
'ఎంసెట్ కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి'
హైదరాబాద్: ఇంటర్ విద్యార్థలు ఎంసెట్ పరీక్ష దృష్ట్యా ఆర్టీసీ కార్మికులు సమ్మె నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆదేశించారు. ఎంసెట్ నిర్వహణపై ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఎంసెట్ కన్వీనర్తో మంత్రి గంటా సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన ఆర్టీసీ సమ్మె గురించి మాట్లాడుతూ.. విద్యార్థులు, నిరుద్యోగుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఎంసెట్ పరీక్షకు బస్సులు లేకుంటే విద్యార్థులు చాలా ఇబ్బందులు పడతారని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు. ఈ సమయంలో డీఎస్సీ అభ్యర్థులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటారని గంటా శ్రీనివాసరావు అన్నారు.