ప్రశాంతంగా ఎంసెట్– 3
ప్రశాంతంగా ఎంసెట్– 3
Published Sun, Sep 11 2016 8:37 PM | Last Updated on Tue, Oct 16 2018 3:25 PM
నల్లగొండ టూటౌన్: జిల్లా కేంద్రంలోని ఐదు సెంటర్లలో ఆదివారం జరిగిన మెడిసిన్, డెంటల్ ఎంసెట్ – 3 పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 2160 మంది విద్యార్థులకు గాను 1427 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. పది గంటలలకు ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించకపోవడంతో విద్యార్థులు చివరి సమయాల్లో పరీక్షా కేంద్రాలకు వద్దకు పరుగులు తీశారు. కాగా ఎన్జీ కళాశాల కేంద్రానికి ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చిన మిర్యాలగూడ మండలం గోపసముద్రం తండాకు చెందిన స్వాతిని అధికారులు పరీక్షకు అనుమతించకపోవడంతో కన్నీరుమున్నీరై వెనుదిరిగింది. పరీక్షా కేంద్రాలను అదనపు జేసీ వెంకట్రావు, ఆర్డీఓ వెంకటాచారి, ఎంసెట్ – 3 ప్రత్యేక పరీశీలకుడు, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కో–ఆర్డినేటర్ ధర్మానాయక్, ఎన్జీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్.నాగేందర్‌రెడ్డిలు తనిఖీ చేశారు.
Advertisement
Advertisement