హైదరాబాద్ : ఇంజనీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఎంసెట్-2014) ఎంసెట్ పరీక్ష మే 17న నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యామండలి వెల్లడించింది. ఉన్నత విద్యామండలి ఛైర్మన్ వేణుగోపాల్ రెడ్డి గురువారం పరీక్షల షెడ్యూల్ను విడుదల చేశారు. ఎంసెట్ జరిగిన వారం రోజుల్లోనే ఫలితాలు ప్రకటిస్తామని వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. ఫిబ్రవరి 10న ఎంసెట్ నోటిఫికేషన్ వెలువడనుంది. మే 17న పరీక్ష నిర్వహించి జూన్ 2న ఫలితాలు వెల్లడి కానున్నాయి. వచ్చే ఏడాది ఆన్లైన్ విధానం ద్వారా ఎంసెట్ నిర్వహించే యోచన ఉన్నట్లు తెలిపారు. కాగా ఎన్నికల షెడ్యూల్ విడుదల అయితే పరీక్షల్లో మార్పులు ఉంటాయని పేర్కొన్నారు.
ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీలు ఖరారు
ఫిబ్రవరి 10న ఎంసెట్ నోటిఫికేషన్
మే 17న ఎంసెట్, 2న ఎంసెట్ ఫలితాలు
మే 5న పీఈ సెట్
మే 10న ఈసెట్
మే 21 పాలిసెట్
మే 25 ఐసెట్
జూన్ 2న ఎడ్ సెట్
జూన్ 8న లాసెట్
జూన్ 25 నుంచి 29 వరకూ పీజీ ఈసెట్
మే 17న ఎంసెట్ పరీక్ష
Published Thu, Dec 26 2013 2:12 PM | Last Updated on Thu, Jul 11 2019 6:33 PM
Advertisement
Advertisement