- నెల రోజుల్లో నిర్మాణం ప్రారంభించకుంటే గోదాంల అనుమతి రద్దు
విద్య, వైద్యంపై ప్రత్యేక శ్రద్ధ
Published Tue, Aug 30 2016 12:16 AM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM
హన్మకొండ : విద్య, వైద్య రంగాలపై సంబంధిత అధికారులు ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలని జిల్లా ప్రజాపరిషత్ చైర్‌పర్సన్ గద్దల పద్మ సూచించారు. హన్మకొండలోని జిల్లా ప్రజాపరిషత్ కార్యాలయంలో సోమవారం స్థాÄæూ సంఘాల సమావేశం జరిగింది. మూడో స్థాÄæూ సంఘం జెడ్పీ వైస్ చైర్మన్ చెట్టుపల్లి మురళీధర్ అధ్యక్షతన జరగగా వ్యవసాయ, ఉద్యా న, పశుసంవర్థక, మత్స్య, పట్టు పరిశ్రమ శాఖలపై సమీక్షించారు. ఐదో స్థాÄæూ సంఘం సంగెం జెడ్పీటీసీ సభ్యురాలు గుగులోతు వీరమ్మ అధ్యక్షతన జరగగా మహిళా, శిశు సంక్షేమ కార్యక్రమాలపై సమీక్షించారు. పర్వతగిరి జెడ్పీటీసీ సభ్యురాలు మాదాసి శైలజ అధ్యక్షత జరిగిన ఆరో స్థాÄæూ సంఘం సమావేశంలో సాంఘిక, గిరిజన, వెనుకబడిన తరగతులు, వికలాంగుల సంక్షేమం, షెడ్యూల కులాల అభివృద్థి పనుల ప్రగతిపై సమీక్షించారు. ఇంకా 2, 4, 7వ స్థాÄæూ సంఘాల సమావేశం జెడ్పీ చైర్‌పర్సన్ గద్దల పద్మ అధ్యక్షతన జరిగింది.
ప్రిన్సిపాల్‌ను వేధిస్తున్న ఉపాధ్యాయులు
ఖానాపురం మోడల్ స్కూల్‌లో ఉపాధ్యాయులు ప్రిన్సిపాల్‌ను వేధిస్తున్నారని, ఉపాద్యాయుల తీరుతో విద్యార్థులు టీసీలు తీసుకుని వెళ్లిపోతున్నారని జెడ్పీటీసీ సభ్యుడు ఎడ్ల జగన్మోçßæన్‌రెడ్డి డీఈఓ రాజీవ్ దృష్టికి తీసుకెళ్లారు. దీనికి స్పందించిన డీఈఓ రాజీవ్ ఆ పాఠశాలలోని ఓ ఉపాధ్యాయుడు, ప్రిన్సిపాల్ మ ధ్య బేదాభిప్రాయాలున్నాయని వివరించారు. ఈ మే రకు ఆటంకాలు కలిగిస్తున్న ఉపాధ్యాయులపై చర్య లు తీసుకోవాలని జెడ్పీటీసీ కోరారు. ఖానాపురం మండలంలోని ఐటీడీఏ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య ను మించి ఉపాధ్యాయులున్నారని చెప్పారు. దుగ్గొం డి ఎంఈఓ పని తీరు బాగాలేదని జెడ్పీ చైర్‌పర్సన్ గద్దల పద్మ డీఈఓకు చెప్పారు. మధ్యాహ్న భోజన పథకానికి సకాలంలో బియ్యం సరఫరా చేయడం లేదని నర్సింహులపేట జెడ్పీటీసీ సభ్యుడు ధర్మారపు వేణు సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. నర్మెట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారి అందుబాటులో ఉండడం లేదని జెడ్పీ చైర్‌పర్సన్ వైద్య, ఆరోగ్య శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జెడ్పీ సీఈఓ ఎస్.విజయ్‌గోపాల్ కల్పించుకుని నర్మెటలో రెగ్యులర్‌గా ఉండే డాక్టర్‌ను నియమించాలని సూచించారు. మద్దూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అధ్వానంగా తయారైందని, ఎన్నిసార్లు చెప్పినా అధికారులు పట్టించుకోవడం లేదని మద్దూరు జెడ్పీటీసీ సభ్యురాలు నాచగోని పద్మ అసహనం వ్యక్తం చేశారు. అలాగే, జిల్లాలో మంజూరైన గోదాంల నిర్మాణం పనులు కొనసాగడం లేదని పీఆర్ అధికారులు సమావేశం దృష్టికి తీసుకు వచ్చారు. సర్పంచ్‌లు ఈ పనులు చేయాల్సి ఉండగా ముందుకు రావడం లేదని అధికారులు తెలిపారు. దీనికి స్పందిన స్థాయి సం ఘం మంజూరైన గ్రామంలో నెల రోజుల్లో గోదాంల నిర్మాణం పనులు మొదలు పెట్టకపోతే వాటిని రద్దు చేసి ఆసక్తి కనబరిచే గ్రామాల్లో నిర్మాణానికి మంజూ రు ఇవ్వాలని సమావేశం తీర్మానించారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ ఎస్.విజయ్‌గోపాల్, డిప్యూటీ సీఈఓ అనిల్‌కుమార్‌రెడ్డి, వ్యవసాయ శాఖ జేడీ ఉషాదయాళ్, ఉద్యాన శాఖ డీడీ సునీతతో పాటు ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement