ప్రాణాంతక బ్లడ్ కేన్సర్‌కు చికిత్సను అందించేందుకు గాను నూతన ఔషధాన్ని పరిశోధకులు అభివృద్ధి చేశారు.
న్యూయార్క్: ప్రాణాంతక బ్లడ్ కేన్సర్‌కు చికిత్సను అందించేందుకు గాను నూతన ఔషధాన్ని పరిశోధకులు అభివృద్ధి చేశారు. కేవలం డోక్సోరుబిసిన్ అనే ఈ నూతన ఔషధాన్ని మాత్రమే తీసుకోవడం లేదా కీమోథెరపీతో కలిపి తీసుకోవడం ద్వారా బ్లడ్ కేన్సర్‌కు మెరుగైన చికిత్స అందించవచ్చని వారు తెలిపారు. ఈ డ్రగ్‌ను అభివృద్ధి చేసిన పరిశోధకులు బృందానికి భారత సంతతికి చెందిన శాస్త్రవేత్త ముఖ్యపాత్ర పోషించారు. ఎక్యూట్ లింఫోబ్లాస్టిక్ లుకేమియా అనే కేన్సర్ కణాల వల్ల పిల్లలు, పెద్దలు కేన్సర్ బారిన పడతారని, ఇలా దీని బారిన పడిన 30 శాతం మంది రోగుల్లో ఫిలడేల్ఫియా అనే క్రోమోజోమ్ ఉంటుందని వారు వెల్లడించారు.
ఈ ఫిలడేల్ఫియా క్రోమోజోమ్‌లు ఉన్న కేన్సర్ కణాలు మన డీఎన్‌ఏను రిపేర్ చేస్తాయని అన్నారు. వీటి కారణంగానే కేన్సర్ మందులకు లొంగదని వారు తెలిపారు. కావున ఇలా జరిగే డీఎన్‌ఏ రిపేర్‌ను నిలువరించేందుకు ఈ నూతన విధానాన్ని కనుగొన్నామని అమెరికాలోని ఉతాహ్ యూనివర్సిటీకి చెందిన పోస్ట్ డాక్టరల్ శ్రీవిద్య భాస్కరా వివరించారు. డీఎన్‌ఏను రిపేర్ చేసే ముఖ్యమైన రెండు ప్రోటీన్‌లపై తాము దృష్టి సారించడం ద్వారా డోక్సోరుబిసిన్ అనే ఔషధం చికిత్సకు సహకరిస్తుందని గుర్తించామని వెల్లడించారు. ఈ పరిశోధన ఫలితాలు జర్నల్ లుకేమియాలో ప్రచురితమయ్యాయి.