CM YS Jagan Mohan Reddy once again showed humanity - Sakshi
Sakshi News home page

నేను విన్నాను.. నేనున్నాను.. మరోసారి మానవత్వాన్ని చాటుకున్న సీఎం జగన్‌..

Published Thu, Apr 20 2023 7:55 AM | Last Updated on Thu, Apr 20 2023 8:40 PM

Cm Ys Jagan Once Again Showed Humanity - Sakshi

తమను ఆదుకోవాలని ఫ్లకార్డు ప్రదర్శిస్తున్న కార్తీక్‌ తండ్రి వెంకటరావు.. ఆక్సిజన్‌ సిలిండర్‌తో సీఎం సభా ప్రాంగణానికి వస్తున్న రవికుమార్‌ 

అరసవల్లి(శ్రీకాకుళం జిల్లా): శ్రీకాకుళం జిల్లా పర్యటనకు వచ్చిన సీఎం జగన్‌  మరోసారి తన ఉదార స్వభావాన్ని చాటుకున్నారు. దీర్ఘకాల వ్యాధులతో బాధ పడుతున్న పలువురికి మెరుగైన వైద్యం, తక్షణ సాయం అందేలా ఆదేశించారు. నౌపడ సభా వేదిక నుంచి హెలిప్యాడ్‌కు వెళ్తున్న సమయంలో టెక్కలి మండలానికి చెందిన లాయిపండా వెంకటరావు తన కుమారుడు కార్తీక్‌ (9) ‘తొసిల్‌­జు­మాబ్‌–సోజియా’ అనే ఎముకల వ్యాధితో ఆరేళ్లుగా బాధ పడుతు­న్నాడ­ని సీఎంకు చెప్పారు.

వైద్య ఖర్చులకు ఇంటిని కూడా అమ్మేశానన్నారు. సీఎం స్పందిస్తూ మెరుగైన వైద్యం అందేలా చూడాలని, తక్షణ సాయంగా రూ.5 లక్షలు ఇవ్వాలని కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లాఠ్కర్‌ను ఆదేశించారు. వీరి విషయం ఫాలోఅప్‌ చేయాలని సీఎంవో కార్యదర్శి ధనంజయరెడ్డికి సూచించారు.

శ్రీకాకుళం జిల్లాకు చెందిన కొండటెంబురు గ్రామానికి చెందిన అన్నపూర్ణ తన కూతురు రాజశ్రీ పుట్టకతోనే పక్షవాతం బారిన పడిన విషయాన్ని సీఎం జగన్‌ దృష్టికి తీసుకొచ్చారు. తమ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై చలించిపోయిన సీఎం జగన్‌ సీఎం రిలీఫ్‌ పండ్‌ నుంచి రూ. లక్షల మంజూరు చేశారు. 

శ్రీకాకుళం జిల్లా లింగాలవలస గ్రామానికి చెందిన అప్పారావు తన కుమారుడు దిలీప్‌ కుమార్‌ పుట్టకతోనే దివ్యాంగుడనే విషయాన్ని సీఎం జగన్‌ దృష్టికి తెచ్చారు. ఎస్సీ కమ్యూనిటీకి చెందిన తమ ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రమేని సీఎం జగన్‌కు విన్నవించారు. దీనికి సీఎం రిలీఫ్‌ పండ్‌ నుంచి రూ. 2లక్షల మంజూరు చేశారు సీఎం జగన్‌. 

విజయనగరం జిల్లా సారథికి చెందిన వంజరాపు రామ్మూర్తి కుమారుడు రవికుమార్‌ (33) ఊపిరితిత్తుల వ్యాధి వల్ల ఆక్సిజన్‌ సిలెండర్ల మీదే బతుకుతున్నాడని స్థానిక సామాజిక కార్యకర్త పాలూరి సిద్ధార్థ బాధితుని తరఫున సీఎంను కోరారు. తక్షణ సాయంగా రూ.లక్ష అందివ్వాలని, ప్రతి నెలా రూ.10 వేలు íపింఛన్‌ మంజూరు చేసేలా విజయనగరం జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మిని ఆదేశించాలని సీఎంఓ కార్యదర్శి ధనంజయరెడ్డికి సూచించారు. బాధితులు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికు కృతజ్ఞతలు తెలిపారు.
చదవండి: Fact Check: సీతకొండపై బాబు బొంకు!.. అబద్ధాలతో ట్వీట్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement