యునాని వైద్య విధానాన్ని ఆదరించాలి
– జిల్లాఎస్పీ ఆకే రవికృష్ణ
కర్నూలు(ఓల్డ్‌సిటీ): యునాని వైద్య విధానాన్ని ప్రజలు ఆదరించాలని జిల్లా ఎస్పీ ఆకే రవికృష్ణ పిలుపునిచ్చారు. డాక్టర్ అబ్దుల్ హక్ యునాని కళాశాలలో రెండు రోజులుగా జరుగుతున్న యునాని మెడిసిన్ ఎక్స్‌పో–2017 ఎంతో ఆకట్టుకుంది. వైద్య విద్యార్థులు యునాని వైద్యంలో వివిధ జబ్బులకు ఉపయోగించే ప్రత్యేక పద్ధతులను సూచించే స్టాళ్లు ప్రదర్శించారు. ముగింపు కార్యక్రమానికి జిల్లా ఎస్పీ హాజరై స్టాళ్లను తిలకించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ మహబూబ్ బాషా కళాశాల సూపరింటెండెంట్ డాక్టర్ జైనులాబద్దీన్ ఖాన్, ఆర్‌ఎం డాక్టర్ ఇక్బాల్‌హుసేన్, కరస్పాండెంట్ డాక్టర్ అమీర్‌అహ్మద్, ప్రోగ్రామ్ కన్వీనర్ డాక్టర్ కలీముర్రహ్మాన్, ఆర్గనైజర్ డాక్టర్ సర్‌ఫరాజ్ నవాజ్, అడ్వయిజర్ డాక్టర్ పి.ఎం.డి.జుబేర్. డాక్టర్ కరీమున్నిసా, డాక్టర్ మజరున్నిసా పాల్గొన్నారు.