
తెలంగాణకు ప్రత్యేక రాజ్యాంగం ఉందా ?
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తనదైన శైలిలో విమర్శించారు. కేసీఆర్ తెలంగాణ సీఎంలా కాకుండా ఉద్యమ నేతగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ భారత్లో అంతర్భాగం కాదా...? తెలంగాణకు ప్రత్యేక రాజ్యాంగం ఉందా అంటూ టీఆర్ఎస్ ప్రభుత్వానికి గంటా ప్రశ్నల వర్షం కురిపించారు.
ఎంసెట్ అంశంపై సోమవారం కేబినెట్లో చర్చిస్తామన్నారు. అలాగే అవసరమైతే తెలంగాణ విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరితో చర్చిస్తామన్నారు. ఏపీ ఉన్నత విద్యామండలి ఖాతాలను ఫ్రీజ్ చేయడాన్ని ఖండిస్తున్నట్లు గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. ఎస్బీహెచ్పై పరువు నష్టం దావా వేస్తామని చెప్పారు.