సీఎంను కలిసిన బాధితుడు పువ్వాడ సాయి
సాక్షి ప్రతినిధి, గుంటూరు: బాధితులకు సాయం చేసినా ఎల్లో మీడియా సహించలేకపోతోంది! రాష్ట్ర ప్రభుత్వంపై బురద చల్లడమే ఏకైక లక్ష్యంగా నిత్యం దుష్ప్రచారాలకు తెగిస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం పల్నాడు జిల్లా క్రోసూరులో జగనన్న విద్యా కానుక కిట్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సంగతి తెలిసిందే. సీఎం జగన్ హెలిప్యాడ్ నుంచి సభాస్థలికి కాన్వాయ్‌లో వస్తుండగా అచ్చంపేట మండలం ముత్యాల గ్రామవాసి పువ్వాడ సాయి, అతడి తల్లి తమ సమస్యను చెప్పుకునేందుకు ప్రయత్నించారు. వారిని చూసిన ముఖ్యమంత్రి తన వద్దకు తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.
అయితే ముఖ్యమంత్రి పట్టించుకోకుండా బస్సులో ముందుకు వెళ్లిపోయారంటూ ఎల్లో మీడియా అబద్ధాలకు తెగించింది. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసింది. నిజానికి బాధితుల సమస్యను తెలుసుకున్న ముఖ్యమంత్రి జగన్ తక్షణమే స్పందించారు. చెయ్యి విరిగిన సాయి చికిత్స కోసం రూ.లక్ష ఆర్థిక సాయం అందించడంతోపాటు ఫిజియోథెరపీ అందించాలని ఆదేశించారు. ఈ మేరకు నరసరావుపేట కలెక్టర్ కార్యాలయంలో అదేరోజు సాయంత్రం పువ్వాడ సాయి కుటుంబ సభ్యులకు తక్షణ సాయం రూ.లక్ష అందించారు.
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అత్యాధునిక వైద్య చికిత్స అందించేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. వివిధ సమస్యలతో ముఖ్యమంత్రి జగన్‌ను కలసిన మరో 21 మందికి తక్షణ సాయంగా రూ.32.50 లక్షలు ఆరి్థక సాయం అందించడంతోపాటు అవసరమైన వారికి వైద్య సేవలు అందించేలా చర్యలు చేపట్టారు. దీనిపై బురద చల్లుతూ సామాజిక మాధ్యమాల్లో దు్రష్పచారాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకునేందుకు అధికారులు సన్నద్ధం అవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment