రైలు వస్తుండగానే దాని ముందు నిల్చుని సెల్ఫీలు తీసుకోవాలన్న యత్నంలో ఇప్పటికే కొందరు వ్యక్తులు మృతిచెందారు. కొన్ని సందర్భాల్లో తీవ్ర గాయాలపాలవుతూ కాళ్లు, చేతులు కోల్పోతుంటారు. అయితే తాజాగా జమ్మూకశ్మీర్‌కు చెందిన మెడిసిన్ విద్యార్థి చేసిన డేరింగ్ ఫీట్‌పై తీవ్ర విమర్శలు వెల్లవెత్తుతున్నాయి. రైలు పట్టాలపై పడుకుని రైలు వెళ్తుండగా స్నేహితుడితో ఈ తతంగాన్ని వీడియో తీయించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అవుతోంది. ఆ యువకుడి చర్యలను పిచ్చి చేష్టలుగా మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా పేర్కొన్నారు. ఇలాంటివి చేయకూడదంటూ యువతను హెచ్చరించారు.