
ఆత్మకూర్ (ఎస్), (సూర్యాపేట): గ్రామానికి కీడు సోకిందని ప్రజలందరూ తమ ఇళ్లకు తాళాలు వేసి వన వాసానికి వెళ్లిన ఘటన సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ (ఎస్) మండలం శెట్టిగూడెంలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామంలో నెల రోజులుగా కొందరు జ్వరాల బారిన పడుతున్నారు. కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకున్నా తగ్గడం లేదు.
అంతేకాకుండా వైద్యశాఖ ఆధ్వర్యంలో శిబిరాలు ఏర్పాటు చేసి వైద్యం అందించినా తగ్గుముఖం పట్టడం లేదు. దీంతో గ్రామానికి కీడు సోకిందని.. గ్రామాన్ని ఖాళీ చేసి వెళ్లాలని పెద్ద మనుషుల సమక్షంలో నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఆదివారం ఊరంతా తమ ఇళ్లకు తాళాలు వేసి తెల్లవారుజామునే గ్రామ శివారులో ఏర్పాటు చేసిన నిప్పును కొనుక్కుని వనవాసానికి వెళ్లారు. దీంతో గ్రామంలో వీధులన్నీ బోసిపోయి కనిపించాయి.
Comments
Please login to add a commentAdd a comment