక్కువగా ఉందని గుర్తించారు. వీరిలో ఇన్సులిన్‌ నిరోధకతæ గణనీయంగా పెరిగిందని పరిశోధకులు వెల్లడించారు. కేకులు, కుక్కీలు వంటి కాల్చిన ఆహారాల్లో ఏజీఈలు ఎక్కువగా ఉంటాయి.

చిప్స్, సమోసాలు, పకోడీలు, వేయించిన చికెన్‌ వంటి వాటిలో పెద్ద పరిమాణంలో ఏజీఈ ఉంటోంది. అలాగే రెడీమేడ్‌ ఆహార పదార్థాల రూపంలో వచ్చే వనస్పతి, మయోనైస్‌ కూడా చక్కెరను పెంచుతాయి. కాల్చిన మాంసాలు, కాల్చిన గింజలలో ఏజీఈలు సమృద్ధిగా ఉంటాయి. వీటి వాడకం వల్ల చక్కెర వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఫ్రైడ్‌ ఫుడ్స్‌ స్థానంలో తక్కువ ఏజీఈ డైట్‌ తీసుకోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు. ఆహారంలో పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు 
వంటి వాటిని చేర్చుకోవాలని ఐసీఎంఆర్‌ స్పష్టం చేసింది.

ఏమిటీ అడ్వాన్డ్స్‌ గ్‌లైకేషన్‌ ఎండ్‌ ప్రాడక్ట్స్‌
ఫ్రై, రోస్ట్‌ (బాగా వేడి) చేసిన అల్ట్రా ప్రాసెస్డ్‌ ఫుడ్స్‌ (యూపీఎఫ్‌) ఆహారాన్ని తిన్నప్పుడు కార్పొహైడ్రేట్స్‌ శరీరంలో నేరుగా ప్రొటీన్స్, కొవ్వులతో కలిసి అడ్వాన్డ్స్‌ గ్‌లైకేషన్‌ ఎండ్‌ ప్రాడక్ట్స్‌(ఏజీఈ)లుగా రూపాంతరం చెందుతాయి. వీటివల్ల శరీరంలో హానికరమైన మాలిక్యుల్స్‌ తయారవుతాయి. ఇవి ఎక్కువ కావడంతో శరీరంలో ఇన్సులిన్‌ 
నిరోధకత తగ్గిపోతుంది. శరీరంలోని కణాల్లోకి గ్లూకోజ్‌ను అందించడంలో ఇన్సులిన్‌ తాళం చెవి మాదిరిగా పనిచేస్తుంది. ఏజీఈ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల శరీరంలో ఇన్సులిన్‌ నిరోధకతను దెబ్బతీస్తుంది. ఈ నేపథ్యంలో తిన్న ఆహారంలోని చక్కెర పదార్థాలు కణాలకు అందకుండా రక్తంలోని ఉండిపోయి టైప్‌–2 మధుమేహానికి దారి తీస్తుంది. అంతేకాకుండా ఊబకాయం, ఇతర దీర్ఘకాలిక వ్యాధులకు దారితీస్తుంది. ఈ క్రమంలో ఏజీఈ అధికంగా ఉండే బేకరీ, హోటల్స్‌లో తయారు చేసే కేక్స్, చిప్స్, ఐస్‌క్రీమ్స్, ఇంట్లో డీప్‌ ఫ్రై, ఫ్రై ఆహార పదార్థాలు తినడం తగ్గించాలని పరిశోధకులు స్పష్టం చేశారు.

మిలమిలలాడే ఆహార పదార్థాలను వినియోగించొద్దు 
పూరీ్వకులు పాలిష్‌ చేయని దంపుడు బియ్యం, కూరగాయలు, పండ్లు ఆహారంగా తీసుకునే వారు. ప్రస్తు­తం బియ్యం, చక్కెర, ఉప్పు ఇలా ప్రతీది తెల్లగా మిలమిలలాడేలా పాలిష్‌ చేస్తున్నారు. ఈ పాలిష్‌ ఆహార పదార్థాలను విడనాడాలి. – పి.శ్రీనివాసులు, హెచ్‌వోడీ ఎండోక్రినాలజీ విభాగం, కర్నూలు మెడికల్‌ కాలేజీ 

జీవన శైలిలో మార్పు రావాలి 
టైప్‌–2 మధుమేహం అనారోగ్యకరమైన జీవన శైలి కారణంగా వస్తుంది. దీనికి తోడు హానికరమైన ఆహారపు అలవాట్లు తోడై పిల్లలు సైతం మధుమేహం బారినపడుతున్నారు. చదువు, వృత్తి, ఉద్యోగాల్లో ఒత్తిడిని అధిగమించడానికి ప్రయతి్నంచాలి. మధుమేహం అని తేలాక అశ్రద్ధ చేయకుండా వైద్యులను సంప్రదించాలి.
– డాక్టర్‌ వెంకట సందీప్, ఎండోక్రినాలజిస్ట్, గుంటూరు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement