మెడిసిన్ల ధరలు తగ్గాయ్!
మెడిసిన్ల ధరలు తగ్గాయ్!
Published Thu, Jan 26 2017 7:49 PM | Last Updated on Sat, Jul 6 2019 3:20 PM
న్యూఢిల్లీ : 33 ముఖ్యమైన మెడిసిన్ల ధరలను డ్రగ్ ప్రైస్ రెగ్యులేటరీ తగ్గించేసింది. వీటి రిటైల్ ధరలు 30-50 శాతం తగ్గిస్తున్నట్టు నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ(ఎన్పీపీఏ) పేర్కొంది. తగ్గిన మెడిసిన్ ధరల్లో జలుబు, దగ్గు, యాంటీ బయోటిక్స్లతో పాటు పలు రకాల ముఖ్యమైన మందులున్నాయి. మ్యానుఫాక్చర్స్ నిర్ణయించిన ధరలను పాటించని కంపెనీలు, డ్రగ్స్ ఆర్డర్,2013 ప్రొవిజన్స్ కింద ఎక్కువ మొత్తంలో రెగ్యులేటరీ వద్ద డిపాజిట్ చేయాల్సి ఉంటుందని ఓ నోటిఫికేషన్లో తెలిపింది.
క్రిటికల్ వ్యాధులకు సాధారణంగా వాడుతున్న మందుల ధరలు తగ్గించే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నామని, మరికొన్ని కొత్త డ్రగ్లను కూడా ప్రైస్ రెగ్యులేషన్ కిందకు తీసుకొస్తామని అథారిటీ పేర్కొంది. 33 రకాల మందులను డ్రగ్ ప్రైస్ రెగ్యులేటరి రెండు కేటగిరీల్లో విభజించింది. 11 కొత్త రకం మందులను ప్రైస్ కంట్రోల్ కిందకు తీసుకొచ్చింది. సమీక్షించిన ఈ 33 మందుల వివరాలను నేషనల్ లిస్టు ఆఫ్ ఎసెన్సియల్ మెడిసిన్లు, 2015లోకి చేర్చింది.
Advertisement
Advertisement