మధుమేహంతో హృద్రోగ ముప్పు
ప్రముఖ ఎండోక్రినోలజిస్ట్ డాక్టర్ బిపిన్‌సేథీ
అందుబాటులో హృద్రోగ మరణాలు తగ్గించే మందు
ఎఫ్‌డీఏ అనుమతి పొందిన ‘ఎంపాగ్లిఫ్లోజిన్’ ఔషధం
హైదరాబాద్: సాధారణ రోగులతో పోలిస్తే టైప్–2 మధుమేహంతో బాధపడుతున్న రోగులకు హృద్రోగ ముప్పు ఎక్కువగా పొంచి ఉందని ప్రముఖ ఎండోక్రినోలజిస్ట్ డాక్టర్ బిపిన్‌సేథీ స్పష్టం చేశారు. వీరిలో గుండెపోటు, గుండె పనితీరు దెబ్బతినడం వంటి సమస్యలు రెండు నుంచి నాలుగు రెట్లు అధికమని తెలిపారు. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్‌లోని హోటల్ గ్రీన్‌పార్క్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మారిన జీవన శైలి, పని ఒత్తిడి, ఆహా రపు అలవాట్ల వల్ల మధు మేహుల సంఖ్య రోజు రోజుకు మరింత పెరుగు తోందన్నారు. ప్రస్తుతం నమోదు అవుతున్న మధు మేహ బాధితుల మరణా లకు హృద్రోగ సమస్యే ప్రధాన కారణమని చెప్పారు. మధుమేహంతో భాధపడుతున్న రోగులు ‘ఎంపాగ్లిఫ్లోజిన్’అనే యాంటి డయాబెటిక్ మెడి సిన్ వాడటం వల్ల హుద్రోగ మరణాల ముప్పు 38 శాతం తగ్గిందని.. ఇటీవల 42 దేశాల్లో 7,000 మందిపై పరీక్షించగా ఇదే అంశం నిరూపితమైం దన్నారు.
దీనికి యూఎస్ ఎఫ్‌డీఏ అనుమతితో పాటు అమెరికన్ డయాబెటిక్ అసోసియేషన్ అనుమతి కూడా లభించిందన్నారు. సాధారణ డయాబెటిక్ మందులతో పోలిస్తే ఈ టాబ్లెట్ ధర కొంత ఎక్కువని.. 10ఎంజీ, 25 ఎంజీలో లభిస్తుం దన్నారు. ఈ మందు వాడాలంటే మూత్రపిండాల పనితీరులో ఎలాంటి లోపం ఉండకూడదని స్పష్టం చేశారు. కిడ్నీల పనితీరు దెబ్బతిన్న రోగులకు ఈ మందు పనికిరాదని తెలిపారు. ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ దయాసాగర్ మాట్లాడుతూ.. టైప్–2 మధుమేహుల్లో అథెరొస్లెలే రోటిక్ అనే హృద్రోగ సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపారు. రోజుకు కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయ డం, ఆహారాన్ని మితంగా తీసుకోవడం, మాంసం, మద్యం, ధూమపానం వంటి దురలవాట్లకు దూరంగా ఉండటం వల్ల ఈ వ్యాధుల భారీన పడ కుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చన్నారు. స్వీయ నియంత్రణ పాటించక పోతే 2040 నాటికి మధు మేహుల సంఖ్య 123.3 మిలియన్లకు చేరుకునే ప్రమాదం ఉందని హెచ్చరించారు.