సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్
సాక్షి, న్యూఢిల్లీ: ఎంసెట్ పరీక్ష నిర్వహణ ఆలస్యమైన నేపథ్యంలో మెడికల్ అడ్మిషన్ల ప్రక్రియకు మరో నెల రోజులు గడువు పెంచాలని కోరుతూ సోమవారం సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. సెప్టెంబర్ 30 నాటికి కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తవ్వాలని గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసినందున ప్రభుత్వం మరికొంత గడువు కోరింది.
తెలంగాణలో అడ్మిషన్ల ప్రక్రియ ఆలస్యమైతే తమపై ప్రభావం చూపుతుందని, తమకూ కొంత సమయం అవసరమవుతుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఎన్టీఆర్ హెల్త్ వ ర్సిటీ, ప్రైవేటు కళాశాలలు పిటిషన్లు దాఖలు చేశాయి. బుధవారం పిటిషన్లు విచారణకు వచ్చే అవకాశం ఉంది.
మెడికల్ కౌన్సెలింగ్ గడువు పెంచండి
Published Tue, Sep 27 2016 1:19 AM | Last Updated on Sun, Sep 2 2018 5:24 PM
Advertisement
Advertisement