సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ హాల్ టికెట్లను అభ్యర్థులు గురువారం(8వ తేదీ) నుంచి ఈ నెల 19వ తేదీ వరకు డౌన్‌లోడ్ చేసుకోవడానికి అవకాశం కల్పించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఎంసెట్ పరీక్షను ఈ నెల 22వ తేదీన నిర్వహిస్తున్న విషయం విదితమే. ఇదిలా ఉండగా గతేడాది మంచి ర్యాంకు వచ్చి మెడిసిన్‌లో చేరిన అభ్యర్థులు దాదాపు 2వేల మంది ఈ ఏడాది కూడా దరఖాస్తు చేసుకున్న నేప థ్యంలో వారిపై నిఘా ఉంచాలని ఎంసెట్ అధికారులు పోలీసులకు సూచించారు.