
మానవ జీవన శైలి కారణంగా రానున్న రోజుల్లో మరిన్ని వ్యాధుల బారినపడే అవకాశం ఉంది. రోజురోజుకు మారిపోతున్న టెక్నాలజీలు, కొత్తగా అందుబాటులోకి వైద్య చికిత్సలు ఒకవైపు.. మారుతున్న జీవనశైలి, కాలుష్యం వంటివి మనుషుల మరణం తీరును మార్చేస్తున్నాయి.
భవిష్యత్తులో రోడ్డు ప్రమాదాలు, ఇతర ప్రమాద మరణాలు, టీబీ, ఎయిడ్స్ వంటివాటితో జరిగే మరణాలు బాగా తగ్గిపోతే.. అల్జీమర్స్, కిడ్నీ వ్యాధులు, డయాబెటిస్ కారణంగా మరణాలు పెరిగిపోతాయని ఓ అధ్యయనం తేల్చింది. 2016లో నమోదైన మరణాలకు (సహజ మరణాలు కాకుండా..) కారణాలను పరిశీలించడంతోపాటు 2040లో మరణాలకు కారణమయ్యే 20 ప్రధాన అంశాలను అంచనా వేసింది.
ఈ నేపథ్యంలో భవిష్యత్తులో గుండె జబ్బులు, మధుమేహం, వివిధ రకాల కేన్సర్లు పెరుగుతాయని.. జీవన శైలిలో మార్పులు చేసుకోవడం, తగిన జాగ్రత్తలు పాటించడం ద్వారా ఆ ముప్పును తప్పించుకోవచ్చని పేర్కొంది. సైన్స్ జర్నల్ లాన్సెట్‌లో ఈ అధ్యయన నివేదిక తాజాగా ప్రచురితమైంది.

Comments
Please login to add a commentAdd a comment