అల్ ది బెస్ట్
విజయనగరం రూరల్/అర్బన్, న్యూస్‌లైన్: ఇంజినీరింగ్, మెడిసిన్, అగ్రికల్చరల్ తదితర కోర్సుల్లో ప్రవేశాలకు గురువారం నిర్వహించనున్న ఎంసెట్-2014కు హాజరయ్యే విద్యార్థులు ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదని, గంటముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని ఎంసెట్ జిల్లా రీజినల్ కోఆర్డినేటర్, జేఎన్‌టీయూ ప్రిన్సిపాల్ డాక్టర్ జి.యేసురత్నం బుధవా రం తెలిపారు. ఈ ఏడాది జిల్లాలో 5,228 మంది విద్యార్థులు ఎంసెట్ రాయనున్నారని తెలిపారు. ఇంజినీరింగ్ విభాగంలో 3,834 మంది, మెడిసిన్ విభాగంలో 1394 మంది హాజరు కానున్నారని చెప్పారు.
విజయనగరం జి ల్లా కేంద్రం పరిసర ప్రాంతాల్లో ఈ పరీక్ష నిర్వహణ కోసం ఇంజినీరింగ్‌కు ఆరు, మెడిసిన్, అగ్రికల్చరల్‌కు రెండు కేం ద్రాలను కేటాయించారు. ఇంజినీరింగ్ పరీక్ష ఉదయం 10 నుంచి ఒంటి గంట వరకు, మెడిసిన్, అగ్రికల్చరల్ పరీక్షను మధాహ్నం 2.30 నుంచి 5.30 వరకు నిర్వహించనున్నారు. మెడిసిన్ పరీక్ష జరిగే అన్ని కేంద్రాలకు జేఎన్‌టీయూ ప్రత్యేక పర్యవేక్షకులను పంపించనుంది. వీరితోపాటు స్థానిక పరిశీలకులు కూడా పర్యవేక్షించనున్నారు. పరీక్ష నిర్వహించే కేంద్రాలలో అక్కడి కళాశాలల ప్రిన్సిపాళ్లు చీఫ్ సూపరింటెండెంట్లుగా వ్యవహరించనున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులు ఇబ్బంది పడకుం డా ఫర్నిచర్, మంచినీటి సౌకర్యంతోపాటు ప్రథమ చికిత్స నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తిచేశారు.
ఉచిత బస్సు సౌకర్యం
విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకోవడానికి విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి ఉదయం 8.30 గంటలకు, 8.45 గంటలకు, 9.00 గంటలకు ఉచిత బస్సు సర్వీసులు ఏర్పాటు చేశారు. అయితే పరీక్షా కేంద్రాలకు సమయానికి చేరుకోవలసిన బాధ్యత విద్యార్థులదేనని అధికారులు తెలి పారు. ఎంసెట్ పరీక్షలు జరిగే అన్ని కేంద్రాల వద్ద పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కేంద్రాల పరిసరాల్లో 144వ సెక్షన్‌ను అమలు చేయనున్నారు.
ఇంజినీరింగ్ విభాగం (నాలుగు కేంద్రాలు)
1. జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాల యం-01 (జేఎన్‌టీయూ, విజయనగరం క్యాంపస్)
2. ఎంవీజీఆర్ ఇంజినీరింగ్ కళాశాల -03 (చింతలవలస- డెంకాడ మండలం)
3. సీతం ఇంజినీరింగ్ కళాశాల-01,(గాజులరేగ- విజయనగరం)
4. ప్రావీణ్య ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ కళాశాల -01, (మోదవలస, డెంకాడ మండలం, విశాఖ రోడ్)
మెడిసిన్, అగ్రికల్చరల్ విభాగం (రెండు కేంద్రాలు)
1. జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాల యం-01 (జేఎన్‌టీయూ, విజయనగరం క్యాంపస్)2. సీతం ఇంజినీరింగ్ కళాశాల -01 (గాజులరేగ, విజయనగరం)
విద్యార్థులు పాటించాల్సినవి...
సమాధానాలు గుర్తించడంలో పెన్సిల్‌కు బదులు నీలం, నలుపు బాల్‌పాయింట్ పెన్ను మాత్రమే వినియోగించాలి.
ఓఎంఆర్ షీట్‌పై విద్యార్థి వివరాలు సక్రమంగా ఉన్నదీ లేనిదీ సరిచూసుకోవాలి.
పరీక్ష కేంద్రంలోనికి విద్యార్థులకు గంట ముందుగా అనుమతిస్తారు. ఇంజినీరింగ్‌కు ఉదయం 8 గంటలకు, మెడిసిన్‌కు మధ్యాహ్నం 1.30 గంటల నుంచి అనుమతిస్తారు.
పరీక్షకు 30 నిమిషాల ముందు ఓఎంఆర్ షీట్‌ను అందిస్తారు.
విద్యార్థులు ఎటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులు, సెల్ ఫోన్లు తీసుకురాకూడదు.
పరీక్ష రాయడానికి ఉపయోగించే అట్టలు కూడా పరీక్ష కేంద్రలోని అనుమతించరు.
ఒత్తిడిని జయించండి....
చివరి సమయంలో నూతన అంశాల జోలికి వెళ్లకండి.
పరీక్ష బాగా రాయగలననే దృఢమైన నమ్మకంతో పరీక్షకు వెళ్లండి.
స్నేహితులతో చర్చించి అనవసర ఆందోళన చెందకండి.
ఇతరులతో పోల్చుకుంటూ భయపడకండి.
పరీక్షకు సంబంధించిన విషయాలు చర్చించకండి.
తగినంత విశ్రాంతి, సమతుల ఆహారం, తాగునీరు అందించాలి.
ప్రశాంతంగా ఉండాలి..
పరీక్షకు రోజున ఉదయం నుంచీ మనసును ప్రశాం తంగా ఉంచుకోవాలి. కనీసం రెండు గంటల ముందు నుంచి పరీక్షకు సంబంధించిన మెటీరియల్ చదవకూడదు. ఇతరత్రా ఆలోచనలను మనసులో ఉంచుకోకూడదు. పరీక్ష పూర్తయినంత వరకు ఇతరులతో మాట్లాడకూడదు. తాగునీటిని అందుబాటులో ఉంచుకోవాలి. రాని ప్రశ్నలను చది వి దిగులు పడకుండా వచ్చిన ప్రశ్నలకు జవాబు రాయడానికే తొలి ప్రాధాన్యమివ్వాలి.
-డాక్టర్ ఎన్.వి.సూర్యనారాయణ, సైకాలజిస్ట్